Do not have an account?
Already have an account?

1. అవలోకనం

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇ-రిటర్న్ మధ్యవర్తులు ( ERIs ) గా నమోదు చేసుకోవాలనుకునే వినియోగదారులందరికీ ERI రిజిస్ట్రేషన్ సేవ అందుబాటులో ఉంది. ఇ-ఫైలింగ్ హోమ్‌పేజీలో ఇది ప్రీ-లాగిన్ కార్యాచరణ.ఈ కార్యాచరణతో వినియోగదారులు ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ లో లాగిన్‌ తరువాత పన్ను సంబంధిత కార్యకలాపాలను తెలుసుకోవడానికి అనుమతి లభిస్తుంది.

2. ఈ సేవను పొందడానికి కావలసిన వివరాలు

  • పోర్టల్‌లో నమోదు చేసిన వినియోగదారు ERIగా నమోదు చేసుకోవడానికి PAN / TAN కలిగి ఉండాలి
  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన మొబైల్ సంఖ్య ద్వారా ప్రవేశం లభిస్తుంది.
  • ఇ-ఫైలింగ్‌లో PAN నమోదు చేయాలి
  • చెల్లుబాటు అయ్యే మరియు నమోదు చేసిన DSC

3. దశలవారీ మార్గదర్శిని

3.1 ERI రిజిస్ట్రేషన్ అభ్యర్థనను సమర్పించండి

దశ 1: హోమ్‌పేజీని చూడడానికి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లండి మరియు రిజిస్టర్‌ను క్లిక్ చేయండి.

Data responsive


దశ 2: ఇతరులు > ఇ-రిటర్న్ మధ్యవర్తి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: కొత్త దరఖాస్తుదారుగా నమోదును మరియు వర్తించే ERI రకం ఎంచుకోండి. కొనసాగించు క్లిక్ చేయండి.

Data responsive


దశ 4: ఇ-రిటర్న్ మధ్యవర్తి గా నమోదు పేజీలో, మీరు ERI గా నమోదు చెయాలనుకునే PAN / TAN ను నమోదు చేసి ధృవీకరించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 5: విజయవంతంగా ధృవీకరణ చేసిన తరువాత, నమోదు చేసిన PAN / TAN ( PAN / TAN ఇప్పటికే ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి) రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 6 అంకెల ఒటిపి పంపబడుతుంది. ఒటిపి ని నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


గమనిక:

  • ఒటిపి 15 నిమిషాల పాటు మాత్రమే చెల్లుతుంది.
  • సరైన ఒటిపి ని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
  • స్క్రీన్‌పై ఉన్న ఒటిపి గడువు కౌంట్‌డౌన్ టైమర్ మీకు ఒటిపి గడువు సమయం చెబుతుంది.
  • ఒటిపి టైమర్ ఒక ఒటిపిని పునరుత్పత్తి చేయడానికి మిగిలి ఉన్న సమయాన్ని చూపిస్తుంది. ఒటిపి మళ్లీ పంపు క్లిక్ చేసిన తరువాత, కొత్త ఒటిపి రూపొందించబడుతుంది.

దశ 6: దరఖాస్తుదారుడి వర్గాన్ని ఎంచుకోండి మరియు కొనసాగించు క్లిక్ చేయండి.

Data responsive


దశ 7: ప్రాథమిక వివరాల స్క్రీన్‌లో ప్రాథమిక వివరాలను ( పేరు, పుట్టినతేదీ మరియు PAN వ్యక్తిగత వినియోగదారు కోసం నమోదు చేయండి; కంపెనీ/సంస్థ కోసం నెలకొల్పిన తేదీ, సంస్థ పేరు DDO కోసం TAN కేటాయించిన తేదీ నమోదు చేయండి) నమోదు చేయండి మరియు కొనసాగించు క్లిక్ చేయండి.

