Do not have an account?
Already have an account?

మీ ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.ను నిర్వహించండి - తరచుగా అడిగే ప్రశ్నలు

1. ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. అంటే ఏమిటి?
ఆదాయపు పన్ను శాఖ నివేదించు సంస్థ గుర్తింపు సంఖ్య (ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.) అనేది ఆదాయపు పన్ను శాఖ (ఐ.టి.డి.) ఒక నివేదించు సంస్థకి కేటాయించిన గుర్తింపు సంఖ్య. ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. రూపొందించిన తరువాత దానికి ఎదురుగా అధీకృత వ్యక్తిని చేర్చిన తరువాత, అధీకృత వ్యక్తిని అప్‌లోడ్ చేయవచ్చు మరియు / లేదా ఫారం 15సి.సి. మరియు ఫారం V ని చూడవచ్చు.

2. ఫారమ్ 15సి.సి. అంటే ఏమిటి? దీన్ని ఎవరు దాఖలు చేయాలి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 195(6) ప్రకారం, ఆర్థిక సంవత్సరం త్రైమాసంలో చేసిన చెల్లింపులకు సంబంధించి అధీకృత వ్యక్తి త్రైమాస ప్రకటనలను ఫారం 15సిసిలో సమర్పించాల్సి ఉంటుంది.
నివేదించు సంస్థకు చెందిన అధీకృత వ్యక్తి ఆ సంస్థ ద్వారా రూపొందించబడిన ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.కు మ్యాప్ చేయబడితే, అధీకృత వ్యక్తి ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. పాన్ మరియు పాస్‌వర్డ్‌తో పోర్టల్‌కు లాగిన్ అయి ఫారం 15సి.సి.ని సమర్పించాలి.

3. ఫారం V అంటే ఏమిటి? దీన్ని ఎవరు దాఖలు చేయాలి?
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ స్కీమ్ (పి.ఎం.జి.కె.), 2016 ప్రకారం, అధీకృత బ్యాంకులు పి.ఎమ్.‌జి.కె. క్రింద చేసిన డిపాజిట్ల వివరాలను ఫారం V లో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది.

4. నియమించబడిన డైరెక్టర్ మరియు ప్రధాన అధికారి పదవుల్లో ఒకే వ్యక్తి ఉండగలరా?
అవును. నియమించబడిన డైరెక్టర్ మరియు ప్రధాన అధికారి పాత్రను మీరు ఒకే అధీకృత వ్యక్తికి కేటాయించవచ్చు.

5. ఒక నివేదించు సంస్థ ఎన్ని ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.లను పొందవచ్చు?
ఫారం రకం మరియు నివేదించు సంస్థకు చెందిన వర్గంలోని ప్రతి ప్రత్యేక సమూహం నిమిత్తం, ఒక ప్రత్యేకమైన ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. తయారవుతుంది.

6. ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.‌ను నేను ఎలా రూపొందించగలను? అంతేకాకుండా నివేదించు సంస్థ యొక్క అధీకృత వ్యక్తిని ఎలా సక్రియం చేయగలను?
ఫారం 15 సి.సి./ఫారం V ని దాఖలు చేయవలసిన నివేదించు సంస్థ ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. (ఆదాయపు పన్ను శాఖ నివేదించు సంస్థ గుర్తింపు సంఖ్య) ను రూపొందించగలదు మరియు అధికారం కలిగిన ఏ వ్యక్తి అయినా 15సి మరియు ఫారం వి ఫారమ్‌లను అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. క్రమబద్ధీకరించడంకోసం మీరు ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. (వాడుక సూచిక)ను వినియోగించవచ్చు.

7. అధీకృత వ్యక్తిని నిష్క్రియాశీలం / క్రియాశీలం చేయవచ్చా?
అవును. ఇప్పటికే క్రియాశీలం చేయబడిన అధీకృత వ్యక్తిని వినియోగదారు (నివేదించు సంస్థ) ద్వారా నిష్క్రియాశీలంగా చేయవచ్చు. అదేవిధంగా, జోడించబడిన కానీ ఇంకా క్రియాశీలకంగా లేని అధీకృత వ్యక్తిని వినియోగదారు (నివేదించు సంస్థ) యాక్టివేట్ చేయవచ్చు.

8. ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. ఉపయోగించి ఏ ఫారమ్‌లను దాఖలు చేయాలి/అప్‌లోడ్ చేయాలి?
ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. ద్వారా సేవను ఉపయోగించి మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఫారం 15 సి.సి. మరియు ఫారం V ని అప్‌లోడ్ చేసి చూడవచ్చు.
ఏప్రిల్, 2018 నుండి జారీ చేసినట్టు ఫారం 61, ఫారం 61ఎ, మరియు ఫారం 61బి కొరకు రిజిస్ట్రేషన్ మరియు స్టేట్మెంట్ అప్‌లోడ్ సౌకర్యాలు ప్రాజెక్ట్ ఇన్ సైట్ క్రింద నివేదించు పోర్టల్‌కు తరలించబడ్డాయి.

9. నేను ఒకరు కంటే ఎక్కువ అధీకృత వ్యక్తులను జోడించవచ్చా? ఒకేసారి ఒకరి కంటే ఎక్కువ అధీకృత వ్యక్తులను సక్రియం చేయవచ్చా?
అవును. మీరు ఒక ఫారం నిమిత్తం ఒకరి కంటే ఎక్కువ అధీకృత వ్యక్తుల వివరాలను జోడించవచ్చు. అయినప్పటికీ, ఒక సమయంలో ఒక నిర్దిష్ట ఫారం కోసం ఒక అధీకృత వ్యక్తిని మాత్రమే సక్రియం చేయవచ్చు. క్రొత్త అధీకృత వ్యక్తిని విజయవంతంగా చేర్చిన తరువాత, గతంలో యాక్టివేట్ చేయబడిన అధీకృత వ్యక్తి యొక్క స్థితి డీయాక్టివేట్ అవుతుంది.