ఫారమ్ 52A
ఫారం 52A తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఫారం 52Aను ఎవరు దాఖలు చేయాలి?
ఏదైనా ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా గానీ లేదా అందులో కొంత భాగం గానీ, చలనచిత్ర నిర్మాణాన్ని చేపట్టిన లేదా ఏదైనా నిర్దిష్ట కార్యకలాపంలో నిమగ్నమైన, లేదా ఈ రెండింటినీ నిర్వహిస్తున్న ఏ వ్యక్తి అయినా, సదరు నిర్మాణంలో లేదా నిర్దిష్ట కార్యకలాపంలో తనచే నియమించబడిన ప్రతి వ్యక్తికి, తాను చేసిన లేదా తాను చెల్లించవలసి ఉన్న, మొత్తంగా యాభై వేల రూపాయలకు మించిన చెల్లింపుల వివరాలను సమర్పించాలి.
2. పేర్కొన్న కార్యకలాపాలు ఏమిటి?
నిర్దిష్ట కార్యకలాపం అనగా ఏదైనా ఈవెంట్ నిర్వహణ, డాక్యుమెంటరీ నిర్మాణం, టెలివిజన్ లేదా ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా ఏదైనా ఇతర సారూప్య ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి కార్యక్రమాల నిర్మాణం, క్రీడా ఈవెంట్ నిర్వహణ, ఇతర ప్రదర్శన కళలు లేదా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్‌లో నోటిఫికేషన్ ద్వారా ఈ విషయంలో నిర్దేశించగల ఏదైనా ఇతర కార్యకలాపం.
3. ఫారమ్ 52A దాఖలు చేయడానికి గడువు తేదీ ఏమిటి?
మునుపటి సంవత్సరం ముగిసిన 60 రోజుల లోపు ఫారం 52A సమర్పించాల్సి ఉంటుంది.
4. ఫారమ్52A దాఖలు చేయడానికి ముందస్తు అవసరాలు ఏమిటి?
ఫారం 52A దాఖలు చేయడానికి కావలసిన ముందస్తు అవసరాలు క్రింది విధంగా ఉన్నాయి:
- పన్ను చెల్లింపుదారుడు PAN కలిగి ఉండాలి.
- పన్ను చెల్లింపుదారుని PAN తప్పనిసరిగా క్రియాశీలకంగా ఉండి, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడి ఉండాలి.
5. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఫారం 52A దాఖలు చేసే ప్రక్రియ ఏమిటి?
ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఫారం 52Aను ఆన్లైన్లో దాఖలు చేయడానికి గల దశలు క్రింది విధంగా ఉన్నాయి:
1వ దశ: పన్ను చెల్లింపుదారు, PANను User IDగా ఉపయోగించి ఆదాయ పన్ను పోర్టల్ లో అంటే, www.incometax.gov.inలో లాగిన్ అవ్వాలి.
2వ దశ : ఈ-ఫైల్ -> ఆదాయపు పన్ను ఫారాలు -> ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండి -> ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఫారాలు -> ఫారం 52A కు వెళ్లండి.
3వ దశ:“ప్రాథమిక సమాచారం”, “భాగం - A”, “భాగం - B”, “ధ్రువీకరణ” అనే 4 ప్యానెల్‌లలో అవసరమైన వివరాలను పూరించండి మరియు వర్తించే చోట CSV ఫైళ్లను జోడించండి.
4వ దశ: ప్రివ్యూ తెరపై ఉన్న వివరాలను సమీక్షించండి; వివరాలన్నీ సరిగ్గా నమోదు చేయబడి ఉంటే, ఫారంను ఈ-ధ్రువీకరించడానికి (e-Verify) ముందుకు సాగండి.
6. ఫారం 52A ను ఎలా ధ్రువీకరించవచ్చు?
మీరు EVC లేదా DSCని ఉపయోగించి ఫారం 52Aని ఈ-ధ్రువీకరణ చేయవచ్చు.
