Do not have an account?
Already have an account?

1. ఓవర్‌వ్యూ

నిర్దేశించబడిన చెల్లింపు విధానాలను జోడించు అనే సేవ, మునుపటి సంవత్సరంలో మొత్తం అమ్మకాలు/టర్నోవర్/స్థూల రాబడి ₹50 కోట్లు దాటిన వ్యాపారం (B2B/B2C/both) కలిగి ఉండే నమోదు చేయబడిన వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ సేవతో, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని (జనవరి 1 2020 నుండి వర్తించే విధంగా) 269SU సెక్షన్ మరియు ఆదాయపు పన్ను నియమాలు, 1962 లోని 119AA నియమం కింద నిర్దేశించబడిన చెల్లింపు విధానాల వివరాలను అందించాలనే తప్పనిసరి అవసరాలను మీరు తీర్చవచ్చు.

ఆదాయపు పన్ను నియమావళి, 1962 లోని 119AA నియమం కింద నిర్వచించబడినటువంటి సూచిత చెల్లింపు విధానాలు:

  • రూపే వారు అందిస్తున్న డెబిట్ కార్డు
  • యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) (BHIM-UPI)
  • యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ త్వరిత ప్రతిస్పందన చిహ్నం (UPI QR Code) (BHIM-UPI QR Code)

మీరు చెప్పబడిన నిబంధనను పాటించడంలో విఫలమైతే, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని 271DB సెక్షన్ కింద రోజుకు ₹5000 /- జరిమానా కట్టవలసి ఉంటుంది.

 

2. అవసరమైనవి

కింద ఉన్న అన్ని షరతులను నెరవేర్చే వినియోగదారులకు ఇది ఒకసారికి వర్తించే పాటింపు:

  • వ్యాపార యజమాని (B2B / B2C / రెండూ)
  • మొత్తం అమ్మకాలు, టర్నోవర్ లేదా స్థూల రాబడి, మునుపటి సంవత్సరానికి సరిగ్గా ముందు సంవత్సరంలో ₹50 కోట్లు దాటి పోయింది
  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన వినియోగదారుడు
  • చెల్లుబాటులోనూ మరియు చురుకుగా ఉన్న PAN
  • ITR 3 / ITR 5 / ITR 6 మునుపటి సంవత్సరానికి సరిగ్గా ముందు సంవత్సరానికి దాఖలు చేయబడింది.

 

3. దశల వారీ మార్గదర్శిని

1వ స్టెప్: మీ వినియోగదారు ID మరియు పాస్వర్డ్ తో ఇ - ఫైలింగ్ పోర్టల్‌ లో లాగిన్ అవ్వండి.

Data responsive


2వ దశ: మీరు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని 269SU సెక్షన్ ప్రకారం సరికొత్త ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఆధారంగా వ్యాపారం ద్వారా ఆర్థిక సంవత్సరానికి మీ మొత్తం అమ్మకాలు/టర్నోవర్/స్థూల రాబడి ₹50 కోట్లు దాటితే, మీరు నిర్దేశించిన చెల్లింపు విధానాలు పేజీకి తీసుకువెళ్ళబడతారు. అక్కడ మీరు సెక్షన్ 269SU కి అనుగుణంగా పాటిస్తున్న స్థితిని అందిస్తూ, ఆదాయపు పన్ను నిబంధనలు, 1962 లోని 119AA నియమం ప్రకారం వినియోగదారుల నుండి చెల్లింపును అంగీకరించడానికి అందించిన నిర్దేశిత ఎలక్ట్రానిక్ మోడ్‌ లను అప్డేట్ చేయాలి
నిర్దేశించిన చెల్లింపు విధానాల పేజీలో కొనసాగడానికి ముందుకు వెళ్ళు ని క్లిక్ చేయండి.

Data responsive


3వ దశ: కొనసాగు పై క్లిక్ చేయడం ద్వారా, వ్యాపార వివరాలు నమోదు చేసి సేవ్ పై క్లిక్ చేయండి.

Data responsive


వర్తించే ఇతర వ్యాపారాలను జోడించడానికి మరొక వ్యాపారాన్ని జోడించు పై క్లిక్ చేయండి.

