1. అవలోకనం
కంపెనీ లేదా విదేశీ కంపెనీ కాకుండా ఒక ప్రవాసికి చెల్లించిన సొమ్ము రూ. 5 లక్షలు దాటితే దానిని ఫారం 15CB లో సమర్పించాలి. ఫారం 15CB అనేది సంఘటన ఆధారిత ఫారం. ప్రతీ చెల్లింపుకీ నిర్దేశించిన షరతులు వర్తిస్తాయి.
ఫారం 15CBలో, TDS రేటు, మూలం వద్ద పన్ను తగ్గించిన (TDS) వివరాలు మరియు చెల్లించిన విధానం, చెల్లింపుల ఉద్దేశం వంటి ఇతర వివరాలను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఫారం 15CB అనేది పన్ను నిర్ణయ ధృవీకరణ పత్రం, దీనిలో పన్ను విధింపు నిబంధనల ప్రకారం చెల్లింపులను చార్టర్డ్ అకౌంటెంట్ పరిశీలిస్తారు. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతిలో సమర్పించవచ్చు అయితే ఫారమ్‌ను దాఖలు చేయడానికి సమయ పరిమితిని సూచించలేదు.
2. ఈ సేవను పొందడానికి కావలసిన వివరాలు
- ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా CA నమోదు అయ్యుండాలి.
- చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క PAN చెల్లుబాటయ్యేలా ఉండాలి
- చార్టర్డ్ అకౌంటెంట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ చెల్లుబాటయ్యేలా గడువు ముగియకుండా ఉండాలి
- పన్ను చెల్లింపుదారునికి ఫారం 15CA పార్ట్ - C ను కేటాయించి ఉండాలి మరియు దానిని చార్టర్డ్ అకౌంటెంట్ అంగీకరించే లేదా తిరస్కరించేందుకు అభ్యర్థన పెండింగ్‌లో ఉండాలి
3.1 ఉద్దేశం
ఫారం 15CB అనేది అకౌంటెంట్ సర్టిఫికేట్. ఒక ప్రవాసికి ( కంపెనీ కాకుండా ) లేదా ఒక విదేశీ కంపెనీకి పన్ను విధింపుకు అర్హమైన మొత్తం ఆర్థిక సంవత్సరంలో చెల్లింపు రూ. 5 లక్షలకు మించి ఉంటే ఇది సమర్పించాలి.
ఈ ఫారం భారతదేశం వెలుపల చేయవలసిన చెల్లింపుల వివరాలను ధృవీకరించడానికి చార్టర్డ్ అకౌంటెంట్ ని అనుమతిస్తుంది మరియు చివరికి ఫారం 15CA పార్ట్ - C. లో దాఖలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
3.2 దాన్ని ఎవరు ఉపయోగించవచ్చు?
ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన మరియు చెల్లింపు చేయడానికి బాధ్యత వహించే వ్యక్తిచే ఫారం 15CA, పార్ట్ - C కేటాయించబడిన చార్టర్డ్ అకౌంటెంట్ కి, ఫారం 15CBలో వివరాలను ధృవీకరించడానికి అర్హత ఉంటుంది. సమర్పించిన ఫారమ్ ఇ-ధృవీకరణ కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేయబడిన DSC ను కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కలిగి ఉండాలి.
4. ఫారమ్ అవలోకనం
ఫారం సమర్పించడానికి ముందు ఫారం 15CBలో ఆరు విభాగాలు నింపాలి. ఇవి:
- సొమ్ము అందుకునేవారి ( గ్రహీత ) వివరాలు
- డబ్బు జమచేసిన ( ఫండ్ బదిలీ ) వివరాలు
- పన్ను వివరాలు
- DTAA వివరాలు
- అకౌంటెంట్ ( చార్టర్డ్ అకౌంటెంట్ ) వివరాలు
- ధృవీకరణ
ఫారం 15CB లోని విభాగాల శీఘ్ర సమీక్ష ఇక్కడ ఉంది.
