మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకునే వినియోగదారులకోసం మెరుపు వీక్షణం
(మీకు పన్ను సంబంధిత పనులు సులభతరం చేయడం)
(మీకు పన్ను సంబంధిత పనులు సులభతరం చేయడం)
మొదటిసారి నమోదు చేసుకునే వినియోగదారుల కోసం తరచుగా అడిగే ప్రశ్నలు యొక్క సంక్షిప్త సమాచారం
1. నేను ఇ-ఫైలింగ్‌లో నమోదైన జీతం తీసుకునే ఉద్యోగిని. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నా పన్నుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎక్కడ చూడవచ్చు?
మీ ఇ-ఫైలింగ్ డ్యాష్‌బోర్డ్‌లో మీ పన్నుకు సంబంధించిన మొత్తం సమాచారం మరియు చేయవలసిన పనులను చూడవచ్చు. డ్యాష్‌బోర్డ్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించిన ముఖ్యమైన సేవలకు లింకులు ఉంటాయి. ఒక్క చూపులో మీరు వీటిని చేయవచ్చు:
- మీ చెల్లుబాటులో ఉన్న PAN, ఆధార్ మరియు ఫోటోతో మీ ప్రొఫైల్‌ను ఎల్లప్పుడూ నవీకరించి ఉంచండి.
- మీ ఆధార్‌ను PANతో లింక్ చేయండి.
- మీ సంప్రదింపు వివరాలను చూడండి మరియు నవీకరించండి.
- ఇ-ఫైలింగ్ అధిక భద్ల్రత వాల్ట్ సేవతో మీ ఖాతాను మరింత సురక్షితంగా ఉంచండి.
- బకాయి పన్ను డిమాండ్లను చూడండి మరియు వాటికి స్పందించండి.
- మీ వివిధ FYలు / AYలుకు సంబంధించిన ఆదాయపు పన్ను లెడ్జర్‌ను చూడండి.
- ITR దాఖలుకు సంబంధించిన చేయవలసిన పనులను చూడండి మరియు వాటికి స్పందించండి.
- మీ దాఖలు స్థితిని, రిఫండ్ పెండింగ్‌లో ఉందా లేదా డిమాండ్ అంచనా వేయబడిందా అనే వివరాలతో సహా చూడండి.
- సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయండి మరియు ఇప్పటికే దాఖలు చేసిన రిటర్న్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
- TDS, ముందస్తుగా చెల్లించేపన్ను మరియు స్వీయ మదింపు పన్ను వంటి మీ పన్ను జమ వివరాలను చూడండి.
- మీ వర్క్‌లిస్ట్‌లో పెండింగ్‌లో ఉన్న చర్యలకు స్పందించండి.
- గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లు మరియు ఇటీవల దాఖలు చేసిన ఫారాలను చూడండి.
- మీ ఫిర్యాదు వివరాలను చూడండి.
2. నేను ఒక పన్ను చెల్లింపుదారుని. నా ఇ-ఫైలింగ్ వర్క్‌లిస్ట్‌లో నాకు అందుబాటులో ఉన్న సేవలు ఏమిటి?
