Do not have an account?
Already have an account?

సాధారణ ఫారాలు

తరచుగా అడిగే సాధారణ ప్రశ్నలు

1. ఫారం 3CB-3CDని సమర్పించేటప్పుడు “UDIN” పేజీ కనిపిస్తుంది. టాక్స్ ఆడిట్ రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేయడానికి ముందే మేము UDINని సక్రమంగా పొందినప్పటికీ, ఆ UDIN వివరాలను నమోదు చేయలేకపోతున్నాను. దానికి బదులుగా నేను “నా దగ్గర UDIN లేదు / నేను తర్వాత అప్‌డేట్ చేస్తాను” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలా?

UDIN కోసం బల్క్ అప్‌లోడ్ సదుపాయం ప్రస్తుతం కేవలం ఫారం 15CB కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ సదుపాయం ఇతర ఫారాలకు కూడా అందుబాటులోకి రానుంది. అప్పటి వరకు, మీరు “నా దగ్గర UDIN లేదు / నేను తర్వాత అప్‌డేట్ చేస్తాను.” అనే ఎంపికను ఎంచుకుని ఫారాన్ని దాఖలు చేయవచ్చు. అన్ని ఫారాలకు UDIN సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత, మీరు పోర్టల్‌లో దానిని అప్‌డేట్ చేసుకోవచ్చు.

2. నేను ఫారం 10B ని ఫైల్ చేసి సమర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే, సమర్పించినప్పుడు ఆ పేజీలో "ARN కోసం చెల్లని ఫార్మాట్" అనే తప్పు కనిపిస్తోంది. నేను ఏమి చేయాలి?

ఫారం 10Bని ఫైల్ చేయడానికి ముందు దయచేసి "నా ప్రొఫైల్" విభాగం నుండి మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయండి అలాగే అన్ని తప్పనిసరి ఫీల్డ్‌లు పూరించబడ్డాయని నిర్ధారించుకోండి. మీ ప్రొఫైల్ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు మళ్లీ లాగిన్ చేసి మళ్లీ ప్రయత్నించవచ్చు.

3. నేను ఫారం 67 ఎందుకు సమర్పించాలి?

భారతదేశం వెలుపల ఏదైనా దేశం లేదా నిర్దిష్ట ప్రాంతంలో చెల్లించిన విదేశీ పన్నుకు సంబంధించిన క్రెడిట్‌ను పొందాలనుకుంటే, మీరు ఫారం 67 ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, గత సంవత్సరాల్లో క్రెడిట్ పొందిన విదేశీ పన్నుకు రీఫండ్ లభించేలా చేసే ప్రస్తుత సంవత్సరపు నష్టాన్ని వెనుకకు తీసుకువెళ్లే సందర్భంలో కూడా మీరు ఫారం 67 ను సమర్పించాల్సి ఉంటుంది.

4. ఫారం 67ను ఏయే పద్ధతుల్లో సమర్పించవచ్చు?

ఫారం 67ను కేవలం ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించవచ్చు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత, ఫారం 67ను ఎంచుకుని, దానిని సిద్ధం చేసి సమర్పించండి.
 

5. ఫారం 67ను ఈ-వెరిఫై చేయడం ఎలా?

మీరు EVC లేదా DSCని ఉపయోగించి ఫారాన్ని ఈ-వెరిఫై చేయవచ్చు. మరింత తెలుసుకోవడానికి ‘ఈ-వెరిఫై చేయడం ఎలా’ అనే వినియోగదారు కరదీపికను చూడవచ్చు.

6. నా తరపున ఫారం 67 దాఖలు చేయడానికి నేను ఒక అధీకృత ప్రతినిధిని నియమించవచ్చా?

అవును, మీ తరపున ఫారం 67 దాఖలు చేయడానికి మీరు ఒక అధీకృత ప్రతినిధిని నియమించుకోవచ్చు.
 

7. ఫారం 67ను దాఖలు చేయడానికి గడువు ఎంత?

సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన రిటర్న్ దాఖలు గడువు తేదీకి ముందే ఫారం 67 దాఖలు చేయాలి.

8. చట్టబద్ధమైన ఫారాలను దాఖలు చేసేటప్పుడు అటాచ్‌మెంట్‌లను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పేజీలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అటాచ్‌మెంట్‌లను అప్‌లోడ్ చేసేటప్పుడు నేను ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?

ఫైల్ పేరు పెట్టే విధానం వల్ల ఈ లోపం తలెత్తి ఉండవచ్చు. దయచేసి ఫైల్ పేరులో ఎటువంటి ప్రత్యేక అక్షరాలను ఉపయోగించవద్దు మరియు పేరును క్లుప్తంగా ఉంచండి. అలాగే, అటాచ్‌మెంట్ పరిమాణం 5 MB కంటే తక్కువగా ఉండాలి మరియు అది కేవలం PDF లేదా Zip ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి.

9. నేను ఫారం 29Bని అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. నేను ఫారం 29Bని ఎలా ఫైల్ చేసి సమర్పించగలను?

ఫారం 29B ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారు తమ CAకు ఫారం 29Bని కేటాయించాల్సి ఉంటుంది.

పన్ను చెల్లింపుదారు ఆ ఫారాన్ని కేటాయించిన తర్వాత, CA దానిని తమ వర్క్‌లిస్ట్‌లో యాక్సెస్ చేయవచ్చు.

10. ఫారాన్ని సమర్పించేటప్పుడు, పేజీలో "చెల్లని మెటాడేటా" అనే లోపం కనిపిస్తోంది. నేను ఏమి చేయాలి?

ఒకవేళ అటువంటి లోపం ఇంకా కొనసాగుతుంటే, ఎంచుకున్న పన్ను చెల్లింపుదారు, (అసలు / సవరించిన) ఫైలింగ్ రకం లేదా AY వివరాలకు మీ లాగిన్ వివరాలతో పొంతన కుదరని అవకాశం ఉంది. కాబట్టి, పేర్కొన్న అంశాలకు సంబంధించి ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలని మీకు సూచించడమైనది.

11. నేను 2021-22 మదింపు సంవత్సరానికి ఫారం 29Bని దాఖలు చేయలేకపోతున్నాను. ఆ పేజీలో "సమర్పణ విఫలమైంది: చెల్లని ఇన్‌పుట్" అనే లోపం కనిపిస్తోంది. నేను ఏమి చేయాలి?

"అకౌంటెంట్ నివేదిక" లోని 3వ భాగానికి సంబంధించిన ఫీల్డ్ ఖాళీగా వదిలివేసినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఒకవేళ ఆ ఫీల్డ్ మీకు వర్తించకపోతే, "అకౌంటెంట్ నివేదిక"లోని 3వ పేరా కింద ఉన్న టెక్స్ట్ బాక్స్‌లో "NA" అని నమోదు చేసి, ఫారాన్ని మళ్లీ సమర్పించడానికి ప్రయత్నించవచ్చు.

12. నేను 2021-22 మదింపు సంవత్సరానికి ఫారం 29Bని దాఖలు చేయలేకపోతున్నాను. ఆ పేజీలో "ARN కోసం చెల్లని ఫార్మాట్" అనే లోపం కనిపిస్తోంది. నేను ఏమి చేయాలి?

వినియోగదారుని "ప్రొఫైల్" సరిగ్గా అప్‌డేట్ చేయనప్పుడు ఇలా జరుగుతుంది. దయచేసి ఫారంలో నమోదు చేసిన సమాచారానికి మరియు మీ ప్రొఫైల్‌కు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా చూసుకోండి. మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి మళ్లీ లాగిన్ అయ్యి ప్రయత్నించండి.

13. ఫారం 29Bలోని పార్ట్ C (పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన మొత్తం వివరాలు) నింపేటప్పుడు, బుక్ ప్రాఫిట్ ను ఎంత మొత్తంతో పెంచాలో లేదా తగ్గించాలో ఆ విలువలను నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే, ఆ ఫారం రుణాత్మక విలువను స్వీకరించడం లేదు. నేను ఏమి చేయాలి?

