1. అవలోకనం
భారతదేశం వెలుపల చేసిన విదేశీ చెల్లింపుల నివేదికను దాఖలు చేయాల్సిన వ్యక్తులందరూ ఉపయోగించుకోవడానికి ఫారం 15CA అందుబాటులో ఉంది. ఈ ఫారం అటువంటి చెల్లింపులకు బాధ్యత వహించే వ్యక్తి చేసిన ప్రతి చెల్లింపు కోసం మొత్తాన్ని పంపించడానికి ముందు దాఖలు చేయబడుతుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో దీనిని సమర్పించవచ్చు. ఈ సేవ నమోదిత యూజర్లను పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫారం 15CA ను దాఖలు చేయడానికి అనుమతిస్తుంది.
2. ఈ సేవను పొందడానికి కావలసిన వివరాలు
- ఇ-ఫైలింగ్ పోర్టల్ లోని నమోదిత వినియోగదారు
- చెల్లుబాటు అయ్యే మరియు క్రియాశీల PAN / TAN
- ఫారం 15CB ( పార్ట్ - C కోసం మాత్రమే ) చార్టర్డ్ అకౌంటెంట్ దాఖలు చేసి ఉండాలి
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
ఈ ఫారం వినియోగదారులు ఒక సంస్థ కాని ప్రవాసులకు లేదా విదేశీ సంస్థకు చేసే చెల్లింపుల సమాచారం ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది.
ఖాతాలోనికి పంపడానికి ముందు, అటువంటి చెల్లింపులకు బాధ్యత వహించే వ్యక్తి చేసిన ప్రతి చెల్లింపుకీ ఫారం 15CA దాఖలు చెయ్యాలి. కొన్ని సందర్భాలలో, ఫారం 15CA ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేసుకోవడానికి చార్టెడ్ అకౌంటెంట్ నుండి ఫారమ్ 15CBలో సర్టిఫికేట్ అవసరం.
3.2 దాన్ని ఎవరు ఉపయోగించవచ్చు?
పన్ను చెల్లింపుదారుడు, అధీకృత సంతకం చేసిన వ్యక్తి మరియు ప్రతినిధి మదింపుదారుడులలో ఏ వర్గానికి చెందినా, ఒక సంస్థ కాని ఒక ప్రవాసులకు లేదా విదేశీ సంస్థకు చేసే చెల్లింపుకు సంబంధించి సమాచారాన్ని అందించడానికి ఫారం 15CAను ఉపయోగించవచ్చు.
4. ఫారమ్ అవలోకనం
ఫారం 15CAలో నాలుగు భాగాలు ఉన్నాయి. ఫారమ్ నింపడానికి, సమర్పించడానికి ముందు మీకు సంబంధించినదాన్ని మీరు ఎంచుకోవాలి. ఇవి:
- పార్ట్ A - అటువంటి చెల్లింపు లేదా చెల్లింపుల మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల రూపాయలకు మించినట్లయితే పన్ను పరిధిలోకి వస్తుంది.
- పార్ట్ B - పన్ను విధించడానికి అర్హత ఉండే అటువంటి చెల్లింపులు లేదా చెల్లింపుల మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల రూపాయలకు మించి ఉంటే మరియు 195 (2)/195(3)/197 సెక్షన్ల కింద మ.అ. (అసెసింగ్ ఆఫీసర్) నుండి ఆర్డర్ / సర్టిఫికేట్ పొందితే
- పార్ట్ C - పన్ను వసూలుకు అర్హత ఉండే అటువంటి చెల్లింపులు లేదా చెల్లింపుల మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల రూపాయలకు మించి ఉంటే మరియు అకౌంటెంట్ నుండి ఫారం నంబర్ 15CBలో సర్టిఫికేట్ పొందితే
- పార్ట్ D - పన్ను విధింపుకు అర్హము కాని చెల్లింపులు
ఫారం 15CA యొక్క వివిధ భాగాల శీఘ్ర సమీక్ష ఇక్కడ ఉంది:
ఫారం 15CA - పార్ట్ A
ఫారం 15CA - పార్ట్ B
ఫారం 15CA - పార్ట్ C
ఫారం 15CA - పార్ట్ D
5. ప్రాప్యత పొందడం మరియు సమర్పించడం ఎలా
మీరు ఈ క్రింది పద్ధతుల ద్వారా ఫారమ్ 15CAను నింపి సమర్పించవచ్చు:
- ఆన్‌లైన్ పద్ధతి: ఇ - ఫైలింగ్ పోర్టల్ ద్వారా
- ఆఫ్‌లైన్ పద్ధతి: ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా
గమనిక:
మరింత తెలుసుకోవడానికి ఆఫ్‌లైన్ యుటిలిటీలో చట్టబద్ధమైన ఫారమ్‌లను చూడండి.
ఫారమ్ 15CAను ఆన్‌లైన్ పద్ధతిలో పూర్తిచేసి సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి.
5.1 మీరు ఫారమ్ 15CA - పార్ట్ A / B / D ను సమర్పించాలనుకుంటే
దశ 5.1.1: మీ వినియోగదారు గుర్తింపు సంఖ్య మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 5.1.2: డ్యాష్‌బోర్డ్‌లో మీ ఇ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారమ్‌లను క్లిక్ చేయండి
దశ 5.1.3: ఫారం ఎంపిక పేజీలో, ఫారం 15CA టైల్ ను ఎంచుకోండి. మీరు ఈ పేజీలో కూడా ఫారం కోసం వెతకవచ్చు.
దశ 5.1.4: ఫారమ్ నింపడానికి సూచనలను జాగ్రత్తగా చదవండి మరియు అవసరమైన పత్రాల జాబితాను తయారు చేసుకుని, ప్రారంభించండి పై క్లిక్ చేయండి.
