ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 285B ప్రకారం సినిమాటోగ్రాఫ్ చిత్రాన్ని నిర్మించు వ్యక్తి లేదా పేర్కొన్న కార్యాచరణలో లేదా రెండింటిలో నిమగ్నమైన వ్యక్తి స్టేట్‌మెంట్ అందించాలి.
ప్రశ్న 1:
ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఫారం 52Aను ఎవరు దాఖలు చేయాలి?
సమాధానం:
ఒక సినిమాటోగ్రాఫ్ చలనచిత్రం నిర్మించే వ్యక్తి లేదా ఏదైనా పేర్కొన్న కార్యాచరణలో నిమగ్నమైన వ్యక్తి లేదా ఇరువురూ, ఏదైనా మొత్తం ఆర్థిక సంవత్సరంలో లేదా ఆర్థిక సంవత్సరంలోని ఏదైనా భాగంలో మొత్తంగా చేసిన చెల్లింపులు లేదా అలాంటి నిర్మాణం లేదా పేర్కొన్న కార్యాచరణలో అతని ద్వారా నియమించబడిన ప్రతి వ్యక్తికి అతను చెల్లించాల్సిన యాభై వేల రూపాయలు పైబడిన చెల్లింపుల వివరాలన్నింటినీ అతను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రశ్న 2:
పేర్కొన్న కార్యకలాపాలు ఏమిటి?
సమాధానం:
పేర్కొన్న కార్యకలాపాలలో ఏదైనా ఈవెంట్ నిర్వహణ, డాక్యుమెంటరీ నిర్మాణం, టెలివిజన్ లేదా ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో లేదా అలాంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయడం కోసం కార్యక్రమాల నిర్మాణం, స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహణ, ఇతర కళా ప్రదర్శనలు భాగంగా ఉంటాయి లేదా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా దీనికి సంబంధించి ఏదైనా ఇతర కార్యాచరణను పేర్కొనవచ్చు.
ప్రశ్న 3:
ఫారమ్ 52A దాఖలు చేయడానికి గడువు తేదీ ఏమిటి?
సమాధానం:
మునుపటి సంవత్సరం ముగింపు నుండి 60 రోజులలో ఫారం 52A సమర్పించాలి.
ప్రశ్న 4:
ఫారమ్52A దాఖలు చేయడానికి ముందస్తు అవసరాలు ఏమిటి?
సమాధానం:
ఫారమ్ 52A దాఖలు కోసం ముందస్తు అవసరాలు క్రింది విధంగా ఉన్నాయి:
- పన్ను చెల్లింపుదారు PANకలిగి ఉండాలి
- పన్ను చెల్లింపుదారు PAN యాక్టివ్‌గా ఉండాలి అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్ పై రిజిస్టర్ చేయబడి ఉండాలి
ప్రశ్న 5:
ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఫారమ్ 52A దాఖలు చేయు ప్రక్రియ ఏమిటి?
సమాధానం:
ఇ-ఫైలింగ్ పోర్టల్ పై ఆన్‌లైన్‌లో ఫారమ్ 52A దాఖలు చేయు దశలు క్రింది విధంగా ఉన్నాయి:
దశ 1:ఆదాయపు పన్ను పోర్టల్‌లో అంటే, www.incometax.gov.in పై పన్ను చెల్లింపుదారు PANను యూజర్ ID గా ఉపయోగించి లాగిన్ అవ్వాలి
దశ 2: ఇ-ఫైల్ à ఆదాయపు పన్ను ఫారంలు à ఆదాయపు పన్ను ఫారంలు దాఖలు చేయండి à వ్యాపార/వృత్తి పరమైన ఆదాయం గల వ్యక్తులు à ఫారమ్ 52A కు నావిగేట్ చేయండి
దశ 3: 4 ప్యానెల్‌లు, "ప్రాథమిక సమాచారం", "పార్ట్ - A", "పార్ట్ - B", "వెరిఫికేషన్"లలో అవసరమైన వివరాలను పూరించండి అలాగే వర్తించే చోట CSV ఫైల్స్ జోడించండి.
దశ 4: ప్రివ్యూ స్క్రీన్‌పై గల వివరాలను సమీక్షించి, అన్ని వివరాలు సరిగ్గా అందించినట్లయితే ఫారమ్ ఇ-వెరిఫై చేయడం కోసం కొనసాగించండి
ప్రశ్న 6:
ఫారమ్ 52A ను ఎలా వెరిఫై చేయవచ్చు?
సమాధానం:
మీరు ఫారమ్ 52Aను EVC లేదా DSC ఉపయోగించి ఇ-వెరిఫై చేయవచ్చు.
ఇ-వెరిఫై ఎలా చేయాలనే దాని గురించి మరింత సమాచారం కోసం మీరు (https://www.incometax.gov.in/iec/foportal//help/how-to-e-verify- your-e-filing-return) యూజర్ మాన్యువల్ చూడవచ్చు.
ప్రశ్న 7:
ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఫారమ్ 52A దాఖలు చేయడానికి అవసరమైన సమాచారం/ వివరాలు ఏమిటి?
సమాధానం:
ఫారమ్ 52A:దాఖలు చేయడానికి ఈ క్రింది సమాచారం/ వివరాలు అవసరం:
- నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాల పేరు లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటి పేరు లేదా రెండింటి పేరు, ప్రారంభ తేదీ మరియు అది పూర్తయిన సందర్భంలో దానిని పూర్తి చేసిన తేదీ వంటి మునుపటి సంవత్సరంలో నిర్మించిన అన్ని సినిమాటోగ్రాఫ్ చలనచిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టినవి, లేదా రెండింటి వివరాలు.
- సినిమాటోగ్రాఫ్ చిత్రాల నిర్మాణం లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టినవి లేదా రెండింటి కోసం నియమించబడి రూ. 50,000లకు పైగా చెల్లింపు చేయబడిన/చెల్లింపు చేయాల్సి ఉన్న వ్యక్తుల పేరు, PAN, ఆధార్ (అందుబాటులో ఉంటే), చిరునామా
- అటువంటి వ్యక్తులకు నగదు రూపంలో/నగదేతర రూపంలో చెల్లించిన / బకాయి మొత్తం
- అటువంటి వ్యక్తులకు చెల్లించిన/చెల్లించవలసిన మొత్తంపై మూలం వద్ద మినహాయించిన పన్నల వివరాలు అనగా మినహాయించిన పన్నుల మొత్తం, ఏ సెక్షన్ ప్రకారం మినహాయించబడినది వంటి వివరాలు
ప్రశ్న 8:
నేను ఫారమ్ 52A యొక్క పార్ట్ - Aలో వివరాలను ఎలా పూరించగలను?
సమాధానం:
సంవత్సరంలో నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటి వివరాలను అందించడానికి పన్ను చెల్లింపుదారు 2 ఎంపికలు కలిగి ఉంటారు:
- జోడించు వివరాలు:
- ప్రతి చిత్రం లేదా పేర్కొన్న కార్యాచరణ కోసం ప్రత్యేక వరుసను జోడిస్తూ నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టబడిన వాటి పేర్లను పన్ను చెల్లింపుదారు పట్టికలో పేర్కొనాలి.
- ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో పేర్కొన్న విధంగా అన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల వివరాలు అందించిన తర్వాత మాత్రమే పార్ట్ - A సేవ్ చేయడానికి "సేవ్" బటన్ ఎనెబుల్ చేయబడుతుంది.
- పార్ట్ - Aలో అందించిన విధంగా సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల వివరాలు ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో పేర్కొన్న విధంగా నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటి సంఖ్యతో వాలిడేట్ చేయబడుతాయి. అన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల వివరాలు అందించిన తర్వాత “వివరాలు జోడించు” బటన్ డిసెబుల్ చేయబడుతుంది. మీరు మరిన్ని సినిమాటోగ్రాఫ్ సినిమాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలను జోడించాలనుకుంటే, కొత్త వివరాలను జోడించడానికి ముందు దయచేసి ప్రాథమిక సమాచారంలోని సంఖ్యను సరిచేయండి.
- CSV జోడించండి:
- పన్ను చెల్లింపుదారు నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటి పేర్లను పన్ను చెల్లింపుదారు ఒక ఎక్సెల్ టెంప్లేట్‌లో అందించాలి.
- ఎక్సెల్ టెంప్లేట్‌లో అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాత, దానిని CSVలోకి మార్చి, ఆపై ఆ CSVని అప్‌లోడ్ చేయాలి.
- అప్‌లోడ్ చేసిన CSV ఎటువంటి తప్పులు లేకుండా ఉందని ధృవీకరించబడిన తర్వాత "సేవ్" బటన్ ఎనెబుల్ అవుతుంది.
కొన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్రొన్న కార్యకలాపాల కోసం వివరాలు జోడించుట మరియు వివరాలను సేవ్ చేయుటను ఎంచుకున్న తరువాత పన్ను చెల్లింపుదారు CSV జోడించుటను ఎంచుకుంటే లేదా దీనికి విరుద్ధంగా చేస్తే, ముందుగా ఎంచుకున్న ఎంపిక కోసం సేవ్ చేసిన డేటా తొలగించబడుతుంది. పన్ను చెల్లింపుదారు వివరాలను మళ్లీ పూరించి పార్ట్ - Aను సేవ్ చేయాల్సి ఉంటుంది.
ప్రశ్న 9:
నేను పార్ట్ - A కోసం CSV అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కింది లోపాలు వస్తున్నాయి - వీటి అర్థం ఏమిటి మరియు దానిని నేను ఎలా సరిచేయాలి?
సమాధానం:
|
వరుస సంఖ్య |
ఎర్రర్ మెసేజ్ |
అవసరమైన పరిష్కారం/ చర్య |
|
1. |
CSVలో నమోదు చేసిన సినిమాటోగ్రాఫ్ చిత్రాల సంఖ్య ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో పేర్కొన్న నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాల సంఖ్యకు సమానం కాదు. |
సినిమాటోగ్రాఫ్ సినిమాలు ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో అందించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాల సంఖ్యకు సమానంగా లేని సందర్భంలో ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఫారమ్‌లోని ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో మీరు నివేదించిన సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్‌ల సంఖ్యకు ఎదురుగా మీరు అన్ని సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్‌ల వివరాలను అందిస్తున్నారని దయచేసి నిర్ధారించుకోండి. |
|
2. |
CSVలో నమోదు చేయబడిన పేర్కొన్న కార్యకలాపాల సంఖ్య, ప్రాథమిక సమాచార ప్యానెల్‌లోని పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటి సంఖ్యకు సమానంగా లేదు |
సినిమాటోగ్రాఫ్ సినిమాలు ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో అందించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాల సంఖ్యకు సమానంగా లేని సందర్భంలో ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఫారమ్‌లోని ప్రాథమిక సమాచార ప్యానెల్‌లో మీరు నివేదించిన పేర్కొన్న కార్యకలాపాల సంఖ్యకు ఎదురుగా అన్ని పేర్కొన్న కార్యకలాపాల వివరాలను మీరు అందిస్తున్నారని దయచేసి నిర్ధారించుకోండి. |
CSVలో అవసరమైన అన్ని సవరణలు చేసిన తర్వాత, మీరు దానిని తిరిగి అప్‌లోడ్ చేయుటను ప్రయత్నించవచ్చు.
ప్రశ్న 10:
నాకు పార్ట్ B కోసం CSV అప్‌లోడ్ చేస్తున్న సమయంలో “పార్ట్ B CSVలో ప్రతి సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్/ పేర్కొన్న కార్యాచరణ ఎదురుగా కనీసం ఒక ఎంట్రీ ఉండాలి” అనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది, దీని అర్థం ఏమిటి మరియు నేను దానిని ఎలా సరిచేయాలి?
సమాధానం:
మీరు ఈ క్రింది 2 పరిస్థితులలో ఈ ఎర్రర్ పొందవచ్చు:
|
వరుస సంఖ్య |
సందర్భం |
అవసరమైన పరిష్కారం/ చర్య |
|
1. |
సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్ పేరు/నిర్దిష్ట కార్యాచరణ పార్ట్ – Aలో పేర్కొనబడింది కానీ దాని కోసం పార్ట్ – B CSVలో ఎలాంటి వివరాలు అందించబడలేదు |
సినిమాటోగ్రాఫ్ చిత్రంలో లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటిలో నిమగ్నమైన వ్యక్తులకు రూ. 50,000ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించిన వివరాల కోసం కనీసం ఒక ఎంట్రీ ఉండాలని దయచేసి గమనించండి. దయచేసి పార్ట్ - A లో పేర్కొన్న విధంగా అన్ని సినిమాటోగ్రాఫ్ సినిమాలు లేదా పేర్కొన్న కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను పార్ట్ - B CSVలో అందించారా లేదా అని నిర్ధారించుకోండి. |
|
2. |
సినిమాటోగ్రాఫ్ చిత్ర నిర్మాణం లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన దానిలో నిమగ్నమైన వ్యక్తులకు చేసిన రూ. 50,000ల కన్నా ఎక్కువ గల చెల్లింపుల వివరాలు పార్ట్ - B CSVలో అందించారు కాని సినిమాటోగ్రాఫ్ చిత్రం లేదా పేర్కొన్న కార్యకలాపం పేరు పార్ట్ - Aలో పేర్కొనలేదు. |
పార్ట్ –Aలో పేర్కొన్న సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్‌లు లేదా పేర్కొన్న కార్యకలాపాల పేర్లు పార్ట్– Bలో పేర్కొన్న సినిమాటోగ్రాఫ్ ఫిల్మ్‌లు లేదా పేర్కొన్న కార్యకలాపాల పేర్లతో ధృవీకరించబడతాయని దయచేసి గమనించండి. పార్ట్ - A, పార్ట్-B రెండింటిలోనూ అన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల పేర్లు అందించబడినవా దయచేసి నిర్ధారించుకోండి. |
ప్రశ్న 11:
ప్రాథమిక సమాచార ప్యానెల్లో నేను ఏవైనా మార్పులు చేస్తే పార్ట్ - A లేదా పార్ట్ - Bలో జతచేయబడిన CSV ఎందుకు తొలగించబడుతుంది?
