Do not have an account?
Already have an account?

1. అవలోకనం


చెల్లుబాటు అయ్యే PAN ఉన్న పన్ను చెల్లింపుదారులకు ( ఇ - ఫైలింగ్‌తో నమోదు చేయబడిన లేదా నమోదు చేయని ) మీ AOను తెలుసుకోండి సేవ అందుబాటులో ఉంది. ఈ సేవ ఒక నిర్దిష్ట PAN కోసం అధికార పరిధి మదింపు అధికారి ( AO ) వివరాలను వీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సేవను పొందడానికి మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వవలసిన అవసరం లేదు.

2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు

  • చెల్లుబాటయ్యే PAN
  • చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్

3. దశలవారీ మార్గదర్శిని


దశ 1: ఇ - ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజ్ కు వెళ్లండి మరియు మీ AO గురించి తెలుసుకోండి పై క్లిక్ చేయండి .

Data responsive



దశ 2 : మీ అధికార పరిధి మదింపు అధికారి గురించి తెలుసుకోండి పేజీలో, మీ PAN మరియు చెల్లుబాటు అయ్యే మొబైల్ సంఖ్య నమోదు చేసి కొనసాగండి పై క్లిక్ చేయండి.

Data responsive



దశ 3: మీరు దశ 2 లో నమోదు చేసిన మొబైల్ సంఖ్యపై 6 అంకెల OTPని స్వీకరిస్తారు. ధ్రువీకరణ పేజీలో, OTP ను నమోదు చేసి ధృవీకరించండి ని క్లిక్ చేయండి.

Data responsive


గమనిక:

  • OTP కేవలం 15 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది.
  • సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉంటాయి.
  • స్క్రీన్‌పై OTP గడువు ముగిసే కౌంట్‌డౌన్ టైమర్ OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
  • OTP మళ్ళీ పంపండి క్లిక్ చేసిన తరువాత, కొత్త OTP జనరేట్ అయ్యి పంపించబడుతుంది.

విజయవంతంగా OTP ధృవీకరణ మీద, మీరు మీ PAN స్థితితో పాటు, అధికార పరిధి మదింపు అధికారి యొక్క వివరాలను (ఏరియా కోడ్, AO రకం, పరిధి కోడ్, AO సంఖ్య, AO యొక్క అధికార పరిధి, చిరునామా మరియు AO ఈమెయిల్ ID వంటివి ) చూస్తారు.

Data responsive

4. సంబంధిత అంశాలు