మరింత తెలుసుకోవడానికి మీరు ఇ-వెరిఫై చేయడం ఎలా అనే (https://www.incometax.gov.in/iec/foportal/help/how-to-e-verify-your-e-filing-return) వినియోగదారుల మాన్యువల్‌ను చూడవచ్చు.
7. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఫారం 52A దాఖలు చేయడానికి అవసరమైన సమాచారం / వివరాలు ఏమిటి?
ఫారం 52A దాఖలు చేయడానికి ఈ క్రింది సమాచారం/వివరాలు అవసరం:
- గత సంవత్సరంలో నిర్మించబడిన చలనచిత్రాలు లేదా చేపట్టిన నిర్దిష్ట కార్యకలాపాలు లేదా రెండూ గురించిన వివరాలు, అవి: నిర్మించిన చలనచిత్రం లేదా చేపట్టిన నిర్దిష్ట కార్యకలాపం పేరు, ప్రారంభ తేదీ మరియు ఒకవేళ పూర్తయినట్లయితే, ఆ పూర్తి తేదీ.
- చలనచిత్రాల నిర్మాణంలో లేదా చేపట్టే నిర్దిష్ట కార్యకలాపాలలో లేదా రెండింటిలోనూ అటువంటి వ్యక్తులను నిమగ్నం చేసినందుకుగాను, రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేసిన లేదా చెల్లించవలసిన వ్యక్తుల పేరు, పాన్, ఆధార్ (అందుబాటులో ఉంటే), చిరునామా.
- నగదు రూపంలో చెల్లించిన మొత్తం / నగదు కాకుండా ఇతర రూపంలో చెల్లించిన మొత్తం / అట్టి వ్యక్తులకు చెల్లించవలసిన మొత్తం
- అటువంటి వ్యక్తులకు చెల్లించిన/చెల్లించవలసిన మొత్తాలకు గాను మూలం వద్ద మినహాయించిన పన్నుల వివరాలు, అనగా మినహాయించిన పన్నుల మొత్తం మరియు ఏ సెక్షన్ కింద మినహాయించబడింది అనే వివరాలు.
8. ఫారం 52A లోని భాగం – A లో వివరాలను నేను ఎలా పూరించాలి?
సంవత్సరంలో నిర్మించిన చలనచిత్రాలకు లేదా చేపట్టిన నిర్దిష్ట కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను అందించడానికి పన్ను చెల్లింపుదారుకు 2 ఎంపికలు ఉన్నాయి:
- వివరాలు జోడించండి:
- పన్ను చెల్లింపుదారు, తాము నిర్మించిన చలనచిత్రాల పేర్లను లేదా చేపట్టిన నిర్దిష్ట కార్యకలాపాలను, ఒక్కో చిత్రం లేదా కార్యకలాపానికి ప్రత్యేక వరుసను జోడించడం ద్వారా పట్టికలో పేర్కొనాల్సి ఉంటుంది.
- ప్రాథమిక సమాచార ప్యానెల్లో పేర్కొన్న విధంగా అన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల వివరాలు అందించిన తర్వాత మాత్రమే పార్ట్ - A సేవ్ చేయడానికి "సేవ్" బటన్ సశక్తమవుతుంది.
- 'పార్ట్ – A'లో అందించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా నిర్దిష్ట కార్యకలాపాల వివరాలను, ప్రాధమిక సమాచారం ప్యానెల్లో పేర్కొన్న విధంగా ఉత్పత్తి చేయబడిన చిత్రాల సంఖ్య లేదా చేపట్టబడిన కార్యకలాపాల సంఖ్యతో సరిచూసుకోవాలి. అన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా నిర్దిష్ట కార్యకలాపాల వివరాలను నమోదు చేసిన తర్వాత, "వివరాలు జోడించండి" బటన్ నిష్క్రియం చేయబడుతుంది. ఒకవేళ మీరు మరిన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా నిర్దిష్ట కార్యకలాపాలను జోడించాలనుకుంటే, కొత్త వివరాలను జోడించడానికి వీలుగా ముందుగా ప్రాధమిక సమాచారంలోని సంఖ్యను సరిచేయండి.
