1. అవలోకనం
ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆఫ్‌లైన్ విధానము(ఆన్‌లైన్ విధానము కాకుండా)ను ఎంచుకునే ఏ పన్ను చెల్లింపుదారుడైనా ITRల కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీ ని ఉపయోగించాలి. యుటిలిటీలతో, మీరు యుటిలిటీ-జెనరేట్ చేసిన JSONని అప్‌లోడ్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITRలు) ఫైల్ చేయవచ్చు:
- ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయినా తర్వాత, లేదా
- ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా నేరుగా
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఈ సేవ కింది విధంగా ITRలను ఫైల్ చేయడానికి రెండు వేర్వేరు ఆఫ్‌లైన్ యుటిలిటీలను అందిస్తుంది:
- ITR-1 నుండి ITR-4, మరియు
- ITR-5 నుండి ITR-7
2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు
- ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వినియోగదారు
- ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా ITR ఫైల్ చేయడానికి చెల్లుబాటు అయ్యే వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్
- ITR-1 నుండి ITR-4 లేదా ITR-5 నుండి ITR-7 కోసం డౌన్‌లోడ్ చేసిన ఆఫ్‌లైన్ యుటిలిటీ
3. దశలవారీ మార్గదర్శిని
దశ: 1: ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వకుండానే, మీరు హోమ్ > డౌన్‌లోడ్‌లు నుండి సంబంధిత ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసి, 2వ దశకు వెళ్లండి.
దశ 1a: ప్రత్యామ్నాయంగా, ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత, ఇ-ఫైల్ >ఆదాయపు పన్ను రిటర్న్‌లు> లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయండి >ప్రస్తుత AY మరియు దాఖలు విధానం (ఆఫ్‌లైన్) ఎంచుకోండి క్లిక్ చేయండి. ఆపై, ఆఫ్‌లైన్ యుటిలిటీ ఎంపిక కింద డౌన్‌లోడ్‌ను క్లిక్ చేయండి.
దశ 2: ఆఫ్‌లైన్ యుటిలిటీని ఇన్‌స్టాల్ చేసి, దానిని ఓపెన్ చేయండి. ఇంతకు ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటే, మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినప్పుడు యుటిలిటీ వెర్షన్ అప్‌డేట్ అవుతుంది (వెర్షన్ అప్‌డేట్ ఏమైనా ఉంటే). కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 3: మీరు ఈ క్రింది ట్యాబ్‌లు మరియు వాటి సంబంధిత విషయాలను చూడటానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు పేజీకి వెళ్తారు.
- రిటర్న్‌లు - మీ అన్ని ITRలు (మదింపు సంవత్సరాన్ని బట్టి) ఇక్కడ ఉంటాయి. రిటర్న్‌లు దాఖలు చేయండి క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త రిటర్న్ దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.
- రిటర్న్స్ యొక్క డ్రాఫ్ట్ వెర్షన్ - మీరు పాక్షికంగా పూరించిన ITR డ్రాఫ్ట్‌ను సవరించాలనుకుంటే, రిటర్న్స్ ట్యాబ్ లోని డ్రాఫ్ట్ వెర్షన్ నుండి సంబంధిత డ్రాఫ్ట్‌పై సవరించండి క్లిక్ చేయండి.
- ముందే నింపిన సమాచారం – ఇ-ఫైలింగ్ నుండి డౌన్‌లోడ్ చేసిన ముందే నింపిన అన్ని JSON ఫైల్‌లు (PAN, పేరు, గత ఇంపోర్ట్ మరియు AY వంటి వివరాలతో) ఇక్కడ ఉన్నాయి. సంబంధిత JSON పై రిటర్న్‌లు దాఖలు చేయండి క్లిక్ చేయడం ద్వారా, మీరు ముందుగా నింపిన సమాచారంతో మీ రిటర్న్ దాఖలు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

గమనిక:
- ముందే నింపిన మీ రిటర్న్ సమాచారాన్ని ఆఫ్‌లైన్ యుటిలిటీలోకి డౌన్‌లోడ్ లేదా ఇంపోర్ట్ చేసేటప్పుడు మరియు ఆఫ్‌లైన్ యుటిలిటీలో మీరు తయారుచేసిన ITRను జనరేట్ చేసేటప్పుడు కూడా JSON ఫైల్ ఫార్మాట్ ఉపయోగించబడుతుంది.