వర్గం సెక్షన్
B2B అమ్మకాల నమూనా (మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో 95% కంటే తక్కువ నగదు కాని మోడ్లలో ఉన్నప్పుడు) / B2C అమ్మకాల నమూనా / B2B & B2C రెండిటి అమ్మకాల నమూనా కోసం సెక్షన్ 3.1 కి వెళ్లు
B2B అమ్మకాల నమూనా (మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో కనీసం 95% కంటే తక్కువ నగదు కాని పద్ధతుల్లో ఉన్నప్పుడు) కోసం సెక్షన్ 3.2 కు వెళ్ళండి
ఒకవేళ నిర్దేశించబడిన చెల్లింపు విధానాలు అందుబాటులో లేకపోతే పాటించడం కోసం సెక్షన్ 3.3 కు వెళ్ళండి

 

సెక్షన్ 3.1. B2B అమ్మకాల మోడల్ (మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో 95% కంటే తక్కువ నగదు కాని విధానాల్లో ఉన్నప్పుడు) / B2C అమ్మకాల నమూనా / B2B & B2C అమ్మకాల నమూనా రెండింటిలోనూ ఉన్నాయి

1వ దశ: వ్యాపార వివరాలను జోడించిన తరువాత, మీకు వర్తించే విధంగా అమ్మకాల నమూనాను ఎంచుకోండి: వ్యాపారానికీ వ్యాపారానికీ మధ్య మాత్రమే (B2B) లేదా వినియోగదారులకు మాత్రమే (B2C) లేదా రెండూ (B2B & B2C).

Data responsive


2వ దశ: మీరు ఒక B2B వ్యాపారాన్ని కలిగి ఉండి, మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో 95% కంటే తక్కువ నగదు కాని మోడ్లలో ఉన్నప్పుడు, కాదు ని ఎంచుకోండి, ముందుకు వెళ్ళు ని క్లిక్ చేయండి.

Data responsive


3వ దశ: సూచించిన ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా చెల్లింపులను అంగీకరించే సౌకర్యాన్ని మీరు కలిగి ఉంటే అవును ఎంచుకోండి.

Data responsive


గమనిక:

  • మీరు వ్యాపారానికీ, వ్యాపారానికీ మధ్య మాత్రమే (B2B) ని ఎంచుకుని ఉండి, మునుపటి సంవత్సరంలో మీరు పొందిన అన్ని మొత్తాలలో 95% కంటే తక్కువ నగదు కాని మోడ్ లలో ఉంటే, సెక్షన్ 3.2 లోని దశలను అనుసరించండి. B2B అమ్మకాల నమూనా (మునుపటి సంవత్సరంలో మీరు పొందిన అన్ని మొత్తాలలో కనీసం 95% కంటే తక్కువ నగదు కాకుండా వేరే పద్ధతులలో ఉన్నాయి)
  • మీకు నిర్దేశించిన విధానాల ద్వారా చెల్లింపులను అంగీకరించే సౌకర్యం లేకపోతే, దయచేసి సెక్షన్ 3.3 లో ఉన్న దశలను అనుసరించండి. నిర్దేశించిన చెల్లింపు విధానాలు అందుబాటులో లేనప్పుడు పాటింపు.

4వ దశ: వర్తకుని గుర్తింపు సంఖ్య, వర్తకుని పేరు మరియు సంబంధిత బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయండి.

Data responsive


గమనిక: మీరు సంబంధిత ఎంపికలపై క్లిక్ చేయడం ద్వారా మీరు బహుళ వర్తకుల గుర్తింపు సంఖ్యలు, వారి వ్యాపార సంస్థల పేర్లు మరియు బ్యాంక్ ఖాతాలను జోడించవచ్చు.

5వ దశ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) (BHIM-UPI) వివరాలు సంబంధిత బ్యాంక్ ఖాతా వివరాలు మరియు BHIM UPI ID నమోదు చేయండి.

Data responsive


గమనిక: మీరు సంబంధిత ఎంపికలపై క్లిక్ చేయడం ద్వారా బహుళ బ్యాంక్ ఖాతాలను మరియు UPI ID లను జోడించవచ్చు.

6వ దశ: అమలు తేదీ ని ఎంచుకుని, హెచ్చరిక ను అంగీకరించి సమర్పించు ను క్లిక్ చేయండి.

Data responsive


7వ దశ: మీ ప్రతిస్పందనను నిర్ధారించడానికి అవును ను క్లిక్ చేయండి.

Data responsive


8వ దశ: సమర్పించగానే, లావాదేవీ గుర్తింపు సంఖ్యతో పాటుగా ఒక విజయవంతమైన సందేశం వస్తుంది దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ఐడి యొక్క గమనికను ఉంచండి.

Data responsive


గమనిక:

  • మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసి ఉన్న మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌ పై ధృవీకరణ సందేశాన్ని కూడా పొందుతారు.
  • మీ ప్రతిస్పందనను సమర్పించిన తరువాత, మీరు ఎప్పుడైనా దానిని, ప్రతిస్పందన చూపు మరియు ప్రతిస్పందన డౌన్లోడ్ ఎంపికల ద్వారా చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 3.2. B2B అమ్మకాల నమూనా (మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో కనీసం 95% నగదు కాకుండా వేరే విధానాల్లో ఉన్నాయి)

1వ దశ: వ్యాపార వివరాలను జోడించిన తరువాత, అమ్మకాల నమూనా ఎంపిక ను వ్యాపారానికీ వ్యాపారానికీ మధ్య మాత్రమే (B2B) అని ఎంచుకుని, మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో కనీసం 95% నగదు కాకుండా వేరే పద్ధతుల్లో ఉంటే అవును ని ఎంచుకుని, కొనసాగించు ని క్లిక్ చేయండి.

Data responsive


2వ దశ: ఇస్తున్న అంశాలను ఎంచుకుని, వాటిని అంగీకరిస్తూ సమర్పించు ను క్లిక్ చేయండి.

Data responsive


3వ దశ: మీ ప్రతిస్పందనను నిర్ధారించడానికి అవును పై క్లిక్ చేయండి.

Data responsive


4వ దశ: సమర్పించగానే, లావాదేవీ గుర్తింపు సంఖ్యతో పాటుగా ఒక విజయవంతమైన సందేశం వస్తుంది దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ఐడి యొక్క గమనికను ఉంచండి.

Data responsive


గమనిక:

  • మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసి ఉన్న మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌పై ధృవీకరణ సందేశాన్ని కూడా పొందుతారు.
  • మీ ప్రతిస్పందనను సమర్పించిన తరువాత, మీరు ఎప్పుడైనా దానిని, ప్రతిస్పందన చూపు మరియు ప్రతిస్పందన డౌన్లోడ్ ఎంపికల ద్వారా చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

సెక్షన్ 3.3. నిర్దేశింపబడిన చెల్లింపు విధానాలు అందుబాటులో లేనప్పుడు పాటింపు

4వ దశ: వ్యాపార వివరాలను జోడించిన తరువాత, మీకు వర్తించే విధంగా అమ్మకాల నమూనా ఎంపిక ను వ్యాపారానికీ వ్యాపారానికీ మధ్య మాత్రమే (B2B) లేదా వినియోగదారులకు మాత్రమే (B2C) లేదా రెండిటికీ (B2B & B2C) ల నుంచి ఎంచుకోండి.

Data responsive


5వ దశ: మీరు ఒక B2B వ్యాపారాన్ని కలిగి ఉండి, మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో 95% కంటే తక్కువ నగదు కాని మోడ్లలో ఉంటే, కాదు ఎంచుకుని ముందుకు వెళ్ళు ని క్లిక్ చేయండి.

Data responsive


6వ దశ: సూచించిన ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా చెల్లింపులను అంగీకరించే సౌకర్యం మీకు లేకపోతే లేదు ఎంచుకోండి.

Data responsive


గమనిక:

  • మీరు వ్యాపారానికీ వ్యాపారానికీ మధ్య మాత్రమే (B2B) ని ఎంచుకుని ఉండి, మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో కనీసం 95% నగదు కాని పద్ధతులలో ఉంటే, సెక్షన్ 3.2 B2B అమ్మకాల నమూనా (మునుపటి సంవత్సరంలో పొందిన అన్ని మొత్తాలలో కనీసం 95% నగదు కాని మోడ్లలో ఉన్నాయి) కింద ఉన్న దశలను అనుసరించండి.

7వ దశ: ఆదాయపు పన్ను చట్టం, 1961లో నిర్వచించిన విధంగా సూచించబడిన చెల్లింపు విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆశించబడిన అమలు తేదీ మరియు విఫలమవడానికి గల కారణం నమోదు చేసి, నిర్ధారణ సందేశం అంగీకరించి, సమర్పించు ని క్లిక్ చేయండి.

Data responsive


గమనిక: చెల్లింపును అంగీకరించే ఎలక్ట్రానిక్ పద్ధతులను అందించడంలో విఫలమైతే, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని 271DB సెక్షన్ కింద ప్రతి రోజూ డిఫాల్ట్ గా జరిమానాను కట్టవలసి ఉంటుంది.

8వ దశ: సమర్పించిన తరువాత, లావాదేవీ గుర్తింపు సంఖ్యతో పాటు ఒక విజయవంతమైనది అనే సందేశం వస్తుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ఐడి యొక్క గమనికను ఉంచండి.

Data responsive


గమనిక:

  • మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసి ఉన్న మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌పై ధృవీకరణ సందేశాన్ని కూడా పొందుతారు.
  • మీ ప్రతిస్పందనను సమర్పించిన తరువాత, మీరు ఎప్పుడైనా దానిని, ప్రతిస్పందన చూపు మరియు ప్రతిస్పందన డౌన్లోడ్ ఎంపికల ద్వారా చూడవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

4. సంబంధిత విషయాలు