1. ఫారమ్ 10E అంటే ఏమిటి?
జీతం బకాయిలు లేదా ముందస్తుగా అందుకున్న జీతం స్వభావం ఉన్న మొత్తం అందుకున్నట్లయితే, సెక్షన్ 89 కింద రిలీఫ్ క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఉపశమనాన్ని పొందటానికి, మదింపుదారుడు ఫారం 10Eను దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఫారమ్ 10E దాఖలు చేయడం మంచిది.
2. ఫారం 10Eని డౌన్‌లోడ్ చేసి, సమర్పించాల్సిన అవసరం ఉందా?
లేదు, ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన తర్వాత ఫారం 10E ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. కాబట్టి డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు.
3. నేను ఫారం 10Eని ఎప్పుడు దాఖలు చేయాలి?
మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఫారం 10E దాఖలు చేయడం మంచిది.
4. ఫారం 10E దాఖలు చేయడం తప్పనిసరా?
అవును, మీ బకాయి/ముందస్తు ఆదాయంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయాలనుకుంటే ఫారం 10E దాఖలు చేయడం తప్పనిసరి.
5. మీరు ఫారం 10E ని దాఖలు చేయడంలో విఫలమైనా, నా ITRలో సెక్షన్ 89ప్రకారం ఉపశమనం పొందినట్లయితే ఏమి జరుగుతుంది?
మీరు ఫారం 10E ని దాఖలు చేయడంలో విఫలమైనా, మీ ITRలో 89 ప్రకారం ఉపశమనం క్లెయిమ్ చేసుకుంటే, మీ ITR ప్రాసెస్ చేయబడుతుంది కానీ 89 ప్రకారం క్లెయిమ్ చేయబడిన ఉపశమనం అనుమతించబడదు.
6. నా ఐటిఆర్ లో నేను పేర్కొన్న ఉపశమనాన్ని ఆ.ప.శాఖ అనుమతించలేదని నాకు ఎలా తెలుస్తుంది?
సెక్షన్ 89 కింద మీరు క్లెయిమ్ చేసిన ఉపశమనం అనుమతించబడని పక్షంలో, మీ ITR ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత సెక్షన్ 143(1) కింద ఒక సమాచారం, ITD ద్వారా తెలియజేయబడుతుంది.
7. సిస్టమ్ పన్నులను ఎలా లెక్కిస్తుంది?
A.Y. 2024-25 (F.Y. 2023-24) కాలానికి సంబంధించి పన్ను లెక్కింపుల కోసం, "సిస్టమ్ లెక్కించే పన్ను" డిఫాల్ట్ పన్ను విధానం అంటే కొత్త పన్ను విధానం (సెక్షన్ 115BAC (1A) ప్రకారం ఉంటుంది. అయితే, గతంలో A.Y. 2023-24 (F.Y. 2022-23) వరకు పన్ను లెక్కింపులు పాత పన్ను విధానం ప్రకారం ఉంటాయి.