మీరు బహుశా ఫారం 29B కి సంబంధించిన పాత డ్రాఫ్ట్‌లపై పని చేస్తూ ఉండవచ్చు. దయచేసి ఆ డ్రాఫ్ట్‌ను తొలగించి, కొత్త ఫారాన్ని దాఖలు చేయండి.

14. సెక్షన్ 10AA కింద ఫారం 56Fను దాఖలు చేస్తున్నప్పుడు ఆ పేజీలో లోపాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 29 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 56F తొలగించబడి దాని స్థానంలో 56FF (కేవలం పునఃపెట్టుబడి వివరాల కోసం) ప్రవేశపెట్టబడింది. అయితే, 10A తో కలిపి చదివినప్పుడు 10AA విభాగంలో ఎటువంటి మార్పు లేదు. నేను 56Fను దాఖలు చేయాలా?

ఈ రెండు ఫారాలు పోర్టల్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ లేదా మార్గదర్శకాల ఆధారంగా మరియు చట్టం లేదా నిబంధనలలోని వర్తించే నిబంధనల ప్రకారం మీరు తగిన ఫారాన్ని సమర్పించవచ్చు.

15. నేను ఫారం 10Eని ఎప్పుడు దాఖలు చేయాలి?

మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసే ముందే ఫారం 10E ని దాఖలు చేయాలి.

16. ఫారం 10E దాఖలు చేయడం తప్పనిసరా?

అవును, మీ బకాయి లేదా ముందస్తు ఆదాయంపై పన్ను రాయితీని పొందాలనుకుంటే ఫారం 10E దాఖలు చేయడం తప్పనిసరి.

17. నేను ఫారం 10E దాఖలు చేయకుండానే, నా ITRలో సెక్షన్ 89 కింద పన్ను రాయితీని కోరితే ఏమవుతుంది?

ఒకవేళ మీరు ఫారం 10E ను సమర్పించకుండానే మీ ITRలో సెక్షన్ 89 కింద పన్ను ఉపశమనాన్ని కోరినట్లయితే, మీ ITR ప్రాసెస్ చేయబడుతుంది. కానీ సెక్షన్ 89 కింద కోరిన ఆ రాయితీ మాత్రం మంజూరు చేయబడదు.

18. నా ITRలో నేను క్లెయిమ్ చేసిన రాయితీని ITD తిరస్కరించిందని నాకు ఎలా తెలుస్తుంది?

ఒకవేళ సెక్షన్ 89 కింద మీరు కోరిన రాయితీ తిరస్కరించబడితే, మీ ITR ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(1) కింద జారీ చేసే సమాచార నోటీసు ద్వారా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తుంది.

19. ఆర్థిక సంవత్సరం 2019-20కి సంబంధించి ఫారం 10E ను దాఖలు చేసేటప్పుడు నేను ఆదాయ వివరాలను నమోదు చేయలేకపోతున్నాను. నేను ఏమి చేయాలి?

2021-22 మదింపు సంవత్సరం కోసం మీరు ఫారం 10E ను దాఖలు చేస్తున్నారని నిర్ధారించుకోండి. 2021-22 మదింపు సంవత్సరానికి ఫారం 10E దాఖలు చేయడానికి, ఇ-ఫైల్>ఆదాయపు పన్ను ఫారాలు>ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండి>ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఫారాలు>ఫారం 10E> ఇప్పుడే దాఖలు చేయండి పై క్లిక్ చేయండి. మదింపు సంవత్సరాన్ని 2021-22గా ఎంచుకుని, కొనసాగండి పై క్లిక్ చేయండి

20. నేను AY 2021-22 కోసం ITR దాఖలు చేస్తున్నాను. ఫారం 10E దాఖలు చేసేటప్పుడు AYగా దేనిని ఎంచుకోవాలి?

