Do not have an account?
Already have an account?

1. పన్ను చెల్లింపుదారులు (వర్తించే దేశీయ కంపెనీలు) అందరూ ఫారం 10-IC ఫైల్ చేయడం తప్పనిసరా?
ఒక దేశీయ కంపెనీ ఆదాయపు పన్ను చట్టం, ,1961 లోని సెక్షన్ 115BAA కింద 22% రాయితీ రేటుతో పన్ను చెల్లించాలని ఎంచుకుంటేనే ఫారం 10-IC దాఖలు చేయాలి.

2. నేను ఫారం 10-IC ఎలా దాఖలు చేయగలను?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే ఫారం 10-ICని దాఖలు చేయాలి.

3. తదుపరి మదింపు సంవత్సరానికి నేను ఫారంను మళ్లీ దాఖలు చేయాలా?
 

4. ఫారం విజయవంతంగా సమర్పించబడిందని నాకు ఎలా తెలుస్తుంది?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన మీ ఇ-మెయిల్ IDపై ధృవీకరణను పొందుతారు. అంతేగాక, మీ చర్యల కోసం క్రింద మీ పని జాబితా (వర్క్ లిస్ట్)లో ఉన్న స్థితిని కూడా మీరు చూడవచ్చు.

5. ఫారంను సమర్పించేటప్పుడు నేను ఇ-ధృవీకరణ చెయ్యాలా?
అవును. మీరు DSCని మాత్రమే ఉపయోగించి ఇ-ధృవీకరణ పూర్తి చేసిన తర్వాత మీ ఫారం సమర్పించబడుతుంది.

6. ఫారం 10-IC దాఖలు చేయడానికి కాలపరిమితి ఎంత?
ప్రయోజనం పొందాలంటే మునుపటి సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ని అందించడానికి సెక్షన్ 139 లోని ఉప-సెక్షన్ (1) కింద పేర్కొన్న గడువు తేదీన లేదా అంతకు ముందు ఫారం 10-ICను దాఖలు చేయాలి.

7. ఫారం 10-ICని ఆఫ్‌లైన్‌లో దాఖలు చేయవచ్చా?
లేదు, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆఫ్‌లైన్ యుటిలిటీని ఉపయోగించి ఫారం 10-ICని దాఖలు చేయలేరు. మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఫారం 10-ICని దాఖలు చేయగలరు.

8. ఫారం 10-IC దాఖలు చేసే ఉద్దేశ్యం ఏమిటి?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115BAA ప్రకారం, దేశీయ కంపెనీలకు 22% (వర్తించే అదనపు సర్‌చార్జి మరియు సెస్ అదనం) రాయితీ రేటుతో పన్ను చెల్లించే అవకాశం ఉంది, అయితే, అవి పేర్కొన్న మినహాయింపులు మరియు ప్రోత్సాహకాలను పొందలేవు. కంపెనీలు మదింపు సంవత్సరం 2020 - 21నుండి రాయితీ రేటును ఎంచుకోవచ్చు, అయితే, వారు నిర్దేశించిన కాలపరిమితిలో ఫారం 10-ICని దాఖలు చేసి ఉండాలి.