Do not have an account?
Already have an account?

1. అవలోకనం

ఇ-ఫైలింగ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న వినియోగదారులందరికీ నా ఇ.ఆర్.ఐ. సేవ లభ్యమవుతుంది.నా ఇ.ఆర్.ఐ. సేవతో, నమోదు చేసుకున్న వినియోగదారులు చేయగలిగేవి:

  • ఇ-రిటర్న్ మధ్యవర్తి (ఇ.ఆర్.ఐ.)ని చేర్చండి
  • ఇ.ఆర్.ఐ.ను క్రియాశీలం / నిష్క్రియం చేయండి
  • క్రియాశీల ఇ.ఆర్.ఐ. యొక్క చెల్లుబాటు గడువును పెంచండి

2. ఈ సేవను వినియోగించుకోవటానికి ముందస్తు ఆవశ్యకతలు

  • ఇ-ఫైలింగ్ పోర్టల్ యొక్క నమోదు చేయబడిన యూజర్
  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేసుకున్న క్రియాశీల ఇ.ఆర్.ఐ. యొక్క చెల్లుబాటయ్యే ఇ.ఆర్.ఐ. వినియోగదారు ఐ.డి..

3. దశల వారీగా మార్గదర్శిని

3.1 ఇ.ఆర్.ఐ.ను చేర్చండి.

దశ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌ని ఉపయోగిస్తూ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive


దశ 2: అధీకృత భాగస్వాములు > నా ఇ-రిటర్న్ మధ్యవర్తి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: నా ఇ-రిటర్న్ మధ్యవర్తి పేజి కనిపిస్తుంది. సంబంధిత ట్యాబ్‌ల (యాక్టివ్ ట్యాబ్ మరియు ఇనాక్టివ్ ట్యాబ్) కింద యాక్టివ్ మరియు ఇనాక్టివ్ ఇ.ఆర్.ఐ.(లు) ఏవైనా ఉంటే, వాటిని ప్రదర్శిస్తుంది. ఇ.ఆర్.ఐ. వివరాలు చూడటానికి, ఇ.ఆర్.ఐ. పేరు క్లిక్ చేయవచ్చు. ఇ.ఆర్.ఐ.ని చేర్చటం ప్రారంభించటానికి, ఇ.ఆర్.ఐ. చేర్చండి అనే పదం మీద క్లిక్ చేయండి.

Data responsive


దశ4: ఇ.ఆర్.ఐ. యూజర్ పేరు, ఇ.ఆర్.ఐ. యూజర్ ఐడి, రాష్ట్రం మరియు నగరం లాంటి అవసరమైన వివరాలను రాసి, ఇ.ఆర్.ఐ. శోధించండిపై క్లిక్ చేయండి.

Data responsive


దశ5: మీ శోధన ప్రమాణాలకు తగిన ఇ.ఆర్.ఐ.లన్నీ ప్రతీ ఇ.ఆర్.ఐ.చే దాఖలు చేయబడిన మొత్తం రిటర్న్స్, వాటి స్కోర్, మరియు ఫైల్ చేయటానికి ఆదాయపు పన్ను శాఖచే అధికారం ఇవ్వబడ్డాయి అనే సమాచారంతో పాటు ఒక జాబితా ప్రదర్శితం అవుతుంది. మీరు ఎంచుకున్న ఒక ఇ.ఆర్.ఐ.ని యాక్టివేట్అనే మాటపై క్లిక్ చేయండి.

Data responsive


దశ6: ఇ.ఆర్.ఐ. కోసం చెల్లుబాటయ్యే కాల వ్యవధిని ఎంచుకుని, చేర్చండి అనే మాటపై క్లిక్ చేయండి.

Data responsive


దశ7: ఎంపిక చేయబడిన ఇ.ఆర్.ఐ.ని చేర్చడానికి నిర్ధారించండి అనే మాటమీద క్లిక్ చేయండి.

Data responsive


దశ 8: ఇ.ఆర్.ఐ. చేర్చబడినప్పుడు విజయవంతం అయిందన్న ఒక సందేశం వస్తుంది.