ఒకవేళ మీరు 2021-22 మదింపు సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేస్తుంటే, ఫారం 10Eని సమర్పించేటప్పుడు 2021-22 మదింపు సంవత్సరాన్ని ఎంచుకోవాలి:

21. ఫారం 10Eని సమర్పించేటప్పుడు, మదింపు సంవత్సరానికి వర్తించే పన్నులను నేను చూడలేకపోతున్నాను. నేను ఎలా ముందుకు వెళ్లాలి?

ఆదాయానికి సంబంధించిన అన్ని వివరాలను (పట్టిక Aలోని గత సంవత్సరం ఆదాయ వివరాలతో సహా) నింపారని నిర్ధారించుకోండి. స్లాబ్ రేటు ఆధారంగా పన్ను వివరాలు స్వయంచాలకంగా కనిపిస్తాయి. పోర్టల్‌లోని వివరాల ప్రకారం ఉన్న ఆదాయం మీ గణనతో సరిపోలుతుందో లేదో సరిచూసుకుని, సంబంధిత పట్టికలో పన్ను మొత్తాన్ని నమోదు చేయండి.

22. ఫారం 10BAను సమర్పించేటప్పుడు, "లోపం: దయచేసి సరైన విలువలను నమోదు చేయండి" అనే లోపం కనబడుతోంది. నేను ఏమి చేయాలి?

ఫారాన్ని సమర్పించేటప్పుడు మీకు ఇలాంటి సమస్య ఎదురైతే, ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడానికి సూచించిన దశలన్నీ పూర్తయ్యాయని నిర్ధారించుకోండి. అదనంగా, “డిలిట్ డ్రాఫ్ట్” పై క్లిక్ చేయడం ద్వారా ఫారం పాత డ్రాఫ్ట్‌ను తొలగించండి. ఆ తర్వాత, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి మళ్లీ లాగిన్ అయ్యి ప్రయత్నించండి.

23. ఫారం 35ను సమర్పించేటప్పుడు, అప్పీల్ ఫీజు చలాన్ వివరాలను నమోదు చేస్తుండగా "చెల్లించిన అప్పీల్ ఫీజు, సందర్భాన్ని బట్టి రూ. 250, 500 లేదా 1000 ఉండాలి" అనే లోపం కనిపిస్తోంది. నేను ఏమి చేయాలి?

"అప్పీల్ వివరాలు" అనే 4వ ప్యానెల్ ను తెరవండి.

  • "అంచనా వేయబడిన ఆదాయం" వంటి తప్పనిసరి అంశాలు నవీకరించబడినట్లు దయచేసి నిర్ధారించుకోండి.
  • TDS అప్పీల్ విషయంలో, దీనిని "వర్తించదు" గా ఎంచుకోవచ్చు.

ఈ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత, 7వ ప్యానెల్ అంటే "అప్పీల్ దాఖలు వివరాలు"కు వెళ్లి, చలాన్ వివరాలను తొలగించి, తిరిగి నమోదు చేయడానికి ప్రయత్నించండి.

24. ఫారం 10ICని సమర్పించేటప్పుడు, "ఫారం 10-IBలో సెక్షన్ 115BA(4) కింద ఉన్న ఎంపికను వినియోగించుకున్నారా?" అనే ప్రశ్నకు నేను "అవును" అని ఎంచుకున్నాను. అయినప్పటికీ, "గత సంవత్సరం" మరియు "ఫారం 10-IB సమర్పించిన తేదీ" అనే ముందే నింపబడిన వివరాలు కనిపించలేదు. నేను ఏమి చేయాలి?

"ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి"లో ఇప్పటికే సేవ్ అయి ఉన్న 'డ్రాఫ్ట్' ఫారం 10-ICని మీరు తొలగించి, ఆ ఫారాన్ని కొత్తగా ఫైల్ చేయడం ప్రారంభించాలి.

