తక్షణ ఇ-PAN యూజర్ మాన్యువల్
1. అవలోకనం
పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కేటాయించబడని, ఆధార్‌ను కలిగి ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులందరికీ తక్షణ ఇ-PAN సేవ అందుబాటులో ఉంటుంది.ఇది ప్రీ లాగిన్ సేవ, ఇక్కడ మీరు:
- ఆధార్ సహాయంతో మరియు ఆధార్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్తో డిజిటల్‌గా సంతకం చేసిన PANను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉచితంగా పొందండి,
- ఆధార్ ఇ-KYC ప్రకారం PAN వివరాలను అప్‌డేట్ చేయండి,
- PAN కేటాయింపు / నవీకరణ తర్వాత ఇ - KYC వివరాల ఆధారంగా ఇ - ఫైలింగ్ ఖాతాను సృష్టించండి, మరియు
- ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవటానికి ముందు లేదా తరువాత పెండింగ్‌లో ఉన్న ఇ - PAN అభ్యర్థన స్థితి తనిఖీ చేయండి / ఇ - PAN డౌన్‌లోడ్ చేసుకోండి.
2. ఈ సర్వీస్ పొందడానికి ముందస్తు అవసరాలు
- PAN కేటాయించబడని వ్యక్తి
- చెల్లుబాటయ్యే ఆధార్ మరియు ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ సంఖ్య
- అభ్యర్థన తేదీ నాటికి వినియోగదారు మైనర్ కాదు; మరియు
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 160 కింద ప్రతినిధి పదింపుదారు నిర్వచనం కింద వినియోగదారు కవర్ చేయబడలేదు.
3. దశల వారీ మార్గదర్శిని
3.1 కొత్త ఇ-PANని జనరేట్ చేయండి
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, తక్షణ ఇ-PAN క్లిక్ చేయండి.
దశ 2: ఇ-PAN పేజీలో, కొత్త ఇ-PAN పొందండి పైన క్లిక్ చేయండి.
దశ 3: కొత్త ఇ-PAN పొందండి పేజీలో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, నేను నిర్ధారిస్తున్నాను చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- ఆధార్ ఇప్పటికే చెల్లుబాటు అయ్యే PANకి లింక్ చేయబడి ఉంటే, క్రింద సందేశం ప్రదర్శించబడుతుంది - నమోదు చేసిన ఆధార్ నంబర్ ఇప్పటికే PANతో లింక్ చేయబడింది.
- ఏదైనా మొబైల్ నంబర్‌తో ఆధార్ లింక్ చేయకపోతే, క్రింద సందేశం ప్రదర్శించబడుతుంది - నమోదు చేసిన ఆధార్ నంబర్ ఏ యాక్టివ్ మొబైల్ నంబర్‌తోనూ లింక్ కాలేదు.
దశ 4: OTP ధ్రువీకరణ పేజీలో, నేను సమ్మతి నిబంధనలను చదివాను మరియు తదుపరి కొనసాగడానికి అంగీకరిస్తున్నాను పై క్లిక్ చేయండి. కొనసాగించండి పైన క్లిక్ చేయండి.
దశ 5: OTP ధ్రువీకరణ పేజీలో, ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేయండి, UIDAIతో ఆధార్ వివరాలను ధృవీకరించడానికి చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- OTP 15 నిమిషాల వరకు మాత్రమే చెల్లుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
- తెరపై OTP గడువు కౌంట్‌డౌన్ టైమర్ OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- OTPని తిరిగి పంపండి క్లిక్ చేసిన తరువాత, క్రొత్త OTP జనరేట్ అయ్యి పంపబడుతుంది.
దశ 6: ఆధార్ వివరాలు ధృవీకరించండి పేజీలో, నేను అంగీకరిస్తాను చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించండి పైన క్లిక్ చేయండి
గమనిక:
- ఈమెయిల్ IDని లింక్ చేయడం/ధృవీకరించడం ( మీ ఆధార్‌తో రిజిస్టర్ చేయబడింది ) ఐచ్ఛికంగా ఉంటుంది.
- మీరు ఆధార్‌లో మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేసినప్పటికీ అది ధృవీకరించబడకపోతే, ఇమెయిల్‌ని ధృవీకరించండిపై క్లిక్ చేయండి. చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID పేజీలో, ఆధార్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.
