Do not have an account?
Already have an account?

ఆన్‌లైన్‌లో ITR-1 (సహజ్) ఫైల్ చేయడానికి సంబంధించిన యూజర్ మాన్యువల్

 

1. సమగ్ర అవలోకనం

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన వినియోగదారులకు ITR-1 ఫైల్ చేసే సేవ అందుబాటులో ఉంది. ఈ సేవ ద్వారా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్ సౌకర్యాన్ని ఉపయోగించి ITR-1 ను ఫైల్ చేయవచ్చు. ఆన్‌లైన్ విధానం ద్వారా ITR-1 ను ఫైల్ చేయడానికి సంబంధించిన దశలవారీ ప్రక్రియను ఈ యూజర్ మాన్యువల్ వివరిస్తుంది.

2. ఈ సేవను పొందడానికి కావలసిన అర్హతలు

సాధారణం

  • ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ కలిగిన వినియోగదారుడై ఉండాలి.
  • PAN స్థితి యాక్టివ్‌గా ఉండాలి
  • వ్యక్తి యొక్క నివాస స్థితి నివాసి అయి ఉండాలి.
  • ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించిన ఒక బ్యాంక్ ఖాతా ఉండాలి
  • ధ్రువీకరణ పొందడానికి పద్ధతి: నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ ఖాతా లేదా డీమ్యాట్ ఖాతా ద్వారా ఆధార్ OTP/ DSC/ EVC.

ఇతరములు

  • PAN, ఆధార్ లింక్ చేయబడ్డాయి (సిఫార్సు చేయబడింది)

3. ఫారం గురించి

3.1 ఉద్దేశ్యం

ఆదాయపు పన్ను రిటర్న్ అనేది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం మరియు దానిపై చెల్లించాల్సిన పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను శాఖకు సమర్పించే ఫారం. కింది పేరా 3.2 ప్రకారం అర్హత ప్రమాణాలు ఉన్న నివాస వ్యక్తులు, పాత లేదా కొత్త పన్ను విధానం కింద తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఫారం ITR-1 ను ఉపయోగించవచ్చు.

3.2 దీనిని ఎవరు వాడవచ్చు?

కింది అర్హతలు గల నివాస వ్యక్తి ITR-1ని దాఖలు చేయవచ్చు:

  • FY లో మొత్తం ఆదాయం ₹ 50 లక్షలకు మించకూడదు
  • ఆదాయం అనేది జీతం, రెండు గృహ ఆస్తులు, కుటుంబ పెన్షన్, వ్యవసాయ ఆదాయం (₹5,000 వరకు), సెక్షన్ 112A కింద ₹1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభం మరియు ఇతర వనరుల నుండి సమకూరుతుంది, వీటిలో ఇవి ఉన్నాయి:
    • పొదుపు ఖాతాలనుండి వడ్డీ
    • (బ్యాంక్ / పోస్ట్ ఆఫీస్ / సహకార సంఘం) డిపాజిట్లపై వడ్డీ
    • ఆదాయపు పన్ను రీఫండ్ నుండి పొందిన వడ్డీ
    • పెంచిన పరిహారం పై పొందిన వడ్డీ
    • ఏదైనా వడ్డీ వచ్చే ఆదాయం
    • కుటుంబ పెన్షన్
  • జీవిత భాగస్వామి (పోర్చుగీస్ సివిల్ కోడ్ పరిధిలోకి రానివారు) లేదా మైనర్ యొక్క ఆదాయం కలిపి లెక్కించబడుతుంది (ఆదాయ వనరు పైన పేర్కొన్న నిర్దిష్ట పరిమితులలో ఉంటే మాత్రమే).