25. ఫారం 10ICని సమర్పించేటప్పుడు, "ఫారం 10-IBలో సెక్షన్ 115BA(4) కింద ఉన్న ఎంపికను వినియోగించుకున్నారా?" అనే ప్రశ్నకు నేను "అవును" అని ఎంచుకున్నాను, కానీ "నేను ఇంతకుముందు వినియోగించుకున్న సెక్షన్ 115BA(4) ఎంపికను దీని ద్వారా ఉపసంహరించుకుంటున్నాను..." అనే చెక్ బాక్స్ సేవ్ అవ్వడం లేదు. నేను ఏమి చేయాలి?

మీరు “ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి”లో ఇప్పటికే సేవ్ చేయబడిన ‘డ్రాఫ్ట్’ ఫారం 10-ICని తొలగించి, ఫారాన్ని కొత్తగా ఫైల్ చేయడం ప్రారంభించాలి.

26. ఫారం 10-IBని సమర్పించేటప్పుడు, "నా ప్రొఫైల్" నుండి కంపెనీకి సంబంధించిన ప్రాథమిక వివరాలు సరిగ్గా ఆటో-పాపులేట్ కాలేదు. నేను ఏమి చేయాలి?

"ఆదాయపు పన్ను ఫారాలు ఫైల్ చేయండి"లో ఇప్పటికే సేవ్ అయి ఉన్న 'డ్రాఫ్ట్' ఫారం 10-IBని మీరు తొలగించి, ఆ ఫారాన్ని కొత్తగా ఫైల్ చేయడం ప్రారంభించాలి.

27. ఫారం 10-IDని సమర్పించేటప్పుడు, "పన్ను నిర్ధారణ అధికారి" వివరాలు "నా ప్రొఫైల్" నుండి ఆటోమేటిక్‌గా నమోదు కావడం లేదు. నేను ఏమి చేయాలి?

మీరు ఇప్పటికే "ఆదాయపు పన్ను ఫారాలు ఫైల్ చేయండి" సేవ్ చేయబడిన 'డ్రాఫ్ట్' ఫారం 10-IDని తొలగించి, ఫారాన్ని కొత్తగా దాఖలు చేయడం ప్రారంభించండి.

28. 'సమర్పణ విఫలమైంది' అనే లోపపు మెసేజ్ వస్తుండటంతో నేను ఫారం 10DAను సమర్పించలేకపోతున్నాను. నేను ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలి? సమాధానం:

"ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి"లో ఇప్పటికే సేవ్ అయి ఉన్న పాత ఫారాన్ని మీరు తొలగించి, ఆ ఫారాన్ని మొదటి నుండి కొత్తగా ఫైల్ చేయడం ప్రారంభించాలి. వెరిఫికేషన్ ప్యానెల్‌లో చిరునామా వివరాలతో సహా అన్ని అంశాలు పూర్తిగా అప్‌డేట్ అయ్యేలా చూసుకుని, ఆ తర్వాత ఫారాన్ని సమర్పించడానికి మళ్లీ ప్రయత్నించండి.

29.నా పాన్ (PAN) కర్ణాటక క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీల చట్టం, 1959 కింద క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌గా నమోదు చేయబడింది. నేను సెక్షన్ 115BAD కింద తక్కువ పన్ను రేటును ఎంచుకోవాలనుకుంటున్నాను. అన్ని షరతులు నెరవేరినప్పటికీ, నేను ఫారం 10-IF ను దాఖలు చేయలేకపోతున్నాను. నేను ఏమి చేయాలి?

సెక్షన్ 115BAD కింద లభించే ప్రయోజనం కేవలం సహకార సంఘాలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు AOPగా కాకుండా ఆర్టిపీషియల్ జురీడికల్ పర్సన్ గా నమోదై ఉండే అవకాశం ఉంది, అందుకే ఫారం 10IFను దాఖలు చేయడానికి వీలు పడటం లేదు. కాబట్టి, దయచేసి NSDL ద్వారా మీ వివరాలను అప్‌డేట్ చేయించుకోవాల్సిందిగా కోరడమైనది.