1. అవలోకనం
ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయంపై ఆదాయ పన్ను లెక్కించబడుతుంది. అయితే, నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి ఆదాయం జీతం స్వభావంలో ముందస్తు లేదా బకాయిలు కలిసి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం లోని అదననపు పన్ను భారానికి సెక్షన్ 89 కింద ఉపశమనం అనుమతిస్తుంది.
అటువంటి రాయితీ క్లెయిమ్ చేసుకోవడానికి ఫారమ్ 10E దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఫారం 10E దాఖలు చేయడం మంచిది. పేర్కొన్న ఫారమ్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలు చేయడం కోసం అందుబాటులో ఉంది. ఫారం 10E దాఖలు చేయకుండా, పన్నుచెల్లింపుదారు సెక్షన్ 89 ప్రకారం పరిహారము క్లెయిమ్ చేస్తే, దాఖలు చేయబడిన ITR ప్రాసెస్ చేయబడుతుంది కాని క్లెయిమ్ చేసిన పరిహారము అనుమతించబడదు. జీతం కింద బకాయి/ముందస్తు ఆదాయంపై పన్ను ఉపశమనం క్లెయిమ్ చేసుకోవడానికి ఫారం 10E దాఖలు చేయడం తప్పనిసరి.
ఫారమ్ 10E ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే సమర్పించాలి.
2. ఈ సేవను పొందడానికి ముందస్తు అవసరాలు
- మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి.
- పన్ను చెల్లింపుదారు PAN స్థితి "యాక్టివ్"గా ఉండాలి
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
సెక్షన్ 89 ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక మదింపుదారు ఏదైనా జీతం లేదా జీతానికి బదులుగా లాభం లేదా కుటుంబ పెన్షన్ ముందస్తుగా లేదా మొత్తం బకాయిలను అందుకుంటే దాని కోసం ఆదాయ పన్ను చట్టం మదింపుదారునికి ఉపశమనం అందిస్తుంది. మదింపు వేసిన మొత్తం ఆదాయం మదింపు వేయవలసిన దాని కంటే ఎక్కువ రేటుతో ఉంటే ఈ ఉపశమనం మంజూరు చేయబడుతుంది. ఫారం 10E లో మీ ఆదాయం యొక్క వివరాలను అందించడం ద్వారా ఇటువంటి ఉపశమనం పొందవచ్చు.
3.2 ఎవరు ఉపయోగించగలరు?
వ్యక్తులుగా, రిజిస్టర్ అయిన వినియోగదారులు అందరూ, ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 89 ప్రకారం ఉపశమనం పొందటానికి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ ఆదాయం వివరాలను ఫారం 10Eలో దరఖాస్తు చేసుకోవచ్చు.
3.3 ఫారమ్ గురించి క్లుప్తంగా
ఫారం 10Eలో ఏడు భాగాలు ఉన్నాయి:
- అనుబంధం I - మొత్తం బకాయిలలో అందుకున్న జీతం / కుటుంబ పెన్షన్ బకాయిలు
- అనుబంధం I - ముందస్తుగా తీసుకున్న జీతం / కుటుంబ పెన్షన్
- అనుబంధం II & IIA - గత సేవలకు సంబంధించి గ్రాట్యుటీ రూపంలో చెల్లింపు
- అనుబంధం III - 3 సంవత్సరాలకు మించని నిరంతర సర్వీస్ తర్వాత లేదా ఉద్యోగ వ్యవధిలో గడువు ముగియని భాగం కూడా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉండని చోట లేదా ఉద్యోగాన్ని రద్దు చేయడంలో యజమాని లేదా మునుపటి యజమాని నుండి పరిహారం రూపంలో చెల్లింపు.
- అనుబంధం IV - పెన్షన్ మార్పిడి
అందుకున్న మొత్తం స్వభావం ఆధారంగా, ఫారం 10E దాఖలు చేసేటప్పుడు తగిన అనుబంధాన్ని ఎంచుకోవాలి
4. దశలవారీ మార్గదర్శిని
దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
దశ 2: వినియోగదారు ID (PAN) మరియు పాస్వర్డ్ నమోదు చేయండి.
దశ 3 : ఇ-ఫైల్ >ఆదాయపు పన్ను ఫారంలు > ఆదాయపు పన్ను ఫారంలను దాఖలు చేయండికు వెళ్లండి.
దశ 4 : ఫారం 10E ఎంపిక చేయండి/శోధించండి
దశ 5: AY ఎంపిక చేసి కొనసాగించు క్లిక్ చేయండి.
దశ 6: మనం ప్రారంభించుదాంపై క్లిక్ చేయండి
దశ 7 : ఆదాయ వివరాలకు సంబంధించి వర్తించే అంశాలను ఎంచుకోండి
దశ 8: వ్యక్తిగత సమాచారాన్ని నిర్ధారించి సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.
గమనిక:నివాస స్థితితో సహా "నా ప్రొఫైల్" విభాగం కింద తప్పనిసరి వివరాలన్నీ పూర్తయ్యాయని దయచేసి నిర్ధారించుకోండి. మీరు "నా ప్రొఫైల్" హైపర్‌లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీ సంప్రదించు వివరాలు, నివాస స్థితిని మార్చుకోవచ్చు.