Data responsive


నా ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీ పేజిలోని ఇతర సేవలు దిగువ వివరించినట్లుగా ఉన్నాయి:

ఇ.ఆర్.ఐ.ని యాక్టివేట్ చేయండి సెక్షన్ 3.2
ఇ.ఆర్.ఐ.ని డీయాక్టివేట్ చేయండి సెక్షన్ 3.3
ఇ.ఆర్.ఐ. చెల్లుబాటయ్యే గడువు పొడిగించండి. సెక్షన్ 3.4

3.2 ఇ.ఆర్.ఐ.ని యాక్టివేట్ చేయండి

దశ1: నా ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీ పేజీలో, ఇనాక్టివ్ ఇ.ఆర్.ఐ. ట్యాబ్‌లో అవసరమైన ఇ.ఆర్.ఐ.కు ఎదురుగా ఉన్న యాక్టివేట్ పై క్లిక్ చేయండి.
గమనిక:
ఒకరు కంటే ఎక్కువ ఇనాక్టివ్ ఇ.ఆర్.ఐ.లను మీరు కలిగి ఉంటే, పేరు ద్వారా ఇ.ఆర్.ఐ.ని వెతకడానికి మీరు శోధన ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

Data responsive


దశ2 : ఇ.ఆర్.ఐ. ని చేర్చండి అన్న పేజీలో, ఇ.ఆర్.ఐ.కి చెందిన ముందుగా నింపిన వివరాలు ప్రదర్శితమవుతాయి ఇ.ఆర్.ఐ. కోసం చెల్లుబాటు కాదగిన కాలవ్యవధిని ఎంచుకుని, చేర్చండి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ3: ఎంపిక చేయబడిన ఇ.ఆర్.ఐ.ని చేర్చడాన్ని పూర్తిచేసేందుకు నిర్ధారించండి మీద క్లిక్ చేయండి.

Data responsive


దశ4: ఇ.ఆర్.ఐ.ని చేర్చిన తరువాత విజయవంతం అయిందన్న ఒక సందేశం ప్రదర్శితం అవుతుంది.

Data responsive


3.3 ఇ.ఆర్.ఐ.ని డీయాక్టివేట్ చేయండి

దశ1: నా ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీ పేజీలో, ఇ.ఆర్.ఐ. జాబితాను చూడటానికి యాక్టివ్ ఇ.ఆర్.ఐ. ట్యాబ్ కు వెళ్ళండి. అవసరమైన ఇ.ఆర్.ఐ.కు ఎదురుగా డీయాక్టివేట్ మీద క్లిక్ చేయండి.

Data responsive


దశ2: నిర్ధారణ స్క్రీన్ లో, ఇ.ఆర్.ఐ. డీయాక్టివేట్ చేయటానికి నిర్ధారించు లేదా ముందరి పేజీకి వెనుకకు వెళ్ళందుకు రద్దు చేయండి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: ఎంచుకున్న ఇ.ఆర్.ఐ. డీయాక్టివేట్ చేసినప్పుడు విజయవంతం అయిందన్న సందేశం ప్రదర్శితమవుతుంది.

Data responsive


3.4ఇ.ఆర్.ఐ. గడువును పొడిగించండి.

దశ 1: ఈ ఫీచర్‌ను ఉపయోగించి ఒక క్రియాశీలమైన ఇ.ఆర్.ఐ. చెల్లుబాటు కాలవ్యవధిని మీరు పొడిగించవచ్చు. నా ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీ పేజీలో, యాక్టివ్ ట్యాబ్‌లో అవసరమైన ఇ.ఆర్.ఐ.కు ఎదురుగా కాలవ్యవధి చెల్లుబాటును పొడిగించండి అనే మాటపై క్లిక్ చేయండి.

Data responsive


దశ2: కాలవ్యవధి చెల్లుబాటును పెంచే పేజీలో, తేదీ ద్వారా గానీ లేదా అవధి ద్వారా గానీ అవసరమైన చెల్లుబాటును ఎంచుకోండి మరియు కొనసాగించండి పై క్లిక్ చేయండి.

Data responsive


గమనిక: తేదీ అనేది ఒక నిర్దిష్ట తేదీ నుండి మరొక తేదీకి చెల్లుబాటు పేర్కొనగా అవుతుండగా, అవధిని ఒక నిర్దిష్ట నెల నుండి మరొక నెలకు చెల్లుబాటు అవుతుందని చెబుతుంది

దశ 3: ఇ.ఆర్.ఐ. యొక్క చెల్లుబాటు అవధి పొడిగించబడిందని నిర్ధారించటానికి విజయవంతమైందన్న ఒక సందేశం వస్తుంది.

Data responsive


4. సంబంధిత అంశాలు

  • లాగిన్
  • డ్యాష్‌బోర్డ్
  • పనిజాబితా
  • వినియోగదారుని ప్రొఫైల్ నిర్వహణ
  • నా సి.ఏ.
  • ప్రతినిధిగా అధీకృతం చేయండి మరియు నమోదు చేయండి
  • ఇ.ఆర్.ఐ. నమోదు