- ఆఫ్‌లైన్ యుటిలిటీలో రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని తెలుసుకోవడానికి సెక్షన్ 4.4లో దాఖలు చేయండి, ప్రివ్యూ మరియు ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించండి అనే విభాగం చూడండి.
దశ 4:రిటర్న్‌లు ట్యాబ్‌లో, ITR దాఖలు ప్రక్రియ ప్రారంభించడానికి సంబంధిత మదింపు సంవత్సరానికి ITRరిటర్న్‌లు దాఖలు చేయండి క్లిక్ చేయండి.
గమనిక:
- కొత్త రిటర్న్‌ను ఫైల్ చేయడం ప్రారంభించడానికి రిటర్న్స్ ట్యాబ్ నుండి ఫైల్ రిటర్న్స్ క్లిక్ చేయండి.
- మీరు ఇప్పటికే మీ ముందే పూరించిన డేటాను ఆఫ్‌లైన్ యుటిలిటీలోకి డౌన్‌లోడ్ చేసి/ఇంపోర్ట్ చేసి ఉంటే, ముందుగా పూరించిన డేటా ట్యాబ్ నుండి రిటర్న్స్ ఫైల్ చేయండి క్లిక్ చేయడం ద్వారా మీరు మీ రిటర్న్‌ను ఫైల్ చేయడం ప్రారంభించవచ్చు.
ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఎలా దాఖలు చేయాలో తెలుసుకోవడానికి, ఈ క్రింది విభాగాలను చూడండి:
| ఆదాయపు పన్ను రిటర్న్‌ల కోసం (ITR-1 నుండి ITR-4 మరియు ITR-5 నుండి ITR-7 వరకు) | |
| ముందే నింపిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి (JSON ఫైల్) | 4.1 సెక్షన్ చూడండి |
| ముందే నింపిన సమాచారాన్ని ఇంపోర్ట్ చేసుకోండి (JSON ఫైల్) | 4.2 సెక్షన్ చూడండి |
| ఆన్‌లైన్ విధానంలో నింపిన డ్రాఫ్ట్ ITRను ఇంపోర్ట్ చేయండి (ఆన్‌లైన్ విధానములో అందుబాటులో ఉన్న ITR ఫారంకి వర్తిస్తుంది) |
4.3 సెక్షన్ చూడండి |
| దాఖలు చేయండి, ప్రివ్యూ చూడండి, ఆదాయ పన్ను రిటర్న్‌లను సమర్పించండి | 4.4 సెక్షన్ చూడండి |
4.1 ముందే నింపిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి (JSON)
దశ 1: మీరు రిటర్న్‌లు ట్యాబ్ లోని రిటర్న్‌లు దాఖలు చేయండి క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ పేజీకి చేరుకుంటారు.ముందే నింపిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి క్లిక్ చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 2: మీ PANను నమోదుచేసి, మదింపు సంవత్సరంని 2021-22గా ఎంచుకొని, ముందుకు కొనసాగండి పై క్లిక్ చేయండి.
దశ 3: మీరు క్రొత్తగా దాఖలు చేయడంతో కొనసాగితే మీ PAN పైన సేవ్ చేయబడిన వివరాలు విస్మరించబడతాయనే హెచ్చరిక సందేశం వస్తుంది. అవును క్లిక్ చేయండి.
దశ 4: మీరు లాగిన్ పేజీకి చేరుకుంటారు, అక్కడ మీరు ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా ఇ-ఫైలింగ్‌కు లాగిన్ అవ్వవచ్చు.
