Do not have an account?
Already have an account?

Know Your AO

1. మదింపు అధికారి (AO) అంటే ఎవరు?
మదింపు అధికారి (AO) అంటే తన అధికార పరిధిలోని పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించే బాధ్యతలను నిర్వహించే ఆదాయపు పన్ను శాఖ అధికారి.

2. నా AOను నేను ఎప్పుడు సంప్రదించాల్సి ఉంటుంది?
దాఖలు విషయంగా మీకు సమస్యలు ఏవీ లేకపోతే, మీరు మీ AOను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ నియమంగా, ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల సేవలన్నింటినీ అనామక విధానంలో ఆన్‌లైన్‌లో అందించడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ, కొన్ని అసాధారణమైన పరిస్థితులలో, ఆదాయపుపన్ను విభాగం మీ పరిధిలోని AOను సంప్రదించమని మిమ్మల్ని కోరవచ్చు.

3. మీ AOను తెలుసుకోండి అనే సేవను పొందడం కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న నా మొబైల్ నంబర్‌ను నేను ఉపయోగించాల్సి ఉంటుందా?
మీరు ఈ సేవను పొందడానికి చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబరు ఏదైనా ఉపయోగించవచ్చు.

4. నేను వేరే నగరానికి/రాష్ట్రానికి మారితే, నేను నా AOను మార్చుకోవాల్సి ఉంటుందా?
అవును. మీరు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మీ శాశ్వత చిరునామా లేదా నివాస చిరునామాను మార్చినప్పుడు, మీ PAN కొత్త AOకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల కోసం అవసరమైన సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అరుదైన సందర్భాల్లో మీరు మీ AOను సంప్రదించాల్సి రావచ్చు. అందువల్ల, మీ PAN సరైన అధికార పరిధిలో గల AOకి బదిలీ చేయడం ద్వారా అవసరం వచ్చినప్పుడు మీరు అతనిని/ఆమెను సులభంగా సంప్రదించవచ్చు.

5. ఆదాయ పన్ను వార్డ్/సర్కిల్ అంటే ఏమిటి?
ఆదాయ పన్ను సంబంధ సేవలు/పని సమర్థంగా నిర్వహించుట కోసం, నిర్ధిష్ట అధికార పరిధుల ఆధారంగా దేశవ్యాప్తంగా అనేక వార్డులు/సర్కిల్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి వార్డు/సర్కిల్‌ కోసం ఒక అధికార పరిధి AO అంటే, DCIT/ACIT, లేదా ITO ఉంటారు.

6. నా PAN కొత్త AOకు బదిలీ చేయడానికి నేను ఏమి చేయాలి?
మీరు ప్రస్తుత అధికార పరిధి AO నుండి మీ PAN బదిలీ చేయడం కోసం దరఖాస్తు దాఖలు చేయాలి. ఈ ప్రక్రియ కింది విధంగా ఉంటుంది:

  1. చిరునామా మార్చడానికి కారణాన్ని పేర్కొంటూ మీ ప్రస్తుత AOకు ఒక దరఖాస్తు దాఖలు చేయడం.
  2. మార్పు కోసం ఇప్పటికే ఉన్న AOకి దరఖాస్తు చేయమని అతను/ఆమెని అభ్యర్థిస్తూ కొత్త AOకి దరఖాస్తు వ్రాయండి.
  3. ప్రస్తుత AO ఈ దరఖాస్తును ఆమోదించాలి.
  4. ఆమోదించిన తర్వాత, ఆ దరఖాస్తు ఆదాయపు పన్ను కమిషనర్‌కు పంపబడుతుంది.
  5. కమిషనర్ ఆమోదం తరువాత, AO మార్పు జరుగుతుంది.

మీ కొత్త చిరునామా ఆధారంగా మీ PAN కొత్త AOకు బదిలీ చేయడానికి మీరు మీ ప్రస్తుత AOను వ్రాతపూర్వకంగా అభ్యర్థించాల్సి ఉంటుంది.

7. నా PAN కొత్త AOకు బదిలీ చేయబడిందని నాకు ఎలా తెలుస్తుంది?
మీ PAN కోసం అధికార పరిధి AO యొక్క ప్రస్తుత స్థితిని ఇ-ఫైలింగ్ పోర్టల్ > మీ AOను తెలుసుకోండిద్వారా ధృవీకరించుకోవచ్చు. మీరు ఈ సేవను ఉపయోగించడానికి రిజిస్టర్ లేదా లాగిన్ చేయాల్సిన అవసరం లేదు.

 

చివరి పేజీ సమీక్షించబడింది లేదా అప్‌డేట్ చేయబడింది: