1. అవలోకనం
ఇ-ఫైలింగ్ పోర్టల్ పోస్ట్ లాగిన్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారులందరికీ సమ్మతి పోర్టల్ మరియు రిపోర్టింగ్ పోర్టల్ సేవ అందుబాటులో ఉంటుంది. ఇది మీ ఇ-ఫైలింగ్ ఖాతా నుండి సమ్మతి పోర్టల్ మరియు రిపోర్టింగ్ పోర్టల్‌కు ఒకే సైన్ ఆన్ (SSO) తో తీసుకువెళుతుంది. ఈ సేవ మిమ్మల్ని వీటికి అనుమతిస్తుంది:
- వార్షిక సమాచార ప్రకటన, ఇ-క్యాంపెయిన్లు, ఇ-వెరిఫికేషన్లు, ఇ-ప్రోసీడింగ్స్ మరియు DIN ప్రామాణీకరణ వంటి సేవలను యాక్సెస్ చేయడానికి సమ్మతి పోర్టల్‌కు నేరుగా వెళ్లండి
- సమ్మతి పోర్టల్‌లోని సంబంధిత విభాగానికి వెళ్లే ముందు మీకు సంబంధించిన ఇ-క్యాంపెయిన్లు మరియు ఇ-వెరిఫికేషన్ల యొక్క క్రియాశీల గణనను చూడండి
- మీ ఇ-ఫైలింగ్ ఖాతా నుండి రిపోర్టింగ్ పోర్టల్‌కు నేరుగా వెళ్లండి
2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారు
- క్రియాశీలమైన ఇ-క్యాంపెయిన్లు లేదా ఇ-వెరిఫికేషన్‌లు (సమ్మతి పోర్టల్ కోసం)
3. దశలవారీ మార్గదర్శిని
| సమ్మతి పోర్టల్ కోసం (వార్షిక సమాచార ప్రకటన) | 3.1 సెక్షన్ చూడండి |
| సమ్మతి పోర్టల్ (ఇ-క్యాంపెయిన్, ఇ-వెరిఫికేషన్, ఇ- ప్రొసీడింగ్స్ లేదా DIN ప్రామాణీకరణ) కోసం | 3.2 సెక్షన్ చూడండి |
| రిపోర్టింగ్ పోర్టల్ కోసం | 3.3 సెక్షన్ చూడండి |
3.1 సమ్మతి పోర్టల్ (వార్షిక సమాచార ప్రకటన)
పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల (చెల్లించిన పన్ను, బకాయి, రీఫండ్, పెండింగ్ మరియు పూర్తి చేసిన ప్రోసీడింగ్స్ వంటి ఇతర సమాచారంలో తో సహా) గురించి వార్షిక సమాచార పట్టిక సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది.
దశ1:మీ యూజర్ ID మరియు పాస్వర్డ్ ని ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, పెండింగ్‌లో ఉన్న చర్యలు > వార్షిక సమాచార ప్రకటనను క్లిక్ చేయండి.
గమనిక: వార్షిక సమాచార ప్రకటనను పెండింగ్‌లో ఉన్న చర్యల నుండి ప్రత్యేక సేవగా యాక్సెస్ చేయవచ్చు. అయితే, ఇది సమ్మతి పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
దశ 3: మీరు సమ్మతి పోర్టల్‌కి తీసుకెళ్లబడతారని మీకు తెలియజేసే సందేశం ప్రదర్శించబడుతుంది. కొనసాగించండిక్లిక్ చేయండి.మీరు సమ్మతి పోర్టల్‌కి వెళ్తారు, అక్కడ మీరు మీ వార్షిక సమాచార ప్రకటనను యాక్సెస్ చేయగలరు.
3.2 సమ్మతి పోర్టల్ (ఇ-క్యాంపెయిన్, ఇ-వెరిఫికేషన్, ఇ-ప్రొసీడింగ్స్, DIN ప్రమాణీకరణ)
ఇ - వెరిఫికేషన్, ఇ - ప్రొసీడింగ్స్ మరియు DIN ప్రమాణీకరణ గురించి డిపార్ట్మెంట్ పంపించే సక్రియ ఇ - ప్రచారాలు, నోటిఫికేషన్లకి స్పందించడానికి పన్నుచెల్లింపుదారులు సమ్మతి పోర్టల్ ని సందర్శించవలసి ఉంటుంది.