దశ 9.1.a : వ్యక్తిగత సమాచార ట్యాబ్ ఇప్పుడు ధృవీకరించబడింది, జీతం/కుటుంబ పెన్షన్ బకాయిలు పై క్లిక్ చేయండి (మీకు వర్తిస్తే)
దశ 9.1.b: ఈ భాగం అందుకున్న జీతం / కుటుంబ పెన్షన్ మొత్తం బకాయిల సాధారణ వివరాలను కలిగి ఉంటుంది.
వివరాలను నమోదు చేసి సేవ్ చేయండిపై క్లిక్ చేయండి
"బకాయిల్లో అందుకున్న జీతం/కుటుంబ పెన్షన్" ఫీల్డ్‌లోని వివరాలను క్రమ. సంఖ్య. 6 తర్వాత జోడించాల్సిన పట్టిక Aలో అందించిన సమాచారం ఆధారంగా నింపాలి. "గత వివిధ సంవత్సరాలకు సంబంధించి బకాయిల్లో అందుకున్న జీతం/కుటుంబ పెన్షన్ వివరాలు".
దశ 9.2.a: బకాయి జీతం ట్యాబ్ ఇప్పుడు ధృవీకరించబడింది, ముందస్తు జీతంపై క్లిక్ చేయండి (మీకు వర్తిస్తే)
దశ 9.2.b: ఈ భాగం ముందస్తుగా అందుకున్న జీతం / కుటుంబ పెన్షన్ గురించిన సాధారణ వివరాలను కలిగి ఉంటుంది.
వివరాలను నమోదు చేసి సేవ్ చేయండిపై క్లిక్ చేయండి
"ముందుగానే అందుకున్న జీతం" ఫీల్డ్‌లోని వివరాలను క్రమ. సంఖ్య. 6 తర్వాత జోడించాల్సిన పట్టిక Aలో అందించిన సమాచారం ఆధారంగా నింపాలి. "గత వివిధ సంవత్సరాలకు సంబంధించి ముందస్తుగా అందుకున్న జీతం/కుటుంబ పెన్షన్ వివరాలు".
దశ 9.3.a:ముందస్తు జీతం ట్యాబ్ ఇప్పుడు ధృవీకరించబడింది, గ్రాట్యుటీపై క్లిక్ చేయండి (మీకు వర్తిస్తే)
దశ 9.3.b : ఈ భాగం గత సేవలకు సంబంధించి గ్రాట్యుటీ రూపంలో చేసిన చెల్లింపు గురించి సాధారణ వివరాలను కలిగి ఉంటుంది.
వివరాలను నమోదు చేసి సేవ్ చేయండిపై క్లిక్ చేయండి
దశ 9.4.a : గ్రాట్యుటీ ట్యాబ్ ఇప్పుడు ధృవీకరించబడింది, ఉపాధి రద్దు సమయంలో పరిహారం ట్యాబ్‌పై క్లిక్ చేయండి (మీకు వర్తిస్తే)
దశ 9.4.b : ఈ భాగం 3 సంవత్సరాలకు మించని నిరంతర సర్వీస్ తర్వాత లేదా ఉద్యోగ కాలవ్యవధి యొక్క గడువు 3 సంవత్సరాల కంటే తక్కువ ఉండని చోట యజమాని లేదా మునుపటి యజమాని నుండి లేదా ఉద్యోగ రద్దుకు సంబంధించి పరిహారం యొక్క స్వభావంలో చెల్లింపు యొక్క సాధారణ వివరాలను కలిగి ఉంటుంది.
ఉపాధి రద్దు ట్యాబ్‌పై పరిహారం వివరాలను నమోదు చేసి సేవ్ చేయండిపై క్లిక్ చేయండి
దశ 9.5.a : ఉపాధి రద్దు ట్యాబ్‌పై పరిహారం ఇప్పుడు ధృవీకరించబడింది, పెన్షన్ మార్పిడి ట్యాబ్‌పై క్లిక్ చేయండి (మీకు వర్తిస్తే)
దశ 9.5.b: ఈ భాగం పెన్షన్ మార్పిడిలో చెల్లింపు గురించిన సాధారణ వివరాలను కలిగి ఉంటుంది.
పెన్షన్ మార్పిడి ట్యాబ్ వివరాలను నమోదు చేసి సేవ్ చేయండిపై క్లిక్ చేయండి
దశ 10: పెన్షన్ మార్పిడి ట్యాబ్ ఇప్పుడు ధృవీకరించబడింది, సరినిరూపణ ట్యాబ్పై క్లిక్ చేయండి
దశ 11 : చెక్ బాక్స్ ఎంపిక చేయండి, ప్రదేశం నమోదు చేయండి మరియు సేవ్ చేయండిపై క్లిక్ చేయండి
దశ 12: ఇప్పుడు అన్ని ట్యాబ్‌లు ధృవీకరించబడ్డాయి. ప్రివ్యూపై క్లిక్ చేయండి
దశ 13 : ఇది ఫారమ్ యొక్క ప్రివ్యూ. ప్రివ్యూలోని వివరాలు సరైనవి అయితే ఇ-వెరిఫైకి కొనసాగించండిపై క్లిక్ చేయండి, లేనిచో మీరు వివరాలను సవరించవచ్చు.
దశ 14 : మీరు ఏవైనా సరినిరూపణ పద్ధతుల ద్వారా ఫారంను ఇ-వెరిఫై చేయవచ్చు.
ఇ-వెరిఫికేషన్ తరువాత, ఫారమ్ 10E సమర్పించబడుతుంది. రసీదు సంఖ్య జనరేట్ చేయబడుతుంది మరియు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌లో తెలియజేయబడుతుంది.