1. ఫారం 15CA అంటే ఏమిటి?
- సెక్షన్ 195 ప్రకారం, ప్రవాసులకి (కంపెనీ కాకుండా) లేదా ఒక విదేశీ సంస్థకు చెల్లింపు చేసే ప్రతి వ్యక్తి, ఆ మొత్తం పన్ను విధించేందుకు అర్హమైన ఆదాయమయినట్లయితే మూలం వద్ద పన్ను (టిడిఎస్) తగ్గించాలి మరియు ఆ వివరాలు ఫారం 15CAలో సమర్పించాలి.
- టిడిఎస్ చేసి, ప్రభుత్వ ఖాతాలో జమచేసే ( చెల్లింపు ) వ్యక్తి ఈ ఫారం 15CAను సమర్పించాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ సమర్పించవచ్చు. చెల్లింపులు 5 లక్షల రూపాయలకు మించిన సందర్భాల్లో, ఫారమ్ 15CA ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి ముందు ఫారమ్ 15CBలో చార్టర్డ్ అకౌంటెంట్ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం.
2. ఫారం 15CAలో నేను ఏ భాగం పూరించాలి?
కంపెనీ కాని ఒక ప్రవాసికి, లేదా విదేశీ సంస్థకు చేసిన చెల్లింపు సమాచారం ఇవ్వడం కోసం ఫారం 15CA 4 భాగాలుగా విభజించబడింది. కేసును బట్టి, మీరు సంబంధిత భాగాన్ని పూరించాలి:
పార్ట్ A: జమచేసిన లేదా అటువంటి చెల్లింపుల మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల రూపాయలకు మించకూడదు.
పార్ట్ B: ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం జమలు 5 లక్షల రూపాయలకు మించి మరియు చట్టం లోని ఆర్డర్ / సర్టిఫికేట్ 195 (2) / 195 (3 ) / 197 సెక్షన్ కింద మదింపు అధికారి నుండి పొందినట్లయితే.
పార్ట్ C: ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపుల మొత్తం 5 లక్షల రూపాయలకు మించి మరియు అకౌంటెంట్ నుండి ఫారం నంబర్ 15CBలో సర్టిఫికేట్ పొందినట్లయితే.
పార్ట్ D: జమ చేసిన మొత్తం ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం పన్ను విధింపు పరిమితిలోనికి రానట్లయితే.
3. ఫారం 15CAను ఎవరు దాఖలు చేయాలి?
రూల్ 37BB ప్రకారం, నివాసి-కానివారికి, ఒక కంపెనీ కాకుండా, లేదా ఒక విదేశీ కంపెనీకి చెల్లించిన సమాచారాన్ని ఫారం 15CAలో అందించినట్లయితే.
4. ఫారమ్ 15CBని సమర్పించడం తప్పనిసరా?
లేదు, ఫారం 15CBని సమర్పించడం తప్పనిసరి కాదు. ఫారం 15CB అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షలకు మించి చెల్లింపు చేస్తే మాత్రమే నింపే సంఘటన ఆధారిత ఫారం మరియు సెక్షన్ 288 ప్రకారం నిర్వచించిన అకౌంటెంట్ నుండి మీరు సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది.
5. ఫారం 15CAను ఉపసంహరించుకోవచ్చా?
లేదు, ఫారం 15CAని ఉపసంహరించుకునే అవకాశం లేదు.
6. ఫారమ్ 15CA సమర్పించాల్సిన అవసరం ఎప్పుడు లేదు?
రూల్ 37BB లోని ఉప - నియమం (3) ప్రకారం, కింది లావాదేవీల విషయంలో ఫారం 15CA పార్ట్ - డి లో సమాచారం అందించాల్సిన అవసరం లేదు:
- RBI ముందస్తు అనుమతి అవసరం లేకుండా ఓ వ్యక్తి జమ చేసినట్లయితే
- RBI ప్రకారం సంబంధిత ప్రయోజనాల కోడ్ కింద పేర్కొన్న స్వభావానికి సంబందించిన చెల్లింపులు
7. ఫారం 15CAని నేను ఎలా ఇ - ధృవీకరణ చెయ్యాలి?
ఈ ఫారమ్‌ను DSC లేదా EVC ఉపయోగించి ఇ - ధృవీకరణ చేయవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ నమోదు చేయబడితే మీరు DSCని ఉపయోగించి ఇ - ధృవీకరణ చెయ్యాలి. ఇ - ధృవీకరణ ప్రక్రియను అర్థం చేసుకోవడానికీ ఇ - ధృవీకరణ వివిధ దశల్లో ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకునేందుకు వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
8. నేను 15CAను ఆన్‌లైన్‌లో మాత్రమే దాఖలు చేయగలనా? నేను ఈ ఫారమ్‌ను ఎప్పుడు దాఖలు చేయాలి?
ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులలో దాఖలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ యుటిలిటీ సేవ, ఆఫ్‌లైన్ పద్ధతిలో 15CAను దాఖలు చేయడానికి మీకు వీలుకల్పిస్తుంది. ఈ ఫారమ్ దాఖలు చేయడానికి కాలపరిమితి సూచించబడలేదు. అయితే, చెల్లింపులు చేయడానికి ముందు దానిని దాఖలు చేయాలి.