సొమ్ము అందుకునే గ్రహీతకు చెందిన వివరాలు / ప్రొఫైల్ అప్‌డేట్ చేయబడి ప్రదర్శించబడుతుంది.
చెల్లింపుల మొత్తం మరియు బ్యాంక్ వివరాలు నవీకరించబడి మరియు ప్రదర్శించబడే వివరాల పేజీ అయిన రెమిటెన్స్ ( ఫండ్ బదిలీ ) వివరాలు పేజీ.
DTAA ను పరిగణించకుండా పన్ను విధింపుకు సంబంధించిన వివరాలు నవీకరించబడి ప్రదర్శించబడతాయి.
DTAA వివరాల పేజీలో, భారతదేశంలో ఆదాయపు పన్ను విధించినట్లయితే DTAA కింద క్లెయిమ్ చేసిన ఉపశమనం గురించి చార్టర్డ్ అకౌంటెంట్ వివరాలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
అకౌంటెంట్ ( చార్టర్డ్ అకౌంటెంట్) వివరాల పేజీలో, మీరు అకౌంటెంట్ పేరు, సంస్థ, సభ్యత్వ గిుర్తింపు సంఖ్య మరియు చిరునామా వివరాలు ఉండాలి.
చివరి విభాగం ధృవీకరణ పేజీ, దీనిలో డిజిటల్ సంతకం సర్టిఫికేట్‌తో అందించబడిన అన్ని వివరాలను చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరించాలి.
5. ప్రాప్యత పొందడం మరియు సమర్పించడం ఎలా
మీరు ఈ క్రింది పద్ధతుల ద్వారా ఫారం 15CB ని నింపి సమర్పించవచ్చు
- ఆన్‌లైన్ పద్ధతి - ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా
- ఆఫ్‌లైన్ పద్ధతి - ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా
గమనిక: మరింత తెలుసుకోవడానికి ఆఫ్‌లైన్ యుటిలిటీలో చట్టబద్ధమైన ఫారమ్‌లను చూడండి
ఆన్‌లైన్ పద్ధతి ద్వారా ఫారం 15CBని నింపడానికి మరియు సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి:
5.1 ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించండి
దశ 1: చెల్లుబాటు అయ్యే చార్టర్డ్ అకౌంటెంట్ ఆధారాలతో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: వర్క్ లిస్ట్ మెనుకి నావిగేట్ చేయండి, ఇక్కడ పెండింగ్‌లో ఉన్న ఐటమ్‌ల జాబితా ప్రదర్శించబడుతుంది.
దశ 3: అసైన్‌మెంట్ అభ్యర్థన అంగీకరించబడితే, ఫారం 15CB యొక్క మరియు డౌన్‌లోడ్ అగ్రీమెంట్ అటాచ్మెంట్స్ యొక్క హైపర్ లింక్ అందుబాటులో ఉంటుంది.
గమనిక: అసైన్మెంట్ అభ్యర్థన తిరస్కరించబడితే, దానికి కారణం తెలపాలి.
దశ 4: సొమ్ము పంపేవారి గురించిన ఫారం 15CBని చూడడానికి సంబంధిత హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 5: అవసరమైన అన్ని ఖాళీలను నింపి సమర్పించు క్లిక్ చేయండి.
దశ 6: మీ సమర్పణను ధృవీకరించాలనుకుంటే, అవును క్లిక్ చేయండి. లేకపోతే, వద్దు క్లిక్ చేయండి.
దశ 7: మీరు అవును అని ఎంచుకుంటే, DSCని ఉపయోగించి ధృవీకరించడానికి ఉన్న ఎంపికల ఇ-ధృవీకరణ స్క్రీన్‌కు వెళ్తారు. ఇ-ధృవీకరణ ప్రక్రియను అర్థం చేసుకోడానికి ఇ-ధృవీకరణ పై వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
దశ 8: విజయవంతంగా ధృవీకరణ అయిన తర్వాత, మీకు విజయవంతమైనది అనే సందేశం ప్రదర్శించబడుతుంది.