Do not have an account?
Already have an account?

1. చెల్లింపు స్థితి సేవ అంటే ఏమిటి?
ఈ సేవ ద్వారా, మీరు ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ విధానాల ద్వారా జమచేసిన పన్ను చెల్లింపు స్థితిని వీక్షించగలరు.

2. పన్ను చెల్లించే విధానాలు ఏమిటి?
మీరు ఈ పద్ధతుల ద్వారా చెల్లించవచ్చు:

  • నెట్ బ్యాంకింగ్; లేదా
  • క్రెడిట్ కార్డ్; లేదా
  • డెబిట్ కార్డ్; లేదా
  • బ్యాంక్ కౌంటర్ వద్ద చెల్లించండి; లేదా
  • RTGS / NEFT.

3. చలాన్ పూర్తిచేసిన తరువాత పన్ను చెల్లించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా?
మీరు చలానా రూపొందించిన తేదీ నుండి 15రోజుల్లోపు పన్ను చెల్లించవలసి ఉంటుంది (అంటే CRN ఉత్పత్తి తేదీ నుండి 15 రోజులు).
ముందస్తు పన్ను విషయంలో, మీరు CRN రూపొందించిన తేదీ నుండి 15 రోజులలోపు లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 31 వ మార్చికి ముందు, ఏది ముందు అయితే అప్పుడు, చెల్లించాలి.

4. ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల ఖాతాకు నా చెల్లింపు విజయవంతంగా జమచేయబడినట్టు నాకు ఎలా తెలుస్తుంది?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేయబడిన మీ ఇ-మెయిల్ ID మరియు మొబైల్ సంఖ్య‌పై ధృవీకరణ ఇ-మెయిల్ మరియు SMS‌ను అందుకుంటారు. అంతేకాకుండా, చెల్లింపు చరిత్ర (పేమెంట్ హిస్టరీ)లో CIN‌తో పాటు విజయవంతమైన చెల్లింపు స్థితిని ప్రతిబింబిస్తుంది. దీన్ని బ్యాంక్ ధృవీకరించి అందజేస్తుంది.

5. నేను చెల్లించని CRN స్థితిని నేను తనిఖీ చేయగలనా?
మీవద్ద ఈ క్రింద పేర్కొన్న వివరాలు ఉంటే మీరు ఏదైనా CRN/ PAN యొక్క స్థితిని తనిఖీ చేయవచ్చు:

  • CRN లేదా చలానా సూచన సంఖ్య;
  • (చెల్లుబాటు అయ్యే) PAN / TAN (వీటి సంబంధంగా జరిగిన చెల్లింపు); మరియు
  • మీకు అందుబాటులో ఉన్న ఒక క్రియాశీల మొబైల్ సంఖ్య.

6. బ్యాంకు నుండి ఎటువంటి స్పందన లేకపోతే చెల్లింపును మళ్ళీ ప్రారంభించాల్సిన అవసరం ఉందా?
బ్యాంకు నుండి వివరాలు అందుకున్న తర్వాత స్థితి అప్‌డేట్ చేయబడుతుంది. దయచేసి ఒక గంట వేచి ఉండి, CRN స్థితిని తనిఖీ చేయండి. మొత్తం డెబిట్ చేయబడితే, దయచేసి బ్యాంకును సంప్రదించండి.

7. పన్ను చెల్లింపు విఫలమైతే నేను అదే CRN‌తో చెల్లింపు చేయవచ్చా?
మొత్తం డెబిట్ చేయబడితే, దయచేసి బ్యాంకును సంప్రదించండి.
దయచేసి కాపీ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా లేదా కొత్త చెల్లింపును క్లిక్ చేయడం ద్వారా కొత్త చలానాను రూపొందించండి

8. లావాదేవీ విఫలమైతే నేను ఏమి చేయాలి?
మొత్తం డెబిట్ చేయబడితే, దయచేసి బ్యాంకును సంప్రదించండి.

9. బ్యాంక్ ధృవీకరణ కోసం నేను సందేశం చూస్తే నేను ఏమి చేయాలి?
లావాదేవీని తనిఖీ చేసిన తర్వాత లావాదేవీ స్థితి అప్‌డేట్ చేయబడుతుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ బ్యాంక్‌ను సంప్రదించండి.

10. వివరాలు తప్పు అని నాకు బ్యాంక్ నుండి సందేశం వచ్చింది, నేను CRN కోసం చెల్లింపును మళ్ళీ ప్రారంభించవచ్చా?
మొత్తం డెబిట్ చేయబడితే, దయచేసి బ్యాంకును సంప్రదించండి.