Do not have an account?
Already have an account?

1. సెక్షన్ 194ఎన్ సెక్షన్ క్రింద నగదు ఉపసంహరణపై టి.డి.ఎస్. అంటే ఏమిటి?
చట్టంలోని సెక్షన్ 194ఎన్ ప్రకారం, ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నగదు రూపంలో ఉపసంహరించిన నగదు లేదా స్థూల మొత్తం పరిమితి మించితే టి.డి.ఎస్. ‌చేయాలి:

  • రూ. 20 లక్షలు [గడిచిన మూడు మదింపు సం. లకు ఐ.టి.ఆర్. ఏదీ దాఖలు చేయకపోతే], లేదా
  • రూ. 1 కోటి [గడిచిన మూడు సంవత్సరాల్లో అన్ని లేదా ఏదో ఒక మదింపు సం. నికి ఐ.టి.ఆర్. దాఖలు చేస్తే].

2. చట్టం యొక్క 194ఎన్ సెక్షన్ క్రింద నగదు ఉపసంహరణ పై ఎవరు టి.డి.ఎస్. చేస్తారు?
బ్యాంకులు [ప్రైవేట్, ప్రభుత్వ, మరియు కో-ఆపరేటివ్] లేదా పోస్ట్ ఆఫీసులు టి.డి.ఎస్. చేస్తాయి. సదరు బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల్లో నిర్వహించబడే అతని/ఆమె ఖాతా నుండి ఎవరైనా వ్యక్తికి రూ. 20 లక్షలు లేదా రూ. 1 కోటికి [పరిస్థితిని బట్టి] మించి ఏదైనా నగదు చెల్లింపు చేసేటప్పుడు మూలం వద్ద పన్ను తగ్గించబడుతుంది.

3. చట్టం యొక్క 194ఎన్ సెక్షన్ ప్రకారం నగదు ఉపసంహరణ పై టి.డి.ఎస్. ఎవరికి వర్తించదు?
చట్టం యొక్క 194ఎన్ సెక్షన్ ప్రకారం నగదు ఉపసంహరణ పైన టి.డి.ఎస్. అనేది ఈ క్రింది వ్యక్తులు చేసే ఉపసంహరణలకు వర్తించదు.

  • కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంక్
  • ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్
  • తపాలా కార్యాలయము (పోస్ట్ ఆఫీస్)
  • ఏదైనా బ్యాంక్ యొక్క బిజినెస్ కరస్పాండెంట్
  • ఏదైనా బ్యాంక్ యొక్క ఎవరైనా వైట్ లేబుల్ ఏ.టి.ఎం. ఆపరేటర్
  • వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేసినందుకు రైతులకు చెల్లింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా పేర్కొన్న మరియు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ( ఏ.పి.ఎం.సి.) క్రింద కార్యకలాపాలు నిర్వహించే ఏజెంట్లు లేదా వ్యాపారులు
  • ఆర్.బి.ఐ. మరియు దాని ఫ్రాంఛైజ్ ఏజెంట్ల ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్లు మరియు దాని ఫ్రాంచైజ్ ఏజెంట్ మరియు ఉప-ఏజెంట్ మరియు పూర్తి స్థాయి మనీ ఛేంజర్ (ఎఫ్.ఎఫ్.ఎం.సి.)
  • ఆర్‌.బి.ఐ.తో సంప్రదించి ప్రభుత్వం సూచించిన ఎవరైనా ఇతర వ్యక్తి.

4. చట్టం లోని 194ఎన్ సెక్షన్ ప్రకారం ఎప్పటి నుండి నగదు ఉపసంహరణ పైన టి.డి.ఎస్. వర్తిస్తుంది?
చట్టం యొక్క 194ఎన్ సెక్షన్/క్రింద నగదు ఉపసంహరణ పైన టి.డి.ఎస్. అనేది సెప్టెంబర్ 1వ తేదీ 2019 నుండి, లేదా ఆ. సం. 2019-2020 నుండి వర్తిస్తుంది.

5. 194ఎన్ సెక్షన్ ప్రకారం నగదు ఉపసంహరణ పై ఏ ధర వద్ద టి.డి.ఎస్. చేయబడుతుంది?
నగదు ఉపసంహరించే వ్యక్తి గడిచిన మూడు మదింపు సం. లలో ఏదైనా లేదా అన్నింటికీ ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసినట్లయితే రూ. 1 కోటి పైన జరిగే అన్ని నగదు ఉపసంహరణలకు 2% చొప్పున టి.డి.ఎస్. చేయబడుతుంది.
నగదు ఉపసంహరించే వ్యక్తి గడిచిన మూడు మదింపు సం. లలో దేనికైనా ఐ. టి. ఆర్. ఫైల్ చేయకపోతే రూ. 20 లక్షలకు పైన జరిగే జరిగే నగదు ఉపసంహరణలకు 2% మరియు రూ. 1 కోటి పైన జరిగే అన్ని నగదు ఉపసంహరణలకు 5% చొప్పున టి. డి. ఎస్. చేయబడుతుంది.