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, HUF, కంపెనీ, సంస్థ, ట్రస్ట్, AJP, AOP, BOI, స్థానిక సంస్థ మరియు ప్రభుత్వానికి ఇ-ఫైలింగ్ వర్క్‌లిస్ట్‌లో క్రింది సేవలు అందుబాటులో ఉంటాయి:
- మీ చర్య కోసం:
- ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ఫారాలు
- చెల్లించాల్సి ఉన్న రిఫండ్‌లు
- ITDREIN అభ్యర్థన
- ఇ-ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉంది / ITR-V అందలేదు / తిరస్కరించబడింది
- మిమ్మల్ని అధీకృత సంతకందారుగా జోడించేందుకు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలు (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే)
- మిమ్మల్ని అధీకృత ప్రతినిధిగా జోడించేందుకు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలు (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే)
- గడువు తేదీ తర్వాత అందిన ITR-V
- దాఖలు చేయడానికి పెండింగ్‌లో ఉంది
- పన్ను మినహాయింపుదారు మరియు పన్ను వసూలుదారు నమోదుకు ఆమోదం మరియు సవరణ (సంస్థ PAN కోసం)
- మీ సమాచారం కోసం:
- అప్‌లోడ్ చేసిన ఫారం వివరాలను చూడండి
- ప్రతినిధి మదింపుదారునిగా జోడించేందుకు సమర్పించిన అభ్యర్థనలు
- అధీకృత సంతకందారుగా జోడించేందుకు సమర్పించిన అభ్యర్థనలు
- అధీకృత ప్రతినిధిగా జోడించేందుకు సమర్పించిన అభ్యర్థనలు
- అందిన అధీకృత సంతకందారు అభ్యర్థనలు (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే)
- అందిన అధీకృత ప్రతినిధి అభ్యర్థనలు (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే)
- ITDREIN అభ్యర్థన వివరాలను చూడండి (రిపోర్టింగ్ సంస్థ ద్వారా అధీకృత PANగా జోడించబడిన వ్యక్తుల కోసం)
- ఆమోదించబడిన / తిరస్కరించబడిన TAN నమోదు వివరాలను చూడండి (సంస్థ PAN కోసం)
3. నా డ్యాష్‌బోర్డ్‌ను చూడడానికి నేను లాగిన్ కావాలా?
అవును. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత మాత్రమే డ్యాష్‌బోర్డ్‌ను చూడవచ్చు. ఇందులో లాగిన్ అయిన PANకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఉంటుంది.
4. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
మునుపటి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం రెండు ప్రధాన సౌకర్యాలు మాత్రమే ఉండేవి: ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం మరియు ఇ-దాఖలు చేసిన రిటర్న్‌లు / ఫారాలను చూడడం. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని డ్యాష్‌బోర్డ్‌లో మరెన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఇది మరింత వినియోగదారు-స్నేహపూర్వకంగా రూపొందించబడింది. ఇందులో మీ ప్రొఫైల్, నమోదిత సంప్రదింపు వివరాలు, రిటర్న్ స్థితి, ఆదాయపు పన్ను డిపాజిట్లు, పెండింగ్‌లో ఉన్న చర్యలు, ఇటీవల దాఖలు చేసిన వివరాలు మరియు ఫిర్యాదుల సమాచారాన్ని ఒకే చోట సులభంగా చూడవచ్చు.
5. నా PAN పనిచేయని స్థితిలో ఉంది లేదా ఆధార్‌తో అనుసంధానించబడలేదు. అలాంటప్పుడు నేను డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉన్న వివిధ సేవలను ఉపయోగించవచ్చా?
మీరు నమోదు చేసిన PAN పనిచేయని స్థితిలో ఉంటే, కొన్ని సేవలకు ప్రాప్యత పరిమితం కావచ్చు. పనిచేయని PANతో లాగిన్ అయిన తర్వాత, డ్యాష్‌బోర్డ్‌లో క్రింది హెచ్చరిక పాప్-అప్ సందేశం ప్రదర్శించబడుతుంది:“మీ PAN ఆధార్‌తో అనుసంధానించబడనందున అది పనిచేయని స్థితిలోకి మార్చబడింది. కొన్ని సేవలకు ప్రాప్యత పరిమితం కావచ్చు. సెక్షన్ 234H కింద వర్తించే రుసుమును చెల్లించి, మీ PANను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా దానిని మళ్లీ క్రియాశీలం చేసుకోవచ్చు.”
6. PAN పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు వినియోగదారుకు ఎలా తెలియజేయబడుతుంది?
వినియోగదారు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయినప్పుడు లేదా డ్యాష్‌బోర్డ్ పేజీకి వెళ్లినప్పుడు, “మీ PAN ఆధార్‌తో అనుసంధానించబడనందున అది పనిచేయని స్థితిలోకి మార్చబడింది.” అనే హెచ్చరిక పాప్-అప్ మరియు టిక్కర్ సందేశం ప్రదర్శించబడుతుంది.