దశ 5: లాగిన్ చేసిన తర్వాత, మీరు నమోదు చేసిన PAN మరియు AYకి సంబంధించి డౌన్‌లోడ్ చేసిన ముందే నింపి ఉన్న సమాచారాన్ని చూస్తారు. రిటర్న్ దాఖలు చేయండి క్లిక్ చేయండి
అప్పుడు, దాఖలు ప్రక్రియను కొనసాగించడానికి మీరు మీ స్థితిని (వ్యక్తిగత/ HUF/ ఇతర) ఎంచుకోవలసిన పేజీకి చేరుకుంటారు.
మిగిలిన ప్రక్రియను తెలుసుకోవడానికి సెక్షన్ 4.4లో దాఖలు చేయండి, ప్రివ్యూ చూడండి మరియు ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించండి అనే విభాగం చూడండి.
4.2 ముందే నింపిన సమాచారాన్ని ఇంపోర్ట్ చేసుకోండి (JSON)
దశ 1: మీరు రిటర్న్‌లు ట్యాబ్ లోని రిటర్న్‌లు దాఖలు చేయండి క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ పేజీకి చేరుకుంటారు. ముందే నింపిన సమాచారాన్ని ఇంపోర్ట్ చేసుకోండి క్లిక్ చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 2: మీ PANను నమోదుచేసి, మదింపు సంవత్సరం (AY)ని 2021-22గా ఎంచుకొని, ముందుకు కొనసాగండి పై క్లిక్ చేయండి.
దశ 3: మీరు ముందుకు కొనసాగాలనుకుంటే అవును క్లిక్ చేయండి.
దశ 4: ఫైల్‌ను జత చేయండి క్లిక్ చేసి, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసి మీ కంప్యూటర్‌లో సేవ్ చేసినటువంటి ముందే నింపబడిన సమాచారం ఉన్న ఫైల్ (JSON ఫైల్)ను ఎంచుకోండి.
దశ 5: JSON అప్‌లోడ్ చేసిన తర్వాత, ముందుకు కొనసాగండి క్లిక్ చేయండి, అప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న JSON ఫైల్‌ను సిస్టమ్ ధృవీకరిస్తుంది.
దశ 6: ధృవీకరణ విజయవంతం అయిన తర్వాత, డౌన్‌లోడ్ చేసిన ముందే నింపిన సమాచారం వివరాలు మీరు చూడగలరు. రిటర్న్ దాఖలు చేయండి క్లిక్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న JSON నుండి మొత్తం సమాచారాన్ని ముందే నింపి మీ రిటర్న్‌ను దాఖలు చేయడానికి కొనసాగవచ్చు. మీరు ITR ఫారమ్ ఎంపిక పేజీకి వెళ్తారు.
అప్పుడు, దాఖలు ప్రక్రియను కొనసాగించడానికి మీరు మీ స్థితిని (వ్యక్తిగత/ HUF/ ఇతర) ఎంచుకోవలసిన పేజీకి చేరుకుంటారు.
మిగిలిన ప్రక్రియను తెలుసుకోవడానికి సెక్షన్ 4.4లో దాఖలు చేయండి, ప్రివ్యూ, ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించండి అనే విభాగం చూడండి.
4.3 ఆన్‌లైన్ మోడ్‌లో ఫైల్ చేసిన డ్రాఫ్ట్ ITR ని ఇంపోర్ట్ చేయండి
దశ 1: మీరు రిటర్న్‌లు ట్యాబ్ లోని రిటర్న్‌లు దాఖలు చేయండి ని క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ పేజీకి చేరుకుంటారు.ఆన్‌లైన్ విధానములో నింపిన డ్రాఫ్ట్ITRను ఇంపోర్ట్ చేసుకోండి క్లిక్ చేసి, ఆపై కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక: మీరు ఆన్‌లైన్ విధానములో పాక్షికంగా ITRను నింపితే, దాఖలు చేసే విధానాన్ని ఆఫ్‌లైన్‌కు మార్చాలనుకుంటే, ఆన్‌లైన్ విధానంలో నింపిన డ్రాఫ్ట్ITRను ఇంపోర్ట్ చేయండి అలా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
దశ 2: ఫైల్‌ను జత చేయండి క్లిక్ చేసి, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసి మీ కంప్యూటర్‌లో సేవ్ చేసినటువంటి డ్రాఫ్ట్ ITR JSONను ఎంచుకోండి.
