1. ఫారం 29B అంటే ఏమిటి?
ఫారం 29B అనేది సెక్షన్ 115JB ప్రకారం కంపెనీ యొక్క స్థూల లాభాలను లెక్కించే ఒక నివేదిక. సెక్షన్ 11JB వర్తించే కంపెనీ కోసం చార్టర్డ్ అకౌంటెంట్ దీనిని సమర్పించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం లెక్కించిన పన్ను నుండి ఉత్పన్నమయ్యే ఫలిత MAT క్రెడిట్‌ను పొందటానికి స్థూల లాభాల సరైన గణనను నిర్ధారించడానికి ఇది మదింపుదారునికి సహాయపడుతుంది.
2. ఫారమ్ 29Bను దాఖలు చేయడం తప్పనిసరా?
స్థూల లాభంలో 15% కంటే తక్కువగా ఆదాయం ఉన్న ప్రతి కంపెనీ (AY 2020-21 నుండి అమలులోకి వచ్చిన కారణంగా) చార్టర్డ్ అకౌంటెంట్ నుండి ఫారం 29Bలో ఒక నివేదికను పొందాలి. సెక్షన్ 139[1] కింద రిటర్న్ దాఖలు చేసే గడువు తేదీకి ఒక నెల ముందు లేదా సెక్షన్ 142[1](i) కింద నోటీసుకు ప్రతిస్పందనగా సమర్పించిన ఆదాయ రిటర్న్ తో పాటు ఈ నివేదికను పొందాలి మరియు సమర్పించాలి.
3. ఫారం 29B నింపే విధానం ఏమిటి?
పన్ను చెల్లింపుదారు (కంపెనీ) కేటాయించిన చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఈ ఫారం నింపాల్సి ఉంటుంది. ఫారం నింపబడి, కేటాయించిన CA చేత అప్‌లోడ్ చేయబడిన తరువాత, మదింపుదారుడు దానినే అంగీకరించాలి (వర్క్‌లిస్ట్ నుండి) మరియు ఇ-ధ్రువీకరణ చేసి విజయవంతంగా సమర్పించాలి.
4. నా చార్టర్డ్ అకౌంటెంట్ ఫారం 29Bను సిద్ధం చేసి సమర్పించారని నాకు ఎలా తెలుస్తుంది?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో రిజిస్టర్ చేయబడిన మీ ఇ-మెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌పై ధృవీకరణను అందుకుంటారు. అదనంగా, మీరు మీ వర్క్‌లిస్ట్లో (మీ చర్యలకి) స్థితిని కూడా చూడవచ్చు. CA కనుక ఫారం 29B అప్‌లోడ్ చేసి ఉంటే, మీకు అప్‌లోడ్ చేయబడింది- మదింపుదారు అంగీకారం పెండింగ్‌లో ఉంది అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
5. ఫారం 29Bని నింపమంటూ చేసిన నా అభ్యర్థన నా CA తిరస్కరించినట్లు నాకు ఎలా తెలుస్తుంది?
మీరు కేటాయించిన CA ఫారం 29B నింపమన్న మీ అభ్యర్థనను తిరస్కరించినట్లయితే, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేయబడిన మీ ఇ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌పై సందేశాన్నిఅందుకుంటారు.
6. ఫారం 29B నింపమన్న నా అభ్యర్థనను నా CA అంగీకరించినట్లు నాకు ఎలా తెలుస్తుంది?
మీరు కేటాయించిన CA మీ అభ్యర్థనను అంగీకరించినట్లయితే, మీరు మీ వర్క్‌లిస్ట్ (మీ చర్యలకి)లో క్రింది స్థితిని చూడగలుగుతారు:
- CA ద్వారా అప్‌లోడ్ చేయబడింది - అంగీకారం పెండింగ్ లో ఉంది: అంటే CA మీ అభ్యర్థనను ఇంకా అంగీకరించలేదు; లేదా
- అప్‌లోడ్ చేయబడింది- మదింపుదారుని అంగీకారం పెండింగ్‌లో ఉన్నది: CA ఇప్పటికే అప్‌లోడ్ చేసి 29Bని సమర్పించారు.