కింది వ్యక్తులు ITR-1ను దాఖలు చేయలేరు:

  • సాధారణ నివాసి కాని నివాసి (RNOR), మరియు ప్రవాస భారతీయుడు (NRI)
  • మొత్తం ఆదాయం ₹ 50 లక్షలకు మించి ఉన్నవారు
  • వ్యవసాయ ఆదాయం ₹ 5000/- కంటే ఎక్కువ ఉన్నవారు
  • లాటరీ, రేసుగుర్రాలు, చట్టబద్ధమైన జూదం మొదలైన వాటి నుండి ఆదాయం ఉన్నవారు.
  • అల్పకాలిక మూలధన లాభాలను కలిగి ఉన్నవారు
  • సెక్షన్ 112A ప్రకారం దీర్ఘకాలిక మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించి ఉన్నవారు
  • జాబితా చేయని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టినవారు
  • వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం ఉన్నవారు
  • ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నవారు
  • ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 194N కింద పన్ను మినహాయింపు ఉన్నవారు
  • అర్హత కలిగిన స్టార్ట్-అప్ అయిన యజమాని నుండి పొందిన ESOP పై ఆదాయపు పన్ను వాయిదా వేయబడిన వారు
  • రెండు కంటే ఎక్కువ గృహ ఆస్తులను కలిగి ఉండి, వాటి నుండి ఆదాయం పొందుతున్నారు.
  • ITR-1 కు సంబంధించిన అర్హత నిబంధనల పరిధిలోకి రానివారు

4. ఫారం గురించి క్లుప్తంగా

ITR-1లో, దానిని సమర్పించే ముందు ధ్రువీకరించాల్సిన/సవరించాల్సిన ఐదు ముందే దాఖలు చేసిన విభాగాలు మరియు పన్ను గణన కోసం సమీక్షించాల్సిన ఒక సారాంశ విభాగం ఉంటాయి. ఆ విభాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  1. వ్యక్తిగత సమాచారం
  2. స్థూల మొత్తం ఆదాయం
  3. మొత్తం తగ్గింపులు
  4. చెల్లించిన పన్ను
  5. మొత్తం పన్ను బాధ్యత

ITR-1 లోని వివిధ విభాగాల సంక్షిప్త పరిచయం ఇక్కడ ఉంది:

4.1 వ్యక్తిగత సమాచారం

ITR లోని వ్యక్తిగత సమాచారంవిభాగంలో, మీ ఈ-ఫైలింగ్ ప్రొఫైల్ నుండి ఆటోమేటిక్‌గా నింపబడిన డేటాను మీరు ధ్రువీకరించాలి. మీరు మీ వ్యక్తిగత డేటాలో కొంత భాగం నేరుగా ఫారంలో మార్చలేరు. అయితే, ప్రొఫైల్ విభాగానికి వెళ్లి అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఫారంలోనే మీ ప్రొఫైల్ (కేవలం ఆధార్ సంఖ్య), సంప్రదింపు వివరాలు, ఫైలింగ్ రకం వివరాలు మరియు బ్యాంక్ వివరాలను మార్చవచ్చు.

ప్రొఫైల్:

Data responsive

సంప్రదింపు వివరాలు:

Data responsive

ఫైలింగ్ రకం వివరాలు:

Data responsive

బ్యాంక్ వివరాలు

Data responsive

గమనిక:

  1. వ్యక్తులు, HUF, AOP, BOI మరియు AJP అయిన మదింపుదారుల కోసం కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా చేయడానికి ఫైనాన్స్ యాక్ట్, 2023 ద్వారా సెక్షన్ 115BAC నిబంధనలు సవరించబడ్డాయి. మీరు కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను చెల్లించాలనుకోకపోతే, దాని నుండి స్పష్టంగా వైదొలిగి, పాత పన్ను విధానం ప్రకారం పన్ను చెల్లించడాన్ని ఎంచుకోవాలి
  2. మీరు కొత్త పన్ను విధానం నుండి వైదొలగాలనుకుంటే, ఫైలింగ్ విభాగంలోని రేడియో బటన్‌లో “అవును” ను ఎంచుకోండి. ఈ ఎంపికను వినియోగించుకోవడానికి, వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం కలిగిన మదింపుదారు, సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి సెక్షన్ 139(1) కింద సమర్పించాల్సిన ఆదాయ పన్ను రిటర్న్‌లో తాను ఎంచుకున్న పన్ను విధానాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి.