- CSV జోడించండి:
- పన్ను చెల్లింపుదారు తాము నిర్మించిన చలనచిత్రాల పేర్లను లేదా చేపట్టిన నిర్దిష్ట కార్యకలాపాలను ఎక్సెల్ టెంప్లేట్లో పేర్కొనాల్సి ఉంటుంది.
- ఎక్సెల్ టెంప్లేట్‌లోని వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత, దానిని CSV ఫార్మాట్లోకి మార్చి, ఆపై ఆ CSV ఫైల్‌ను అప్లోడ్ చేయండి.
- అప్లోడ్ చేసిన CSV ఎటువంటి లోపాలు లేకుండా ధ్రువీకరించబడిన తర్వాత "సేవ్" బటన్ ఎనేబుల్ చేయబడుతుంది.
దయచేసి గమనించండి, పన్ను చెల్లింపుదారుడు 'వివరాలను జోడించు' ఎంపికను ఎంచుకుని, కొన్ని చలనచిత్ర చిత్రాలు లేదా నిర్దిష్ట కార్యకలాపాల వివరాలను సేవ్ చేసిన తర్వాత 'CSVని జోడించు' ఎంపికను ఎంచుకుంటే లేదా దీనికి విరుద్ధంగా చేస్తే, ముందుగా ఎంచుకున్న ఎంపిక కోసం సేవ్ చేసిన డేటా తొలగించబడుతుంది. పన్ను చెల్లింపుదారుడు వివరాలను మళ్లీ నింపి పార్ట్ – Aని సేవ్ చేయాల్సి ఉంటుంది.
9. Part – A కోసం CSV ఫైల్‌ను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఈ క్రింది దోషాలు వస్తున్నాయి. దీని అర్థం ఏమిటి మరియు దీనిని నేను ఎలా సరిదిద్దాలి?
CSVలో అవసరమైన దిద్దుబాట్లన్నీ చేసిన తర్వాత, మీరు దానిని తిరిగి అప్లోడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. |
10. నేను Part – B కోసం CSV ఫైల్‌ను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, “పార్ట్ B CSVలో ప్రతి చలనచిత్ర చిత్రం / నిర్దేశిత కార్యకలాపం ఎదురుగా కనీసం ఒక ఎంట్రీ ఉండాలి” అనే దోషం వస్తోంది. దీని అర్థం ఏమిటి? దీనిని నేను ఎలా సరిదిద్దాలి?
కింది రెండు సందర్భాలలో మీకు ఈ దోషం రావచ్చు:
క్ర. సం. | సందర్భం | పరిష్కారం / తీసుకోవాల్సిన చర్య |
1. | చలనచిత్రం / నిర్దేశిత కార్యకలాపం పేరు పార్ట్ – Aలో పేర్కొనబడింది, కానీ దానికి సంబంధించిన వివరాలు పార్ట్ – B CSVలో అందించబడలేదు. | చలనచిత్రాల నిర్మాణం లేదా నిర్దేశిత కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు చెల్లించిన రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తపు చెల్లింపుల వివరాలకు సంబంధించి, కనీసం ఒక్క నమోదు అయినా ఉండాలని దయచేసి గమనించండి. పార్ట్ – Aలో పేర్కొన్న విధంగా, పార్ట్ – B CSVలో అన్ని చలనచిత్రాలు లేదా నిర్దేశిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను తప్పక అందించగలరు. |
2. | చలనచిత్రాల నిర్మాణం లేదా నిర్దేశిత కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులకు రూ. 50,000 కంటే అధికంగా జరిపిన చెల్లింపుల వివరాలు పార్ట్ – B CSVలో అందించబడ్డాయి; అయితే, ఆ చలనచిత్రం లేదా నిర్దేశిత కార్యకలాపం యొక్క పేరు పార్ట్ – Aలో పేర్కొనబడలేదు. | Part – Aలో పేర్కొన్న చలనచిత్రాలు లేదా నిర్దేశిత కార్యకలాపాల పేర్లు, Part – Bలో పేర్కొన్న చలనచిత్రాలు లేదా నిర్దేశిత కార్యకలాపాల పేర్లతో సరిచూడబడి ధ్రువీకరించబడతాయని దయచేసి గమనించగలరు. పార్ట్ - A, పార్ట్-B రెండింటిలోనూ అన్ని చలనచిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల పేర్లు అందించబడినవా దయచేసి నిర్ధారించుకోండి. |
11. ప్రాథమిక సమాచార ప్యానెల్లో నేను ఏవైనా మార్పులు చేస్తే పార్ట్ - A లేదా పార్ట్ - Bలో జతచేయబడిన CSV ఎందుకు తొలగించబడుతుంది??