- మీరు ఆధార్‌లో మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయకుంటే, ఇమెయిల్ ఐడిని లింక్ చేయండి పైన క్లిక్ చేయండి. ఇమెయిల్ ID ధృవీకరించండి పేజీలో, ఆధార్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేసి, కొనసాగించండిపై క్లిక్ చేయండి.
విజయవంతంగా సమర్పించిన తరువాత, రసీదు సంఖ్యతో పాటు విజయవంతమైనట్లు సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం అందినట్టు ధ్రువీకరణ ID భద్రపరచండి. మీరు ఆధార్‌తో లింక్ చేయబడిన మీ మొబైల్ సంఖ్యపై నిర్ధారణ సందేశాన్ని కూడా స్వీకరిస్తారు.
3.2 ఆధార్ e-KYC ప్రకారం PAN వివరాలను అప్‌డేట్ చేయండి
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, తక్షణ ఇ-PANపై క్లిక్ చేయండి.
దశ 2: ఇ-PAN పేజీలో, PAN అప్‌డేట్ చేయండి పైన క్లిక్ చేయండి
దశ 3: PAN వివరాల అప్‌డేట్ చేయండి పేజీలో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, నేను నిర్ధారిస్తున్నాను చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, కొనసాగించండి పైన క్లిక్ చేయండి.
గమనిక:
- ఆధార్ ఇప్పటికే చెల్లుబాటు అయ్యే PANకి లింక్ చేయబడి ఉంటే, క్రింద సందేశం ప్రదర్శించబడుతుంది - నమోదు చేసిన ఆధార్ నంబర్ ఇప్పటికే PANతో లింక్ చేయబడింది.
- ఏదైనా మొబైల్ నంబర్‌తో ఆధార్ లింక్ చేయకపోతే, క్రింద సందేశం ప్రదర్శించబడుతుంది - నమోదు చేసిన ఆధార్ నంబర్ ఏ యాక్టివ్ మొబైల్ నంబర్‌తోనూ లింక్ కాలేదు.
దశ 4: OTP ధ్రువీకరణ పేజీలో, ఆధార్‌తో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- OTP 15 నిమిషాల వరకు మాత్రమే చెల్లుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
- తెరపై OTP గడువు కౌంట్‌డౌన్ టైమర్ OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- OTPని తిరిగి పంపండి క్లిక్ చేసిన తరువాత, క్రొత్త OTP జనరేట్ అయ్యి పంపబడుతుంది.
దశ 5: OTP ధ్రువీకరణ తర్వాత, PANతో నమోదు చేయబడిన వివరాలతో పాటు ఆధార్ e-KYC వివరాలు ప్రదర్శించబడతాయి. ఆధార్ వివరాల ప్రకారం అప్‌డేట్ చేయడానికి సంబంధిత చెక్‌బాక్స్‌లపై క్లిక్ చేయడం ద్వారా ఆధార్ e-KYC ప్రకారం అప్‌డేట్ చేయాల్సిన వివరాలను ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.
దయచేసి ఆధార్ వివరాల ప్రకారం కేవలం ఈ దిగువ పేర్కొన్న వివరాలను మాత్రమే అప్డేట్ చేయగలరని గమనించండి:
- ఫోటో
- పేరు
- పుట్టిన తేదీ (పాన్‌లో మీరు కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే కలిగి ఉంటే, దానిని పాన్‌లో అప్డేట్ చేయటానికి ముందు మీరు ఆధార్‌లో అప్డేట్ చేయవలసి ఉంటుంది).
- మొబైల్ సంఖ్య (అది డిఫాల్ట్‌గా అప్డేట్ చేయబడుతుంది)
- ఇమెయిల్ ఐడి (PAN వివరాలలో అప్డేట్ చేయవలసిన ఇమెయిల్ ఐడిని మీరు ధృవీకరించవలసి ఉంటుంది)
- చిరునామా
దశ 6: మీరు ఆధార్ వివరాల ప్రకారం అప్‌డేట్ చేయాలనుకుంటున్న అన్ని వివరాలను ఎంచుకున్న తర్వాత, నిర్ధారించండి క్లిక్ చేయండి.
నిర్ధారణపై, ఒక రసీదు సంఖ్యతో పాటు విజయవంతం అయినట్లు సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం రసీదు IDని వ్రాసి పెట్టుకోండి.మీరు మీ మొబైల్ సంఖ్య మరియు ఆధార్‌తో లింక్ చేయబడిన ఇమెయిల్ IDపై ధృవీకరణ సందేశాన్ని కూడా స్వీకరిస్తారు.