4.2 స్థూల మొత్తం ఆదాయం

స్థూల మొత్తం ఆదాయం విభాగంలో, ముందుగానే నింపబడిన సమాచారాన్ని మీరు సమీక్షించాలి. జీతం / పెన్షన్, గృహ ఆస్తి, సెక్షన్ 112A కింద దీర్ఘకాలిక మూలధన లాభాలు మరియు ఇతర వనరుల (వడ్డీ ఆదాయం, కుటుంబ పింఛన్ మొదలైనవి) నుండి వచ్చే ఆదాయ వివరాలను నిర్ధారించాలి / సవరించాలి. ఒకవేళ మినహాయింపు పొందే ఆదాయం ఏదైనా ఉంటే, వాటి వివరాలను కూడా మీరు జోడించవచ్చు.

జీతం నుండి ఆదాయం:

Data responsive

గరిష్టంగా రెండు గృహ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం మరియు అప్పుగా తీసుకున్న మూలధనంపై వడ్డీ వివరాలు:

Data responsiveData responsive

ఇతర వనరుల నుండి ఆదాయం:

Data responsive

 

Data responsive

మినహాయింపబడిన ఆదాయం:

Data responsive

సెక్షన్ 112A కింద దీర్ఘకాలిక మూలధన లాభాలు:

Data responsive

4.3 మొత్తం మినహాయింపులు

మొత్తం మినహాయింపుల  విభాగంలో, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని ఛాప్టర్ VI-A కింద క్లెయిమ్ చేయడానికి మీకు వర్తించే మినహాయింపులను మీరు జోడించడం, తొలగించడం మరియు నిర్ధారించడం అవసరం.

Data responsiveData responsiveData responsiveData responsiveData responsive

గమనిక:

AY 2025-26 నుండి, మినహాయింపులను పొందడానికి మీరు కొంత అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

సెక్షన్ 80C కింద మినహాయింపులు:

Data responsive

సెక్షన్ 80 CCC కింద మినహాయింపులు:

Data responsive

సెక్షన్ 80DD కింద మినహాయింపులు:

Data responsive

సెక్షన్ 80E కింద మినహాయింపులు:

Data responsive

సెక్షన్ 80GG కింద మినహాయింపులు:

Data responsive

 గమనిక:

A.Y. 26-27 కి సంబంధించి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్ విధానంగా ఉంటుంది. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోనట్లయితే, సెక్షన్ 80CCD (2) - టైర్-1 NPS ఖాతాకు యజమాని వాటా మరియు సెక్షన్ 80CCH - అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తం కింద మినహాయింపులు మాత్రమే మీకు కనిపిస్తాయి.

Data responsive

4.4 చెల్లించిన పన్ను

చెల్లించిన పన్ను విభాగంలో, మీరు గత సంవత్సరంలో చెల్లించిన పన్నులను ధ్రువీకరించాలి. పన్ను వివరాలలో చెల్లింపుదారు(లు) అందించిన జీతం కాకుండా ఇతరాలు, TCS, ముందస్తు పన్ను మరియు స్వీయ-మదింపు పన్ను ఉంటాయి.

Data responsive

4.5 మొత్తం పన్ను బాధ్యత

మొత్తం పన్ను బాధ్యత విభాగంలో, మీరు ధ్రువీకరించబడిన విభాగాలు మరియు ఎంచుకున్న పన్ను విధానం ప్రకారం లెక్కించబడిన పన్ను బాధ్యతను సమీక్షించాలి.

Data responsiveData responsive

5. ITR-1 ఫారాన్ని ఎలా యాక్సెస్ చేసి సమర్పించాలి:

మీరు ఈ క్రింది పద్ధతుల ద్వారా మీ ITRను దాఖలు చేసి సమర్పించవచ్చు:

  • ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా- ఆన్‌లైన్ విధానం
  • ఆఫ్‌లైన్ యుటిలిటీ లేదా ఎక్సెల్ యుటిలిటీ ద్వారా- ఆఫ్‌లైన్ మోడ్

ఆన్‌లైన్ విధానం ద్వారా ITR ను ఫైల్ చేసి సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి:

దశ 1:మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఈ- ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