Data responsive


దశ 8: విజయవంతంగా ధృవీకరణ తర్వాత, మీరు ప్రధాన సంప్రదింపు వివరాల పేజీకి ( లేదా వ్యక్తుల విషయంలో సంప్రదింపు వివరాల స్క్రీన్‌కు ) తీసుకెళ్ళబడతారు. స్క్రీన్‌పై ప్రధానంగా సంప్రదించవలసిన వారి వివరాలను నమోదు చేసి కొనసాగించు పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 9: మీరు మునుపటి స్క్రీన్‌లో నమోదు చేసిన మొబైల్ సంఖ్యకు మరియు ఇమెయిల్ IDకి 6 అంకెల ఒటిపి వస్తుంది. మొబైల్ కీ, మెయిల్ కి వచ్చిన 6 అంకెల ఒటిపి ని నమోదు చేసి కొనసాగించండి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 10: జతపరచే పత్రాల స్క్రీన్‌పై, దరఖాస్తుదారు వర్గం ఆధారంగా వాటిని అప్‌లోడ్ చేయండి.

టైప్ 1 ERI కోసం

  • ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ హామీ

టైప్ 2 మరియు 3 ERI కోసం

  • ధృవీకరణ పత్రం
  • బ్యాంక్ హామీ
  • ఆడిట్ నివేదిక

గమనిక:
జతపరచే పత్రాలు పి.డి.ఎఫ్. రూపంలో 5 MB కంటే తక్కువగా ఉండాలి.

Data responsive


దశ 11: మీ వివరాలను ధృవీకరించే పేజిలో అవసరమైన వివరాలను సవరించండి. ధృవీకరించండి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 12: విజయవంతమైనది అనే సందేశం ప్రదర్శించబడుతుంది మరియు మీ రిజిస్ట్రేషన్ అభ్యర్థన ఆమోదం కోసం సమర్పించబడుతుంది.

Data responsive

3.2 అభ్యర్థన తరువాత సమర్పణ దశ:

దశ 1: హోమ్‌పేజీని చూసేందుకు ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లండి మరియు రిజిస్టర్‌ పై క్లిక్ చేయండి.

దశ 1


దశ 2: ఇతరులు > ఇ-రిటర్న్ మధ్యవర్తి పై క్లిక్ చేయండి.

దశ 2


దశ 3: నమోదు స్థితిని చూడండి ఎంచుకోండి.

దశ 3


దశ 4: మీ PAN / TAN నమోదు చేసి ధృవీకరించు పై క్లిక్ చేయండి.

దశ 4


దశ 5: రిజిస్ట్రేషన్ అభ్యర్థనను సమర్పించే సమయంలో 6 అంకెల OTP అందించిన మొబైల్ సంఖ్యకు పంపబడింది.

దశ 5


గమనిక:

  • ఒటిపి 15 నిమిషాల పాటు మాత్రమే చెల్లుతుంది.
  • సరైన ఒటిపి ని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
  • ఒటిపి గడువు ఎప్పుడు ముగుస్తుందో స్క్రీన్‌పై ఒటిపి గడువు కౌంట్‌డౌన్ టైమర్ మీకు చెబుతుంది.
  • ఒటిపి టైమర్ ఒక ఒటిపిని పునరుత్పత్తి చేయడానికి మిగిలి ఉన్న సమయాన్ని చూపిస్తుంది. ఒటిపి మళ్లీ పంపు క్లిక్ చేసిన తరువాత, కొత్త ఒటిపి రూపొందించబడుతుంది.

ERI రిజిస్ట్రేషన్ అభ్యర్థన సమర్పించిన తర్వాత, ఈ క్రింది వాటిలో ఒకటి జరుగుతుంది. మరింత తెలుసుకోవడానికి సంబంధిత విభాగాలకు వెళ్ళండి.

