Do not have an account?
Already have an account?

1. ఫారం 10-ID అంటే ఏమిటి?
ఉత్పాదన నిమిత్తం కొత్తగా ఏర్పాటు చేసిన దేశీయ కంపెనీలు కొన్ని షరతులకు లోబడి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115BAB కింద 15 % (వర్తించే సర్‌చార్జి మరియు సెస్ అదనం) రాయితీ పన్ను రేటుకు పన్నును చెల్లించటానికి ఎంచుకోవచ్చు. అలా చేయడానికి, 1వ తేదీ ఏప్రిల్ 2020న లేదా ఆ తర్వాత ప్రారంభమయ్యే మొదటి మదింపు సంవత్సరానికి ఆదాయ రిటర్న్ అందించినందుకు సెక్షన్ 139లోని ఉప-సెక్షన్ (1) కింద పేర్కొన్న గడువు తేదీన లేదా అంతకు ముందు ఫారమ్ 10-IDని దాఖలు చేయడం చాలా అవసరం.

2. ఫారం 10-IDని ఎవరు దాఖలు చేయాలి?
1 అక్టోబరు 2019న లేదా తరువాత విలీనం చేయబడిన కొత్త ఉత్పాదక దేశీయ సంస్థ, ఏదైతే 31వ తేదీ, మార్చి 2023న లేదా అంతకు ముందు ఒక వస్తువు తయారీ లేదా ఉత్పత్తి ప్రారంభించిందో మరియు రాయితీ రేటుతో పన్ను విధించబడాలని ఎంచుకుందో, వారు ఫారం 10-ID దాఖలు చేయాలి.

3. ఫారం 10-IDని దాఖలు చేయడం వర్తించే పన్ను చెల్లింపుదారుల [దేశీయ కంపెనీల]కు తప్పనిసరా?
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115BAB కింద దేశీయ సంస్థ
రాయితీ పన్ను రేటును 15 % (వర్తించే సర్‌చార్జి మరియు సెస్ అదనం) పొందాలని ఎంచుకుంటే ఫారం 10-ID దాఖలు చేయాలి.

4. నేను ఫారం 10-IDని ఎలా దాఖలు చేసి సమర్పించగలను?
మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఫారం 10-IDని ఫైల్ చేయాలి (ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా].

5. ఈ ఫారంను దాఖలు చేయడానికి కాల గడువు ఏమిటి?
మీరు ఆ.ప. రిటర్ను దాఖలు చేసే గడువు తేదీకి ముందు ఫారమ్ 10-IDని దాఖలు చేయాలి.

6. తదుపరి మదింపు సంవత్సరానికి నేను ఫారంను మళ్లీ దాఖలు చేయాలా?

7. ఫారం విజయవంతంగా సమర్పించబడిందని నాకు ఎలా తెలుస్తుంది?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేయబడిన మీ ఇ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌పై ధృవీకరణను అందుకుంటారు. అంతేగాక, మీ చర్యల కోసం క్రింద మీ పనిజాబితాలో ఉన్న స్థితిని కూడా మీరు చూడవచ్చు.

8. ఫారం 10-IDని సమర్పించడానికి ఇ-ధృవీకరణ అవసరమా? అవును అయితే, నేను ఫారమ్ 10-IDని ఎలా ఇ -ధృవీకరించగలను?
అవును, ఫారమ్ 10-IDని ఇ-ధృవీకరణ చేయడం అవసరం. మీరు డిజిటల్ సంతకం సర్టిఫికేట్ ఉపయోగించి ఇ-ధృవీకరించవచ్చు.