1. ఆదాయపు పన్ను చట్టబద్ధమైన ఫారాలను దాఖలు చేయడానికి ఐ.టి.డి. యొక్క ఆఫ్‌లైన్ యుటిలిటీని ఎవరు ఉపయోగించవచ్చు?
ఏ ఇ-ఫైలింగ్ వినియోగదారులైనా ఐ.టి.ఆర్. లు మరియు చట్టబద్ధమైన ఫారాల కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీలను డౌన్‌లోడ్ చేసి యాక్సెస్ చేయవచ్చు, కాని ఈ క్రింది వినియోగదారులు మాత్రమే ఫారాలు దాఖలు చేయగలరు:
- పన్ను చెల్లింపుదారులు
- చార్టర్డ్ అకౌంటెంట్‌లు
- పన్ను తగ్గింపుదారులు & కలెక్టర్లు
2. నేను చార్టర్డ్ అకౌంటెంట్ ని. ఆఫ్‌లైన్ యుటిలిటీలో నా లాగిన్ ఆధారాలను ఉపయోగించి నేను నా క్లయింట్ కోసం ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయవచ్చా?
మీరు మీ లాగిన్ ఆధారాలను ఉపయోగించి మీకు కేటాయించిన ఫారంలను మాత్రమే దాఖలు చేయవచ్చు.
3. AY2021-22కు చట్టబద్ధమైన ఫారంల గురించి ITD యొక్క ఆఫ్‌లైన్ యుటిలిటీలో కొత్తగా ఏమి ఉన్నాయి?
- AY 2021-22 నుండి, ముందుగా నింపిన డేటా కోసం ఫైల్ ఫార్మాట్ XML కాదు లేదా అప్‌లోడ్ కోసం యుటిలిటీ-ఉత్పత్తి చేసిన ఫైల్ కాదు, ఇప్పుడు అది JSON ఫార్మాట్‌లో ఉంది.
- వినియోగదారులు ముందుగా నింపబడి ఉన్న తమ డేటాను ఆఫ్‌లైన్ యుటిలిటీలోకి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి తమ కంప్యూటర్ లోకి JSON నుండి ముందుగా నింపబడి ఉన్న ఫారమ్‌ను దిగుమతి చేసుకోవచ్చు. గతంలో, ముందుగా నింపబడి ఉన్న XML ను దిగుమతి చేసుకోవడానికి ఒక మార్గం మాత్రమే ఉండేది.
- మ.సం. 2021-22కు ముందు, వినియోగదారులు తాము తయారుచేసిన ఫారం యొక్క XMLను రూపొందించి, సమర్పించడం కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు అప్‌లోడ్ చేయాల్సి ఉండేది. కొత్త ఆఫ్‌లైన్ యుటిలిటీతో, వినియోగదారులు తమ ఫారమ్‌లను నేరుగా ధృవీకరించవచ్చు మరియు సమర్పించవచ్చు. వినియోగదారులు JSONను రూపొందించి, సమర్పించడానికి ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో తమ ఫారాన్ని అప్‌లోడ్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది.
4. చట్టబద్ధమైన ఫారంల కోసం ఐ.టి.డి. వారి ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగిస్తున్న సందర్భంలో బహుళ దిగుమతి ఎంపిక (మల్టిపుల్ ఇంపోర్ట్ ఆప్షన్స్)ల ద్వారా అంటే అర్థం ఏమిటి?
ఆదాయపు పన్ను ఫారాల కోసం మీరు ముందుగా నింపిన డేటాతో JSON దిగుమతి చేసుకోవడానికి మీకు బహుళ ఎంపికలు ఉన్నాయి:
- ముందుగా-నింపిన ఫారం డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ లాగిన్ ఆధారాలు మరియు ఓటీపి ధ్రువీకరణ (మరియు రశీదు నెంబరు / లావాదేవీ గుర్తింపు ID / ఇతర వివరాలు, సందర్భానికి తగినట్లు] ఆధారంగా ముందుగా నింపిన డేటా మీ ఫారంలోకి డౌన్‌లోడ్ చేయబడుతుంది.
- Import Pre-filled JSON – Attach your already downloaded JSON into the offline utility, and based on your PAN/TAN/Form no./AY, your pre-filled data gets downloaded into your form.
5. ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగించి దాఖలు చేసేటప్పుడు నేను నా ఐ.టి.ఆర్.లో కానీ / చట్టబద్ధమైన ఫారంలో కానీ తప్పులు చేశానా అనేది నాకు ఎలా తెలుస్తుంది?
మీరు ఫారం పోర్టల్‌లో సమర్పించినా లేదా నేరుగా ఆఫ్‌లైన్ యుటిలిటీ నుండి సమర్పించినా ఆన్‌లైన్ ఫారంలకు వర్తించే అన్ని ధ్రువీకరణ నియమాలు వీటికి వర్తిస్తాయి. ఏదైనా తప్పు జరిగితే, సిస్టమ్ నుండి లోపం ఉన్నట్లు మీకు సందేశం వస్తుంది. అంతేకాదు, లోపాలు ఉన్న ఫీల్డ్ లు ఫారంలో స్పష్టంగా కనిపిస్తాయి. మీరు మీ JSON ఫైల్‌ను ఎగుమతి చేసి అప్‌లోడ్ చేస్తే, దోషం ఉన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకునే విధంగా తయారవుతుంది, దీనిని మీరు తప్పులను సరిదిద్దడానికి చూసుకోవచ్చు.
6. ఆఫ్‌లైన్ యుటిలిటీలో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఏ వినియోగదారుని ఐడి అందించాలి?
పన్ను చెల్లింపుదారులు లాగిన్ అవ్వడం కోసం పాన్ ను వినియోగదారుని ఐడి (యూజర్ ఐడి) గా ఉపయోగించాలి. చార్టర్డ్ అకౌంటెంట్లు లేదా CAలు ARCA + 6 అంకెల సభ్యత్వ సంఖ్యను ఉపయోగించాలి. పన్ను తగ్గింపుదారులు & కలెక్టర్లు TAN ఉపయోగించాలి.
7. ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగించి అన్ని చట్టబద్ధమైన ఫారాలు దాఖలు చేయవచ్చా?
ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగించి దాఖలు చేయగల ఫారంలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- ఫారం 15CA (పార్ట్ A, B, C మరియు D)
- ఫారం 15CB
- ఫారం 3 CA-CD, ఫారం 3 B-CD, ఫారం 3CEB
- ఫారం 29B, ఫారం 29 C
- ఫారం 15G, ఫారం 15H
- ఫారం 15CC
- ఫారం -V