Do not have an account?
Already have an account?

1. ఫారం 15CB అంటే ఏమిటి?

ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ప్రవాసికి (కంపెనీ లేదా ఒక విదేశీ కంపెనీ కాకుండా), ఆదాయపు పన్ను విధించదగిన, 5 లక్షల రూపాయలకు మించి ఒకేసారి చెల్లింపు / మొత్తం చెల్లింపులు చేసినప్పుడు, 195//197 సెక్షన్ ఫ్రకారం మదింపు అధికారి నుండి సర్టిఫికేట్ పొందని సందర్భంలొ, ఫారం 15CB అనేది అకౌంటెంట్ అందించే సర్టిఫికేట్.
ఫారం 15CBలో, TDS రేటు, మూలం వద్ద పన్ను తగ్గించిన (TDS) వివరాలు మరియు చెల్లించిన విధానం, చెల్లింపుల ఉద్దేశం వంటి ఇతర వివరాలను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఫారం 15CB అనేది పన్ను నిర్ణయ ధృవీకరణ పత్రం, దీనిలో పన్ను విధింపు నిబంధనల ప్రకారం చెల్లింపులను చార్టర్డ్ అకౌంటెంట్ పరిశీలిస్తారు.

 

2. ఫారమ్ 15CBని ఎవరు ఉపయోగించవచ్చు?

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన చార్టర్డ్ అకౌంటెంట్ ఫారం 15CBని యాక్సెస్ చేసి సమర్పించవచ్చు. ఫారం 15CBలో వివరాలను ధృవీకరించడానికి పన్ను చెల్లింపుదారుడు చార్టర్డ్ అకౌంటెంట్ కు ఫారమ్ 15CAను ఏర్పాటు చేయాలి.

 

3. ఫారం 15CBలో ధృవీకరణ ప్రయోజనం ఏమిటి?

15CB అనేది పన్ను నిర్ధారణ ధృవీకరణ పత్రం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 5 మరియు 9 ప్రకారం పన్ను చెల్లింపులకు సంబందించిన నిబంధనలకు మరియు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందాలకు ( DTAA ) అనుగుణంగా పన్నులు చెల్లించారా లేదా (ఏవైనా ఉంటే) అనేది చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షిస్తారు.

 

4. ఫారం 15CA ( పార్ట్ C ) దాఖలు చేయడానికి ముందు ఫారం 15CBని దాఖలు చేయడం తప్పనిసరా?

ఫారం 15CAలో పార్ట్ C నింపడానికి ముందు ఫారం 15CB అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఫారం 15CA లోని పార్ట్ C లో వివరాలను పూరించడానికి, ఇ-ధృవీకరణ జరిగిన తరువాత, ఫారం 15CB యొక్క రశీదు సంఖ్యను ధృవీకరించాలి.

 

5. ఆఫ్‌లైన్ పద్ధతిలో మాత్రమే 15CBని దాఖలు చెయ్యాలా?

ఫారం 15CBని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులలో నింపి సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ యుటిలిటీ సేవ చట్టబద్ధమైన ఫారమ్‌లను ఆ పద్ధతిలో 15CBని నింపడానికి, సమర్పించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

 

6.ఫారం 15 CBని ఎలా ధృవీకరించాలి? ఈ ఫారమ్‌ను సమర్పించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా?

ఈ ఫారమ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) ఉపయోగించి మాత్రమే ఇ-ధృవవీకరణ చెయ్యాలి. చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క DSCని ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఫారం 15CBని సమర్పించడానికి కాలపరిమితి నిర్దేశించలేదు. అయితే, చెల్లింపులు చేయడానికి ముందు దానిని సమర్పించాలి.