Do not have an account?
Already have an account?

1. అవలోకనం


ఈ ప్రీ-లాగిన్ సేవ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, యాక్సెస్ చేయాలనుకునే పన్ను మినహాయించు/వసూలుచేయు వ్యక్తులకి అందుబాటులో ఉంటుంది.రిజిస్ట్రేషన్ సేవ వినియోగదారుని అన్ని పన్ను సంబంధిత కార్యకలాపాలను యాక్సెస్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు

  • చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్ TAN
  • ప్రధాన సంప్రదింపు యొక్క PAN ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడాలి

3. దశల వారీ మార్గదర్శిని

దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి.

Data responsive


దశ 2: ఇతరులుక్లిక్ చేసి,వర్గంని పన్ను మినహాయించు మరియు వసూలు చేయు వ్యక్తిగా ఎంచుకోండి.

Data responsive


దశ 3: సంస్థకు చెందిన TANని నమోదు చేసి, ధృవీకరించండి క్లిక్ చేయండి

Data responsive


దశ 4a: TAN డేటాబేస్‌లో అందుబాటులో ఉంటే, TRACESతో రిజిస్టర్ చేయబడి ఉంటే మరియు రిజిస్ట్రేషన్ అభ్యర్థన ఇప్పటికే లేవనెత్తకపోతే మరియు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంటే:

  • ప్రాథమిక వివరాలు పేజీ చూడడానికి కొనసాగించండిక్లిక్ చేయండి.
  • ప్రాథమిక వివరాలు ముందుగానే నింపబడి ఉన్నాయి. కొనసాగించండి క్లిక్ చేయండి.
Data responsive


దశ 4b: డేటాబేస్‌లో TAN అందుబాటులో ఉంటే, కాని TRACESతో రిజిస్టర్ కాలేదు మరియు రిజిస్ట్రేషన్ అభ్యర్థన ఇప్పటికే లేవనెత్తలేదు మరియు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది:

  • TRACES పేజీ చూడడానికి కొనసాగించండి క్లిక్ చేయండి.
  • ప్రాథమిక వివరాలు పేజీ చూడడానికి TRACES లోని ఇ-ఫైలింగ్‌లో నమోదు చేయండి క్లిక్ చేయండి.
  • అవసరమైన విధంగా ప్రాథమిక వివరాలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.


గమనిక: మీరు మొదట TRACESలో ముందుగా నమోదు చేసుకోవాలి. ఇ-ఫైలింగ్‌లో రిజిస్టర్ చేసుకోండి క్లిక్ చేసినపుడు, అక్కడ నుండి మీరు ఇ-ఫైలింగ్‌లో రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్తారు.

దశ 4c: డేటాబేస్‌లో TAN అందుబాటులో ఉంటే, రిజిస్ట్రేషన్ అభ్యర్థన ఇప్పటికే లేవనెత్తబడింది మరియు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది:

  • లోపం ఉందన్న సందేశం ప్రదర్శించబడింది, మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉపసంహరించుకోవచ్చు.


దశ 5: చెల్లింపులు చేసే లేదా పన్ను వసూలు చేసే వ్యక్తి వివరాలు నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 6: సంప్రదింపు వివరాలను వీటితో పాటు అందించండి ప్రాథమిక మొబైల్ సంఖ్య, ఇ-మెయిల్ ID మరియు పోస్టల్ చిరునామా. కొనసాగించు పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 7: దశ 6 లో నమోదు చేసిన విధంగా మీ ప్రాథమిక మొబైల్ సంఖ్య మరియు ఇ-మెయిల్ IDకి రెండు వేర్వేరు ఓటీపి లు పంపబడ్డాయి. మీ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ID లకు వచ్చిన 6-అంకెల వేర్వేరు OTPలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి

Data responsive


గమనిక:

  • OTP కేవలం 15 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది.
  • సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉంటాయి.
  • స్క్రీన్ మీద ఓటీపి గడువు ముగింపు కౌంట్ డౌన్ టైమర్ ఓటీపి గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
  • OTP మళ్ళీ పంపండి పై క్లిక్ చేసిన తరువాత, కొత్త OTP రూపొందించబడి, పంపించబడుతుంది.

దశ 8: వివరాలు వెరిఫై చేయండిపేజీలో, అందించిన వివరాలను సమీక్షించి అవసరమైతే వివరాలు సవరించండి. ధృవీకరించండి క్లిక్ చేయండి

Data responsive


దశ 9: పాస్వర్డ్ సెట్ చేయండి పేజీలో, మీకు కావలసిన పాస్వర్డ్‌ను పాస్వర్డ్ సెట్ చేయండి అలాగే ధృవీకరించిన పాస్వర్డ్ టెక్స్ట్‌బాక్స్‌లలో నమోదు చేసి, వ్యక్తిగత సందేశం సెట్ చేసి రిజిస్టర్ చేయండి క్లిక్ చేయండి.

Data responsive


గమనిక:

  • రిఫ్రెష్ లేదా వెనక్కి క్లిక్ చేయవద్దు.
  • మీ కొత్త పాస్వర్డ్‌ను నమోదు చేస్తున్నప్పుడు, పాస్వర్డ్ విధానం పట్ల శ్రద్ధ వహించండి:
    • ఇది కనీసం 8 అక్షరాలు మరియు అత్యధికంగా 14 అక్షరాలు ఉండాలి.
    • ఇది పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాల సమూహం అయి ఉండాలి.
    • దీనిలో ఒక సంఖ్య ఉండాలి.
    • అంధులొ ప్రత్యేక గుర్తు ఉండాలి [ఉదా. @#$%]

లావాదేవీ IDతో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ IDని వ్రాసి పెట్టుకోండి. సమర్థ అధికారి నుండి ఆమోదం పొందిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
 

Data responsive


4. సంబంధించిన అంశాలు