దశ 5.1.5: ఫారం 15CA కనిపిస్తుంది. మీకు సంబంధించిన భాగాన్ని ఎంచుకుని, అవసరమైన అన్ని ఖాళీలను నింపి సమర్పించు పై క్లిక్ చేయండి.
గమనిక:
- మీరు అదే మదింపు సంవత్సరానికి ( AY ) ముందు ఫారమ్ యొక్క ముసాయిదాను సేవ్ చేస్తే, సేవ్ చేసిన డ్రాఫ్ట్ కనిపిస్తుంది.
దశ 5.1.6: మీరు ఖచ్చితంగా సమర్పించాలనుకుంటే, అవును క్లిక్ చేయండి. మీరు సమర్పించకూడదనుకుంటే, వద్దు క్లిక్ చేయండి.
దశ 5.1.7: మీరు అవును ఎంచుకుంటే, మీరు ఇ - ధృవీకరణ చేయడానికి ఇ - ధృవీకరణ పేజీకి నావిగేట్ చేయబడతారు. మీరు DSC ద్వారా ( DSC నమోదు చేయబడితే ) లేదా EVC ద్వారా ఇ - ధృవీకరణ చేయవచ్చు
గమనిక:
ఎలా ఇ - ధృవీకరణ చెయ్యాలి అనేదీ, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
దశ 5.1.8: విజయవంతంగా ఇ - ధృవీకరణ తర్వాత, లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యతో పాటు విజయవంతమైనది అనే సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ అవసరాల కోసం లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యను భద్రపరచుకోండి. మీరు ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇమెయిల్ IDపై ధృవీకరణ సందేశాన్ని కూడా స్వీకరిస్తారు.
5.2 మీరు ఫారమ్ 15CA - పార్ట్ C భర్తీ చేయాలనుకుంటే
దశ 5.2.1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 5.1.2: డ్యాష్‌బోర్డ్‌లో మీ ఇ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారమ్‌లను క్లిక్ చేయండి
దశ 5.2.3: ఫారమ్ 15CAలో ఫారమ్ మెనులో పార్ట్ C ని ఎంచుకోండి.
దశ 5.2.4: ఒకవేళ మీరు చార్టర్డ్ అకౌంటెంట్ ని జోడించకపోతే, ఇప్పటికే ఉన్న CAల నుండి CA ని ఎంచుకోండి లేదా కొత్త CA ని జోడించండి పై క్లిక్ చేయండి మరియు మీరు నా CA పేజీకి నావిగేట్ చేయబడతారు. చార్టర్డ్ అకౌంటెంట్ ని ఎలా జోడించాలో అర్థం చేసుకోవడానికి నా CA యూజర్ మాన్యువల్‌ను చూడండి.
దశ 5.2.5: అవసరమైన వివరాలను నమోదు చేసి, చార్టర్డ్ అకౌంటెంట్ ను కేటాయించు ను క్లిక్ చేయండి. ఫారం 15CA సేవ్ చేయబడుతుంది మరియు ఇది కేటాయించిన చార్టర్డ్ అకౌంటెంట్ వర్క్ లిస్ట్ లో ప్రదర్శించబడుతుంది.
దశ 5.2.6: మీరు ఫారమ్‌ను విజయవంతంగా కేటాయించినప్పుడు, లావాదేవీ IDతో విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. మీ ఫారమ్‌ను విజయవంతంగా కేటాయించడాన్ని ధృవీకరించే ఇ - మెయిల్ కు, నమోదైన చార్టర్డ్ అకౌంటెంట్ ఈమెయిల్ కు మరియు ఇ - ఫైలింగ్ పోర్టల్‌తో నమోదైన మీ మొబైల్ సంఖ్యకు సందేశం పంపబడింది.
దశ 5.2.7: చార్టర్డ్ అకౌంటెంట్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, మీరు ఫారమ్ 15CAను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ తరువాత సమర్పించు క్లిక్ చేయండి
గమనిక:
- మీరు ఫారమ్‌ను తిరస్కరిస్తే, మీరు టెక్స్ట్ బాక్స్‌లో ఒక కారణాన్ని అందించాలి
- మీరు ఫారమ్‌ను అంగీకరిస్తే, మిగిలిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది
దశ 5.2.8: మీరు ఖచ్చితంగా సమర్పించాలనుకుంటే, అవును క్లిక్ చేయండి. మీరు సమర్పించకూడదనుకుంటే, వద్దు క్లిక్ చేయండి.
మీరు అవును అని ఎంచుకుంటే, మీరు ఇ - ధృవీకరణ చేయడానికి ఇ - ధృవీకరణ పేజీకి నావిగేట్ చేయబడతారు.మీరు DSC ఉపయోగించి ఫారమ్‌ను ధృవీకరించవచ్చు.
గమనిక:
ఎలా ఇ - ధృవీకరణ చెయ్యాలి అనేదీ, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
దశ 5.2.9: విజయవంతమైన ఇ - ధృవీకరణ తర్వాత, లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యతో పాటు విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ అవసరాల కోసం లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యను భద్రపరచుకోండి. మీరు ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇమెయిల్ IDపై ధృవీకరణ సందేశాన్ని కూడా స్వీకరిస్తారు.
4. సంబంధిత అంశాలు
- నా ప్రొఫైల్
- లాగిన్ చేయండి
- డ్యాష్‌బోర్డ్
- ఆదాయపు పన్ను ఫారాలు
- DSCని నమోదు చేయండి
- EVCని రూపొందించండి
- ఇ - ధృవీకరణ
- వర్క్ జాబితా
- అధీకృత సంతకం చేసిన వ్యక్తి
- నా చార్టర్డ్ అకౌంటెంట్
- ఫారం 15CB
- నా మదింపు అధికారి గురించి