గమనిక: మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిటర్న్ సారాంశం పేజీలో JSONను డౌన్‌లోడ్ చేసుకోండి క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్ ITR డ్రాఫ్ట్ JSONను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పేజీకి చేరుకోవచ్చు:
- ఇ-ఫైల్ > లో ఆదాయపు పన్ను రిటర్న్‌లు > ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయండి
- ఆపై, AY > దాఖలు విధానము(ఆన్‌లైన్) > దాఖలు తిరిగి కొనసాగించండి ఎంపిక చేయండి
దశ 3: JSON అప్‌లోడ్ చేసిన తర్వాత, ముందుకు కొనసాగండి క్లిక్ చేయండి.
దశ 4: మీరు ముందుకు కొనసాగాలనుకుంటే అవును క్లిక్ చేయండి.
ఆపై, ఫైలింగ్ ప్రక్రియను కొనసాగించడానికి మీరు మీ ITR ఫారమ్ యొక్క ప్రారంభ పేజీకి వెళ్తారు.
మిగిలిన ప్రక్రియను తెలుసుకోవడానికి (దశ 3 నుంచి) సెక్షన్ 4.4లో దాఖలు చేయండి, ప్రివ్యూ చూడండి మరియు ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించండి అనే విభాగం చూడండి.
4.4 దాఖలు చేయండి, ప్రివ్యూ చూడండి మరియు ఆదాయ పన్ను రిటర్న్‌లను సమర్పించండి
దశ 1: ముందే నింపిన మీ సమాచారాన్ని డౌన్‌లోడ్ లేదా ఇంపోర్ట్ చేసిన తర్వాత రిటర్న్ దాఖలు చేయండి క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పేజీకి చేరుకుంటారు.మీకు వర్తించే స్థితిని ఎంచుకొని, కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 2: ఆదాయపు పన్ను రిటర్న్ రకాన్ని ఎంచుకోవడానికి మీకు రెండు ఎంపికలు ఉన్నాయి:
- ఏ ITR ఫారమ్‌ను దాఖలు చేయాలో నిర్ణయించుకోవటానికి నాకు సహాయపడండి: ముందుకు కొనసాగండి క్లిక్ చేయండి. సిస్టమ్ మీకు సరైన ITRని నిర్ణయించడంలో సహాయపడిన తర్వాత, మీరు మీ ITR ఫైల్ చేయడంతో కొనసాగవచ్చు.

- నేను ఏ ITR ఫారం దాఖలు చేయాలో నాకు తెలుసు: డ్రాప్‌డౌన్ నుండి వర్తించే ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌ను ఎంచుకొని, ITRతో కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 3: మీకు వర్తించే ITRను ఎంచుకున్న తర్వాత, అవసరమైన పత్రాల జాబితాను నోట్ చేసుకుని, ప్రారంభించండి క్లిక్ చేయండి.
దశ 4: మీరు ఆదాయపు పన్ను రిటర్న్ ఎందుకు దాఖలు చేస్తున్నారో తగిన కారణా(ల)ను ఎంచుకొని, కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 5: మీ ITR లోని ప్రతి విభాగంలో (ITR ని ఎలా నింపాలి అనే వివరాల కోసం ITR దాఖలు చేయుటకు CBDT జారీ చేసిన సూచనలు చూడండి):
- ముందే నింపి డౌన్‌లోడ్ / ఇంపోర్ట్ చేసిన సమాచారమును సమీక్షించండి
- ముందే నింపిన మీ సమాచారమును సవరించండి (ఒకవేళ అవసరమైతే)
- మీ మిగిలిన / అదనపు వివరాలను నమోదు చేయండి
ఫారం లోని అన్ని విభాగాలను పూర్తి చేసి ధృవీకరించిన తరువాత కొనసాగండి క్లిక్ చేయండి.