Data responsive

 దశ 2: మీ డాష్‌బోర్డ్‌లో, 'ఈ-ఫైల్' > 'ఆదాయ పన్ను రిటర్న్‌లు' > 'ఆదాయ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయండి' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 3: అసెస్‌మెంట్ సంవత్సరాన్ని 2026–27గా మరియు పూరించే విధానాన్ని 'ఆన్‌లైన్'గా ఎంచుకుని, ఆపై 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 4: ఒకవేళ మీరు ఇప్పటికే ఆదాయపు పన్ను రిటర్న్‌ను పూరించి, అది సమర్పణ కోసం పెండింగ్‌లో ఉంటే, 'రెజ్యూమ్ ఫైలింగ్' క్లిక్ చేయండి.ఒకవేళ మీరు సేవ్ చేసిన రిటర్న్‌ను రద్దు చేసి, కొత్తగా రిటర్న్‌ను సిద్ధం చేయడం ప్రారంభించాలనుకుంటే, 'స్టార్ట్ న్యూఫైలింగ్' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 5: మీకు వర్తించే స్థితిని ఎంచుకుని, 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 6: డ్రాప్‌డౌన్ మెనూ నుండి ITR-1ని ఎంచుకుని, 'ITR-1తో ముందుకు సాగండి' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 7: మీకు వర్తించే ITRను ఎంచుకున్న తర్వాత, అవసరమైన పత్రాల జాబితాను గమనించి, 'లెట్స్ గెట్ స్టార్టెడ్' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 8: ITR దాఖలు చేయడానికి గల కారణానికి సంబంధించి మీకు వర్తించే చెక్‌బాక్స్‌ను ఎంచుకుని, 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 9: AY 2026-27కి కొత్త పన్ను విధానం అనేది డిఫాల్ట్ పన్ను విధానం. "మీరు కొత్త పన్ను విధానం నుండి వైదొలగాలనుకుంటున్నారా" అనే ప్రశ్నకు "లేదు" అనే ఎంపిక ఆటోమేటిక్‌గా ఎంపిక చేయబడుతుంది. మీరు పాత పన్ను విధానం కింద మీ రిటర్న్‌ను దాఖలు చేయాలనుకుంటే, వ్యక్తిగత సమాచార విభాగంలో "అవును" ఎంచుకోండి.

మీరు ముందుగా నింపిన డేటాను సమీక్షించి, అవసరమైతే దాన్ని సవరించండి. మిగిలిన / అదనపు డేటాను (అవసరమైతే) నమోదు చేయండి. ప్రతి విభాగం చివర 'నిర్ధారించు' పై క్లిక్ చేయండి.

Data responsiveData responsiveData responsiveData responsive

గమనిక:

పన్ను విధానాన్ని ఎంచుకునే ముందు, కొత్త పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు మరియు పన్ను రాయితీలు అందుబాటులో లేవని దయచేసి గమనించండి. మరింత సమాచారం కోసం పాత మరియు కొత్త పన్ను విధానం (భాగం-1) వీడియోను చూడండి.

దశ 10: వివిధ విభాగాలలో మీ ఆదాయం మరియు మొత్తం మినహాయింపుల వివరాలను నమోదు చేయండి / సవరించండి. ఫారంలోని అన్ని విభాగాలను పూర్తి చేసి, నిర్ధారించిన తర్వాత, 'ధ్రువీకరణకు కొనసాగండి' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 10a: పన్ను బాధ్యత ఉన్నట్లయితే:

మీరు అందించిన వివరాల ఆధారంగా మీ పన్ను గణన సారాంశం మీకు చూపబడుతుంది. ఆ గణన ప్రకారం చెల్లించాల్సిన పన్ను బాధ్యత ఏదైనా ఉంటే, పేజీ దిగువన మీకు 'ఇప్పుడే చెల్లించండి' మరియు 'తర్వాత చెల్లించండి' అనే ఎంపికలు కనిపిస్తాయి.

Data responsiveData responsiveData responsive

గమనిక:

  • పే నౌ(ఇప్పుడే చెల్లించండి) అనే ఎంపికను ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.
  • మీరు తర్వాత చెల్లించడాన్ని ఎంచుకుంటే, మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత మీరు చెల్లింపు చేయవచ్చు, కానీ డిఫాల్ట్‌గా పన్ను చెల్లింపుదారుగా పరిగణించబడే ప్రమాదం ఉంది మరియు చెల్లించాల్సిన పన్నుపై వడ్డీని చెల్లించాల్సిన బాధ్యత తలెత్తవచ్చు.