కేసు సెక్షన్ సంఖ్య
నమోదు దరఖాస్తును రిజిస్ట్రార్ ఆమోదించినప్పుడు సెక్షన్ 3.2.1కు వెళ్ళండి
నమోదు అభ్యర్థనలో లోపాలు ఉన్నప్పుడు సెక్షన్ 3.2.2కు వెళ్ళండి
నమోదు అభ్యర్థన తిరస్కరించబడినప్పుడు సెక్షన్ 3.2.3కు వెళ్ళండి
నమోదు అభ్యర్థన రిజిస్ట్రార్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నప్పుడు సెక్షన్ 3.2.4కు వెళ్ళండి

 

3.2.1 రిజిస్ట్రేషన్ దరఖాస్తును రిజిస్ట్రార్ ఆమోదించినప్పుడు

దశ 1: 6 అంకెల OTP విజయవంతంగా ధ్రువీకరణ చేసిన తరువాత, దరఖాస్తు ఆమోదించబడినదనే స్క్రీన్ కనిపిస్తుంది. కొనసాగించు క్లిక్ చేయండి.

దశ 6


దశ 2: సెట్ పాస్‌వర్డ్ స్క్రీన్‌పై, ఇచ్చిన రెండు గడుల్లో ఒకే పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, నమోదు క్లిక్ చేయండి.

దశ 7


గమనిక:

  • రిఫ్రెష్ లేదా వెనుకకు క్లిక్ చేయవద్దు.
  • మీ కొత్త పాస్వర్డ్‌ను రాసేటప్పుడు, పాస్వర్డ్ విధానం పట్ల శ్రద్ధ వహించండి:
  • ఇందులో కనీసం 8 అక్షరాలు మరియు గరిష్ఠంగా 14 అక్షరాలు ఉండాలి.
  • ఇందులో అప్పర్‌కేస్ మరియు లోయర్‌కేస్ అక్షరాలు రెండూ ఉండాలి.
  • అందులో ఒక సంఖ్య తప్పనిసరిగా ఉండాలి.
  • అందులో ప్రత్యేక అక్షరం ఉండాలి ( ఉదా., @ #$%).

దశ 3: నమోదు ప్రక్రియ పూర్తయింది, మరియు నమోదు చేసిన పాస్‌వర్డ్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది పేజీకి వెళ్తారు

దశ 8

3.2.2 నమోదు అభ్యర్థనలో లోపాలు ఉన్నప్పుడు

దశ 1: నమోదు చేసిన ఒటిపి విజయవంతంగా ధృవీకరించిన తరువాత, మీరు దరఖాస్తులో లోపాలు ఉన్నాయి పేజీకి తీసుకెళ్లబడతారు. లోపాలతో ఉన్న పత్రాల జాబితా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ధృవీకరించబడని పత్రాల జాబితాను జత చేయడానికి రీసబ్మిట్ క్లిక్ చేయండి.

B దశ 6


దశ 2: ధృవీకరించబడని పత్రాలు అప్‌లోడ్ చేయబడిన తర్వాత, కొనసాగించు పై క్లిక్ చేయండి.

B దశ 7


గమనిక:
జతపరచే పత్రాలు పిడిఎఫ్ లో 5 MB కంటే తక్కువ పరిమాణంలో ఉండాలి.

దశ 3: తరువాత స్క్రీన్‌పై వివరాలను ధృవీకరించి, సబ్మిట్ క్లిక్ చేయండి.

 B దశ 8


దశ 4: నమోదు అభ్యర్థన సమర్పించబడింది స్క్రీన్ ప్రదర్శించబడుతుంది.

B దశ 9

3.2.3 నమోదు అభ్యర్థన తిరస్కరించబడినప్పుడు

దశ 1: నమోదు చేసిన ఒటిపి ధృవీకరణ తరువాత, దరఖాస్తు తిరస్కరించబడినది స్క్రీన్ మీకు ప్రదర్శించబడుతుంది. హోమ్‌పేజీకి వెళ్ళు క్లిక్ చేయండి, మీరు ERI గా నమోదు కోసం తిరిగి దరఖాస్తు చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ అభ్యర్థనను సమర్పించండి.

C దశ 6


3.2.4 రిజిస్ట్రేషన్ అభ్యర్థన రిజిస్ట్రార్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నప్పుడు

దశ 1: నమోదు చేసిన ఒటిపి ధృవీకరణ తర్వాత, దరఖాస్తు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నది స్క్రీన్ మీకు ప్రదర్శించబడుతుంది.

D దశ 6

 

4. సంబంధిత అంశాలు