దశ 6: మీ రిటర్న్ సారాంశాన్ని నిర్ధారించండి పేజీలో మీరు అందించిన వివరాల ఆధారంగా మీ పన్ను గణన సారాంశాన్ని మీరు చూడవచ్చు.
a) ఒకవేళ పన్ను చెల్లింపు బాధ్యత ఉంటే:
గణన ఆధారంగా చెల్లించవలసిన పన్ను బాధ్యత ఉంటే, మీరు పేజీ దిగువన ఇప్పుడే చెల్లించండి మరియు తరువాత చెల్లించండి ఎంపికలను చూస్తారు.
గమనిక:
- ఇప్పుడే చెల్లించండి ఎంపికను ఉపయోగించమని సిఫార్సు చేయడమైనది. BSR కోడ్ మరియు చలానా క్రమ సంఖ్య లను జాగ్రత్తగా పరిశీలించి వాటిని చెల్లింపు వివరాలలో నమోదు చేయండి.
- మీరు తరువాత చెల్లించండి ఎంచుకుంటే, మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత మీరు చెల్లింపు చేయవచ్చు, కానీ మిమ్మల్ని బకాయి పడ్డ మదింపుదారుగా పరిగణించబడే ప్రమాదం ఉంది, అంతేకాదు, చెల్లించాల్సిన పన్నుకి వడ్డీని చెల్లించాల్సి రావొచ్చు.
b) ఒకవేళ పన్ను చెల్లింపు బాధ్యత లేనట్లయితే (డిమాండ్ లేదు / రీఫండ్ లేదు), లేదా మీరు రీఫండు కోసం అర్హులు అయితే:
పన్ను చెల్లింపు బాధ్యత లేకపోతే, లేదా మీ పన్ను గణన ఆధారంగా రీఫండ్ ఉంటే, మీ రిటర్న్‌ని నేరుగా ప్రివ్యూ చేసే అవకాశం లభిస్తుంది. రిటర్న్ ప్రివ్యూ చూడండి క్లిక్ చేయండి.
దశ 7: ప్రివ్యూ చేసి మీ రిటర్న్‌ని సమర్పించండి పేజీలో డిక్లరేషన్ చెక్‌బాక్స్‌ను క్లిక్ చేసి అవసరమైన వివరాలు పొందుపరచండి. ప్రివ్యూ చూడటానికి కొనసాగండి క్లిక్ చేయండి.
గమనిక: మీరు మీ రిటర్న్‌ను సిద్ధం చేయడంలో పన్ను రిటర్న్ తయారు చేసేవారు లేదా TRPని కలిగి ఉండకపోతే, మీరు TRPకి సంబంధించిన టెక్స్ట్‌బాక్స్‌లను ఖాళీగా ఉంచవచ్చు.
దశ 8: ప్రివ్యూ చూసి రిటర్న్‌ని సమర్పించండి పేజీలో, ధృవీకరించడానికి కొనసాగండి క్లిక్ చేయండి.
దశ 9: సిస్టమ్ మీ రిటర్న్‌పై ధృవీకరణ తనిఖీలను నిర్వర్తిస్తుంది. లోపాలు ఏమైనా ఉంటే ప్రివ్యూ చేసి మీ రిటర్న్‌ని సమర్పించండి పేజీలో కనిపిస్తాయి. ధృవీకరణ లోపాలు ఉంటే తిరిగి వెళ్లి మీరు మీ ఫారంలోని లోపాలను సరిచేయాలి. లేకపోతే, మీకు విజయవంతమైన ధృవీకరణ గురించి సందేశం వస్తుంది.
విజయవంతంగా ధృవీకరణ చేసిన తరువాత, రిటర్న్ దాఖలు ప్రక్రియను పూర్తి చేయడానికి సరినిరూపణకి కొనసాగండి క్లిక్ చేయండి.