దశ 10a(i) : మీరు 'ఇప్పుడే చెల్లించండి' పై క్లిక్ చేస్తే, మిమ్మల్ని 'ఈ-పే పన్ను' సేవకు మళ్లించడం జరుగుతుంది. 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.

Data responsive

గమనిక: 'కంటిన్యూ' పై క్లిక్ చేసిన తర్వాత, పన్ను చెల్లింపు చేయడానికి మిమ్మల్ని పోర్టల్‌లోని 'ఈ-పే పన్ను' సేవకు తీసుకువెళతారు. మరింత సమాచారం కోసం 'ఈ-పే పన్ను' యూజర్ మాన్యువల్‌లను చూడండి.

దశ 10a(ii): ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా విజయవంతంగా చెల్లింపు జరిగిన తర్వాత ఒక విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది. ITR ఫైలింగ్‌ను పూర్తి చేయడానికి 'రిటర్న్ ఫైలింగ్‌కు తిరిగి వెళ్లు' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 10b: పన్ను బాధ్యత ఏదీ లేనట్లయితే (డిమాండ్ లేదు / వాపసు లేదు) లేదా మీకు రీఫండ్ పొందే అర్హత ఉంటే: ఒకవేళ చెల్లించాల్సిన పన్ను లేకపోయినా లేదా పన్ను గణన ఆధారంగా వాపసు రావాల్సి ఉన్నా, మీరు 'మీ రిటర్న్‌ను సమీక్షించి సమర్పించండి' పేజీకి వెళ్లడం జరుగుతుంది.

Data responsiveData responsiveData responsive

దశ 11: 'మీ రిటర్న్‌ను సమీక్షించి సమర్పించండి' పేజీలో, డిక్లరేషన్ చెక్‌బాక్స్‌ను ఎంచుకుని, 'ధ్రువీకరణకు కొనసాగండి' పై క్లిక్ చేయండి.

Data responsive

గమనిక: మీ రిటర్న్‌ను సిద్ధం చేయడంలో మీరు పన్ను రిటర్న్ తయారీదారుడు లేదా TRP సహాయం తీసుకోకపోతే, TRP కి సంబంధించిన టెక్స్ట్ బాక్స్‌లను ఖాళీగా ఉంచవచ్చు.


దశ 12: అంతర్గత ధ్రువీకరణలు విజయవంతంగా పూర్తయిన తర్వాత, 'ప్రివ్యూ' పై క్లిక్ చేయండి.

Data responsive

గమనిక: మీ రిటర్న్‌లో లోపాల జాబితా కనిపిస్తే, ఆ లోపాలను సరిచేయడానికి మీరు తిరిగి ఫారానికి వెళ్లాలి. ఒకవేళ ఎటువంటి లోపాలు లేకపోతే, మీ రిటర్న్‌ను ప్రివ్యూ చేయడానికి కొనసాగవచ్చు.

దశ 13: 'రిటర్న్ ప్రివ్యూ' మరియు 'ధ్రువీకరణకు కొనసాగండి' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 14: అప్‌లోడ్ స్థాయి ధ్రువీకరణ ద్వారా రిటర్న్ విజయవంతంగా ధ్రువీకరించబడిన తర్వాత, 'ధ్రువీకరణకు కొనసాగండి' పై క్లిక్ చేయండి.

Data responsive

దశ15: మీ ధ్రువీకరణను పూర్తి చేయండి' పేజీలో, మీకు నచ్చిన ఎంపికను ఎంచుకుని, 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.

మీ రిటర్న్‌ను ధ్రువీకరించడం తప్పనిసరి.ఈ-వెరిఫికేషన్ (సిఫార్సు చేయబడిన ఎంపిక – ఈ-వెరిఫై) మీ ITR ను ధ్రువీకరించడానికి అత్యంత సులభమైన మార్గం. ఇది వేగవంతమైనది, కాగితం అవసరం లేనిది మరియు సంతకం చేసిన భౌతిక ITR-V ను స్పీడ్ పోస్ట్ ద్వారా CPC కి పంపడం కంటే మరింత సురక్షితమైనది.

