Do not have an account?
Already have an account?

1. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నా ప్రొఫైల్ అప్‌డేట్ చేయబడిందా అని నాకు ఎలా తెలుస్తుంది?
మీ ప్రొఫైల్‌లో ఏదైనా సమాచారం అప్‌డేట్ చేయబడితే, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన ప్రాథమిక ఇ-మెయిల్ ఐడిపై ఇ-మెయిల్ అందుకుంటారు.


2. నేను NRIని, నా దగ్గర ఇండియా నంబర్ లేదు. నా పరిచయ వివరాలను ధృవీకరించడానికి నేను ఓటీపి ని ఎలా పొందగలను?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇ-మెయిల్ IDకి ఓటీపి వస్తుంది.


3. ప్రొఫైల్ అప్‌డేట్ చేయడం తప్పనిసరా?
లేదు, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ ప్రొఫైల్‌ను నవీకరించడం తప్పనిసరి కాదు. అయితే, మెరుగైన వినియోగదారుని అనుభవాన్ని పొందడం కోసం (ముందుగా నింపటంతో సహా), ఆదాయపు పన్ను శాఖ నుండి సకాలంలో సమాచారం అందుకోవడానికి మీ ప్రొఫైల్‌ను నవీకరించాలని సిఫార్సు చేయబడింది.


4. ప్రొఫైల్ అప్‌డేట్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి?
మీరు అప్‌డేట్ చేసిన ప్రొఫైల్ వివరాలు, అవసరమైతే, ITD మీతో సకాలంలో కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీకు వర్తించే వివిధ ఫారమ్‌లు మరియు ITRలను ముందే పూరించడానికి ఇది ఇన్‌పుట్‌ను కూడా అందిస్తుంది.


5. నా ప్రొఫైల్ లో నేను సవరించగల / అప్‌డేట్ చేయగల వివరాలు ఏమిటి?
మీ ప్రొఫైల్ లో మీరు ఈ క్రింది వాటిని అప్‌డేట్ చేయవచ్చు లేదా సవరించవచ్చు:

  • ఆదాయ మూలం వివరాలు
  • బ్యాంక్ ఖాతా మరియు డీమాట్ ఖాతా వివరాలు
  • DSC రిజిస్టర్ చేయండి
  • సంప్రదింపు వివరాలు (OTP ప్రమాణీకరణ ద్వారా), ముఖ్యమైన వ్యక్తుల వివరాలు
    • మీరు పన్ను చెల్లింపుదారులుగా లాగిన్ చేయబడితే - మీ నివాస స్థితి మరియు పాస్‌పోర్ట్ నంబర్ వంటి మీ ప్రాథమిక ప్రొఫైల్ వివరాలను సవరించవచ్చు; ప్రాథమిక మరియు రెండవ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID మరియు చిరునామా వంటి సంప్రదింపు వివరాలను కూడా సవరించవచ్చు.
    • మీరు ERIగా లాగిన్ చేయబడితే - మీ బాహ్య ఏజెన్సీ రకం, సేవల రకం, సంస్థ యొక్క PAN; సంస్థ యొక్క TAN; సంప్రదింపు వివరాలు వంటి మీ ప్రాథమిక ప్రొఫైల్ వివరాలను సవరించవచ్చు; ధ్రువ పత్రాలను నిర్వహించవచ్చు; ప్రధాన కాంటాక్ట్ వివరాలు, ప్రిన్సిపల్ కాంటాక్ట్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు, ERIని జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు, ERI రకం మార్చవచ్చు.
    • మీరు బాహ్య ఏజెన్సీగా లాగిన్ అయితే - మీ సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేయవచ్చు, ధృవపత్రాలను నిర్వహించవచ్చు, కీలక వ్యక్తులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు మరియు సేవలను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు.
    • మీరు TIN 2.0 వాటాదారుగా లాగిన్ చేయబడితే - మీ సంప్రదింపు వివరాలను అప్‌డేట్ చేయవచ్చు, ధృవపత్రాలను నిర్వహించవచ్చు, కొత్త సాంకేతిక ఎస్.పి.ఓ.సి. వివరాలను జోడించవచ్చు లేదా నవీకరణ చేయవచ్చు.

6. నా ప్రొఫైల్ ప్రకారం ప్రాథమిక మరియు ద్వితీయ చిరునామాలు రెండింటికీ ఐ.టి.డి. నుంచి కమ్యూనికేషన్ పొందగలనా?
అవును, మీరు మీ ఇ-ఫైలింగ్ ప్రొఫైల్‌లో జోడించిన ప్రాథమిక మరియు ద్వితీయ సంప్రదింపు వివరాలపై ITD నుండి కమ్యూనికేషన్‌ను అందుకోవచ్చు.


7. నా ప్రొఫైల్ ఎంత అప్‌డేట్ అవుతుందో / పూర్తి చేయబడిందో నాకు ఎలా తెలుస్తుంది?
ప్రొఫైల్ పూర్తి స్థితిని చూడటానికి మీరు మీ ప్రొఫైల్ పేజీలో ప్రొఫైల్ పూర్తి శాతం బార్‌ని చూడవచ్చు. క్రింద పేర్కొన్న వినియోగదారుల కేటగిరీలు మినహా నమోదైన వినియోగదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది:

  • ఇఆర్ఐ లు
  • బాహ్య ఏజెన్సీలు
  • TIN 2.0 వాటాదారులు
  • ITDREIN
  • పన్ను మినహాయించు మరియు వసూలుచేయు వ్యక్తి

8. నా డి ఎస్ సి నమోదు చేయబడిందా అని నాకు ఎలా తెలుస్తుంది?
మీరు మీ ప్రొఫైల్‌కి వెళ్లి, స్థితిని చూడటానికి DSCని రిజిస్టర్ చేయండి క్లిక్ చేయవచ్చు. CA/కంపెనీ/ERI కోసం, PAN/ప్రధాన సంప్రదింపు కోసం DSC రిజిస్టర్ చేయకపోతే లేదా గడువు ముగియకపోతే, లాగిన్‌ల చేసిన తరువాత ప్రొఫైల్‌లో అదే విధంగా సందేశం ప్రదర్శించబడుతుంది. అదనంగా, మీరు మరింత తెలుసుకోవడానికి DSC రిజిస్టర్ చేయండి యూజర్ మాన్యువల్‌ను చూడండి.