గమనిక: మీరు JSON డౌన్‌లోడ్ చేసుకోండి క్లిక్ చేస్తే, మీరు తయారుచేసిన మరియు ధృవీకరించిన రిటర్న్ యొక్క JSON మీ కంప్యూటర్‌లో సేవ్ చేయబడుతుంది. మీరు దానిని తరువాత ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవచ్చు, లేదా ఆఫ్‌లైన్ యుటిలిటీ నుండి సమర్పించవచ్చు (క్రింద పేర్కొన్నదశల్లో వివరించబడింది).
దశ 10: మీరు సరినిరూపణకు కొనసాగండి క్లిక్ చేసినప్పుడు, మీరు యుటిలిటీ ద్వారా లాగిన్ పేజీకి చేరుకుంటారు. మీ ఇ-ఫైలింగ్ వినియోగదారు ID, పాస్వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
దశ 11: ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీ రిటర్న్‌ను అప్‌లోడ్ చేసే ఎంపిక మీకు లభిస్తుంది. రిటర్న్ అప్‌లోడ్ చేయండి క్లిక్ చేయండి.
దశ 12: ఓకే క్లిక్ చేయండి.
దశ 13: మీ వెరిఫికేషన్ పూర్తి చేయండి పేజీలో మీకు ఇష్టమైన ఎంపికను ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.
మీ రిటర్న్‌ని వెరిఫై చేయడం తప్పనిసరి, మీ ITRను వెరిఫై చేయడానికి ఇ-వెరిఫికేషన్ (సిఫార్సు చేసిన ఎంపిక - ఇప్పుడే ఇ-వెరిఫై చేయండి) సులభమైన మార్గం - ఇది త్వరితమైనది, కాగిత రహితమైనది, అలాగే సంతకం చేసిన భౌతిక ITR-Vని పోస్ట్ ద్వారా CPCకి పంపడం కంటే సురక్షితమైనది.
గమనిక:
- మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.
- మీరు తర్వాత ఇ-వెరిఫై చేయండి ఎంచుకుంటే, మీరు మీ రిటర్న్‌ను సమర్పించవచ్చు, అయినప్పటికీ, మీ ITR దాఖలు చేసిన 120 రోజుల్లోపు మీ రిటర్న్‌ను ఇ-వెరిఫై చేయాలి.
- మీరు ITR-V ద్వారా వెరిఫై చేయండిని ఎంపిక చేసుకుంటే, మీరు 120 రోజుల్లోపు సాధారణ/స్పీడ్ పోస్టు ద్వారా సంతకం చేసిన మీ ITR-V యొక్క భౌతిక కాపీని కేంద్రీకృత ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు 560500 కి పంపాలి.
- దయచేసి మీరు మీ బ్యాంక్ ఖాతాను ముందుగా ధృవీకరించారని నిర్ధారించుకోండి, తద్వారా చెల్లించాల్సిన ఏవైనా రీఫండ్‌లు మీ బ్యాంక్ ఖాతాకి జమ చేయబడతాయి.
- మరింత తెలుసుకోవడానికి నా బ్యాంక్ ఖాతా యూజర్ మాన్యువల్‌ను చూడండి.
దశ 14: మీరు ఇప్పుడే ఇ-వెరిఫై చేయండి క్లిక్ చేస్తే, మీ రిటర్న్‌ను ఇ-వెరిఫై చేయడానికి మీరు ఇ-వెరిఫై పేజీకి చేరుకుంటారు.
గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.
ITR విజయవంతమైన ఇ-వెరిఫికేషన్ పై, లావాదేవీ గుర్తింపు ఐడి మరియు రసీదు సంఖ్యతో పాటు విజయ సందేశం కనిపిస్తుంది. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన ఇ-మెయిల్ ID మరియు మొబైల్ సంఖ్యపై మీకు నిర్ధారణ సందేశం వస్తుంది.