Data responsive

గమనిక: ఒకవేళ మీరు 'తర్వాత ఈ-వెరిఫై చేయండి' ను ఎంచుకుంటే, మీరు మీ రిటర్న్‌ను సబ్మిట్ చేయవచ్చు, కానీ మీ ITR దాఖలు చేసిన 30 రోజులలోపు మీ రిటర్న్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది.

దశ6: 'ఈ-వెరిఫై' పేజీలో, మీరు రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయాలనుకుంటున్న ఎంపికను ఎంచుకుని, 'కంటిన్యూ’ క్లిక్ చేయండి.

గమనిక:

  • మరింత తెలుసుకోవడానికి ఈ-వెరిఫై ఎలా చేయాలి అనే యూజర్ మాన్యువల్‌ను చూడండి.
  • ఒకవేళ మీరు ITR-V ద్వారా ధ్రువీకరించడాన్ని ఎంచుకుంటే, మీరు సంతకం చేసిన భౌతిక ITR-V పత్రాన్ని 30 రోజులలోపు స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు 560500 కి పంపవలసి ఉంటుంది.
  • దయచేసి మీరు మీ బ్యాంక్ ఖాతాను ముందుగా ధ్రువీకరించారని నిర్ధారించుకోండి. తద్వారా చెల్లించాల్సిన ఏవైనా రీఫండ్‌లు మీ బ్యాంక్ ఖాతాకి జమ చేయబడతాయి.
  • మరింత సమాచారం కోసం నా బ్యాంక్ ఖాతా యూజర్ మాన్యువల్‌ను చూడండి.

 గమనిక: 31/03/2024 నాటి నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం-

  1. ఆదాయపు పన్ను రిటర్న్‌ను అప్‌లోడ్ చేసి, ఆ తర్వాత 30 రోజులలోపు ఈ-వెరిఫికేషన్ లేదా ITR-Vని సమర్పించిన సందర్భాల్లో, ఆ రిటర్న్‌ను అప్‌లోడ్ చేసిన తేదీనే దానిని సమర్పించిన తేదీగా పరిగణిస్తారు.
  2. ఆదాయపు రిటర్న్‌ను అప్‌లోడ్ చేసినప్పటికీ, అప్‌లోడ్ చేసిన తేదీ నుండి 30 రోజుల తర్వాత ఈ-వెరిఫికేషన్ లేదా ITR-V ను సమర్పించిన సందర్భాల్లో, ఈ-వెరిఫికేషన్/ ITR-V సమర్పించిన తేదీనే ఆదాయపు రిటర్న్ సమర్పించిన తేదీగా పరిగణిస్తారు. అలాగే, చట్టం ప్రకారం ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేసినందుకు వర్తించే అన్ని పరిణామాలు కూడా అమలులోకి వస్తాయి.
  3. నిర్దేశించిన నమూనా మరియు పద్ధతి ప్రకారం సక్రమంగా ధ్రువీకరించబడిన ITR-V ని సాధారణ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా మరేదైనా విధానంలో ఈ క్రింది చిరునామాకు మాత్రమే పంపాలి: సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు - 560500, కర్ణాటక.
  4. CPC వద్ద సక్రమంగా ధ్రువీకరించబడిన ITR-V స్వీకరించిన తేదీని, ఆదాయపు రిటర్న్‌ను అప్‌లోడ్ చేసిన తేదీ నుండి 30 రోజుల వ్యవధిని నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకుంటారు.
  5. నిర్దిష్ట సమయ పరిమితిలోపు అప్‌లోడ్ చేసిన తర్వాత ఆదాయ రిటర్న్ ధ్రువీకరించబడనట్లయితే, అటువంటి రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుందని మరింత స్పష్టం చేయబడింది.

మీరు మీ రిటర్న్‌ను ఈ-వెరిఫై చేసిన తర్వాత, ట్రాన్సాక్షన్ ID మరియు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌తో పాటు ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కి కూడా మీకు నిర్ధారణ సందేశం అందుతుంది.

Data responsive