నిర్మించిన చలనచిత్రాల సంఖ్య మరియు వివరాలు లేదా చేపట్టిన నిర్దేశిత కార్యకలాపాలు "ప్రాథమిక సమాచారం", "పార్ట్ - A" మరియు "పార్ట్ - B" అనే మూడు ప్యానెళ్లలోనూ ధృవీకరించబడుతున్నాయని దయచేసి గమనించండి. పన్ను చెల్లింపుదారుడు ప్రాథమిక సమాచారం లేదా పార్ట్ - A ప్యానెల్లో చలనచిత్రాలు లేదా నిర్దేశిత కార్యకలాపాలకు సంబంధించి అందించిన వివరాలలో ఏవైనా మార్పులు/సవరణలు చేస్తే, పార్ట్ - A మరియు పార్ట్ - B లలో పన్ను చెల్లింపుదారుడు అందించిన వివరాలు తొలగించబడతాయి. పన్ను చెల్లింపుదారుడు పార్ట్ - A మరియు పార్ట్ - B లలో వివరాలను మళ్లీ పూరించాలి లేదా csvని జతచేయాలి.
12. గత సంవత్సరంలో నిర్మించిన ప్రతి చలనచిత్రానికి లేదా చేపట్టిన నిర్దేశిత కార్యకలాపానికి నేను ప్రత్యేకంగా ఫారం 52A దాఖలు చేయాలా?
కాదు, గత సంవత్సరంలో నిర్మించిన ప్రతి చలనచిత్రానికి లేదా చేపట్టిన ప్రతి నిర్దేశిత కార్యకలాపానికి మీరు ప్రత్యేకంగా ఫారం 52A దాఖలు చేయాల్సిన అవసరం లేదు. గత సంవత్సరంలో నిర్మించిన అన్ని చలనచిత్రాలకు మరియు/లేదా చేపట్టిన నిర్దేశిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను, ప్రతి TAN నంబరుకు అనుగుణంగా క్రోడీకరించి; ప్రతి TAN నమోదుకు గాను ఒక ప్రత్యేక ఫారం 52Aని సమర్పించాల్సి ఉంటుంది.
13. Part – A లేదా Part – B లో CSV ని అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఒక ఎర్రర్ పైల్ వస్తోంది?
మీరు పార్ట్ – A లేదా పార్ట్ – Bలో CSV ఫైల్‌ను అప్లోడ్ చేసిన తర్వాత, మీరు అందించిన వివరాలు ధ్రువీకరించబడతాయి; ఒకవేళ ఏవైనా లోపాలు గుర్తించబడితే, ఆ లోపాలకు సంబంధించిన వివరాలు మీకు ఒక ఎక్సెల్ ఫైల్ రూపంలో అందించబడతాయి. దయచేసి, నిర్దిష్ట వరుసలలో సంభవించిన దోషాలను తెలుసుకోవడానికి ఆ ఎక్సెల్ ఫైల్‌ను పరిశీలించి, వాటిని సరిదిద్దండి. అవసరమైన దిద్దుబాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత, మీరు ఆ ఫైల్‌ను తిరిగి అప్లోడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
తప్పనిసరిగా అవసరమయ్యే సమాచార వివరాల కోసం, అలాగే ప్రతి ఫీల్డ్ కోసం ఆమోదయోగ్యమైన ఆకృతుల కోసం పార్ట్ – A మరియు పార్ట్ – B రెండింటిలోనూ అందించబడిన CSV సూచనా ఫైళ్లను మీరు పరిశీలించవచ్చు.