సమాధానం:
నిర్మించిన సినిమాటోగ్రాఫ్ చిత్రాల లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన వాటి సంఖ్య వివరాలు "ప్రాథమిక సమాచారం", "పార్ట్-A", "పార్ట్-B" అనే మూడు ప్యానెల్‌లలో వాలిడేట్ చేయబడుతున్నాయని దయచేసి గమనించండి. పన్ను చెల్లింపుదారు ప్రాథమిక సమాచారం లేదా పార్ట్ - A ప్యానెల్‌లో సినిమాటోగ్రాఫ్ చిత్రాలు లేదా పేర్కొన్న కార్యకలాపాల కోసం అందించిన వివరాలలో ఏవైనా మార్పులు/సవరణలు చేస్తే, పన్ను చెల్లింపుదారు పార్ట్-A, పార్ట్-Bలలో అందించిన వివరాలు తొలగించబడతాయి. పన్ను చెల్లింపుదారు పార్ట్ - A, పార్ట్ - Bలలో మళ్లీ వివరాలను పూరించాలి లేదా CSVని జత చేయాల్సి ఉంటుంది.
ప్రశ్న 12:
గత సంవత్సరం నేను నిర్మించిన ప్రతి సినిమాటోగ్రాఫ్ చిత్రం కోసం లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన ప్రతి దాని కోసం నేను విడిగా ఫారమ్ 52A దాఖలు చేయాల్సి ఉంటుందా?
సమాధానం:
లేదు, మీరు గత సంవత్సరం నిర్మించిన ప్రతి సినిమాటోగ్రాఫ్ చిత్రం కోసం లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన ప్రతి దాని కోసం విడిగా ఫారమ్ 52A దాఖలు చేయవలసిన అవసరం లేదు. గత సంవత్సర కాలంలో నిర్మించిన అన్ని సినిమాటోగ్రాఫ్ చిత్రాలు మరియు/లేదా పేర్కొన్న కార్యకలాపాలలో చేపట్టిన అన్ని కార్యకలాపాల వివరాలు ప్రతి TAN కోసం క్రోడీకరించి, ప్రతి రిజిస్టర్ అయిన TAN కోసం విడిగా ఫారమ్ 52Aను సమర్పించాలి.
ప్రశ్న 13:
పార్ట్ - A లేదా పార్ట్ - Bలో CSV అప్‌లోడ్ చేసిన తర్వాత నాకు ఒక ఎర్రర్ ఫైల్ వస్తున్నది?
సమాధానం:
మీరు పార్ట్ - A లేదా పార్ట్ - B లలో దేనిలో అయినా CSV అప్‌లోడ్ చేసిన తర్వాత, అందించిన వివరాలు వాలిడేట్ చేయబడుతాయి. ఏవైనా ఎర్రర్స్ కనుగొనబడితే, ఆ ఎర్రర్స్ వివరాలు మీకు ఎక్సెల్ ఫైల్‌లో అందించబడతాయి. పేర్కొన్న వరుసలలో జరిగిన తప్పుల కోసం ఎక్సెల్ ఫైల్ చూసి, వాటిని సరిచేయండి. అవసరమైన సవరణలు అన్నీ చేసిన తర్వాత, మీరు దాన్ని తిరిగి అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
ప్రతి ఫీల్డ్ కోసం తప్పనిసరి అవసరమైన సమాచారం, ఆమోదించే ఫార్మాట్స్ గురించిన వివరాల కోసం పార్ట్ - A, పార్ట్ - B రెండింటిలో అందించబడిన CSV సూచనల ఫైల్స్ మీరు రిఫర్ చేయవచ్చు.