దశ1:మీ యూజర్ ID మరియు పాస్వర్డ్ ని ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, పెండింగ్‌లో ఉన్న చర్యలు> సమ్మతి పోర్టల్‌ని క్లిక్ చేయండి.
దశ 3: ఇ-క్యాంపెయిన్, ఇ-వెరిఫికేషన్, ఇ-ప్రొసీడింగ్‌లు లేదా DIN ప్రమాణీకరణను ఎంచుకోండి. మరింత ముందుకు సాగడానికి దిగువ పట్టికను చూడండి:
| ఇ-క్యాంపెయిన్ | 3a దశను అనుసరించండి |
| ఇ-ధృవీకరణ | 3b దశను అనుసరించండి |
| ఇ-ప్రొసీడింగ్స్ | 3 C దశను అనుసరించండి |
| DIN ప్రమాణీకరణ | 3d దశను అనుసరించండి |
దశ 3a: మీరు ఇ - క్యాంపెయిన్ ఎంచుకుంటే, తరువాతి పేజీ ముఖ్యమైన లావాదేవీల ప్రకారం యాక్టివ్ క్యాంపెయిన్ సంఖ్యను, నాన్-ఫైలింగ్ రిటర్న్ మరియు అధిక విలువ గల లావాదేవీలను మీకు చూపిస్తుంది. కొనసాగించండిక్లిక్ చేయండి. మీ వైపు నుంచి తీసుకోవలసిన తదుపరి చర్యల కోసం మీరు సమ్మతి పోర్టల్‌కి తీసుకెళ్లబడతారు.
దశ 3 బి: మీరు ఇ - వెరిఫికేషన్ ఎంచుకుంటే, తరువాతి పేజీ మీ క్రియాశీల ఇ - ధృవీకరణ సంఖ్యను చూపుతుంది. కొనసాగించండిక్లిక్ చేయండి.మీ వైపు నుంచి తీసుకోవలసిన తదుపరి చర్యల కోసం మీరు సమ్మతి పోర్టల్‌కి తీసుకెళ్లబడతారు.
దశ 3c: మీరు ఇ-ప్రొసీడింగ్‌లను ఎంచుకుంటే, మీరు ఇ-ప్రొసీడింగ్స్ పేజీకి తీసుకెళ్లబడతారు, అక్కడ మీరు కొనసాగించండి క్లిక్ చేయాలి. మీ వైపు నుంచి తీసుకోవలసిన తదుపరి చర్యల కోసం మీరు సమ్మతి పోర్టల్‌కి తీసుకెళ్లబడతారు.
దశ 3d: మీరు DIN ప్రమాణీకరణను ఎంచుకుంటే, మీరు DIN ప్రమాణీకరణ పేజీకి వెళ్తారు, అక్కడ మీరు కొనసాగించండి క్లిక్ చేయాలి. మీ వైపు నుంచి తీసుకునే తదుపరి చర్యల కోసం మీరు సమ్మతి పోర్టల్‌కి తీసుకెళ్లబడతారు.
3.3 రిపోర్టింగ్ పోర్టల్
రిపోర్టింగ్ పోర్టల్ ఆదాయపు పన్ను శాఖకు నిర్దిష్ట స్టేట్‌మెంట్‌లను అందించడానికి రిపోర్టింగ్ ఎంటిటీలను అనుమతిస్తుంది, ఇది రిపోర్టింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడం ద్వారా చేయవచ్చు.
దశ1:మీ చెల్లుబాటు అయ్యే వినియోగదారు ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, పెండింగ్‌లో ఉన్న చర్యలు> రిపోర్టింగ్ పోర్టల్‌ని క్లిక్ చేయండి.
దశ 3: మీరు రిపోర్టింగ్ పోర్టల్‌కు తీసుకెళ్లబడతారని మీకు తెలియజేసే సందేశం ప్రదర్శించబడుతుంది. కొనసాగించండిక్లిక్ చేయండి.మీ వైపు నుండి తీసుకోవలసిన తదుపరి చర్యల కోసం మిమ్మల్ని రిపోర్టింగ్ పోర్టల్ కు తీసుకెళుతుంది.