3.3 పెండింగ్‌లో ఉన్న ఇ-PAN అభ్యర్థన స్థితి/ఇ-ఫైలింగ్ పోర్టల్ ఖాతాను క్రియేట్ చేయడం/ ఇ-PAN డౌన్‌లోడ్ చేయడం స్థితిని తనిఖీ చేయండి
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, తక్షణ ఇ-PAN క్లిక్ చేయండి.
దశ 2: ఇ-PAN పేజీలో, స్థితి తనిఖీ చేయండి/PAN డౌన్‌లోడ్ చేయండి ఎంపికపై కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 3: స్థితిని తనిఖీ చేయండి / PAN డౌన్‌లోడ్ పేజీలో, మీ 12-అంకెల ఆధార్‌ను నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 4: OTP ధ్రువీకరణ పేజీలో, ఆధార్‌తో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- OTP 15 నిమిషాల వరకు మాత్రమే చెల్లుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
- తెరపై OTP గడువు కౌంట్‌డౌన్ టైమర్ OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- OTPని తిరిగి పంపండి క్లిక్ చేసిన తరువాత, క్రొత్త OTP జనరేట్ అయ్యి పంపబడుతుంది.
దశ 5: మీ ఇ-PAN అభ్యర్థన పేజీ యొక్క ప్రస్తుత స్థితిపై, మీరు మీ ఇ-PAN అభ్యర్థన స్థితిని చూడగలరు. కొత్త ఇ-PAN జనరేట్ అయ్యి కేటాయించబడినట్లయితే, చూడటానికి ఇ-PANని చూడండి లేదా కాపీని డౌన్‌లోడ్ చేయడానికి ఇ-PANని డౌన్‌లోడ్ చేయండి క్లిక్ చేయండి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి ఇ-ఫైలింగ్ ఖాతాను రూపొందించండి పైన క్లిక్ చేయండి.
గమనిక: మీ ఇ-PANను రూపొందించేటప్పుడు లేదా PAN వివరాలను అప్‌డేట్ చేస్తున్నప్పుడు మీ ఇమెయిల్ ఐడిని (మీ ఆధార్ KYC ప్రకారం) ధృవీకరించకపోతే, రిజిస్ట్రేషన్ సమయంలో అలా చేయడం తప్పనిసరి.
3.4 లాగిన్ చేసిన తరువాత ఇ-PAN డౌన్‌లోడ్ చేయండి
దశ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
గమనిక: మీరు ఇ-PAN అందుకున్న తర్వాత ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీకు మీరే రిజిస్టర్ చేసుకోవాలి. విజయవంతంగా నమోదు చేసుకున్న తరువాత మాత్రమే, ఆ పోర్టల్‌కు మీరు లాగిన్ కావచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇ-ఫైలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి (పన్ను చెల్లింపుదారు) యూజర్ మాన్యువల్‌కి వెళ్లండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, సేవలు > చూడండి / ఇ-PAN డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయండి.
దశ 3: ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి పేజీలో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 4: OTP ధ్రువీకరణ పేజీలో, ఆధార్‌తో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- OTP 15 నిమిషాల వరకు మాత్రమే చెల్లుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
- తెరపై OTP గడువు కౌంట్‌డౌన్ టైమర్ OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- OTPని తిరిగి పంపండి క్లిక్ చేసిన తరువాత, క్రొత్త OTP జనరేట్ అయ్యి పంపబడుతుంది.
దశ 5: చూడండి/ ఇ-PAN డౌన్‌లోడ్ చేయండి పేజీలో, మీరు మీ ఇ-PAN అభ్యర్థన స్థితిని చూడగలరు. కొత్త ఇ-PAN జనరేట్ అయ్యి కేటాయించబడినట్లయితే, చూడటానికి ఇ-PANని చూడండి లేదా కాపీని డౌన్‌లోడ్ చేయడానికి ఇ-PANని డౌన్‌లోడ్ చేయండి క్లిక్ చేయండి.
4.సంబంధిత అంశాలు
- ఇ - ఫైలింగ్ ( పన్ను చెల్లింపుదారు ) కోసం రిజిస్టర్ చేయండి
- డాష్‌బోర్డ్ మరియు వర్క్‌లిస్ట్
- లాగిన్
- మీ PANని వెరిఫై చేయండి
- ఆధార్‌ను అనుసంధానం చేయండి
- మీ పాన్ గురించి తెలుసుకోండి