1. అవలోకనం
చెల్లుబాటు అయ్యే PAN మరియు చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా ఉన్న, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత అన్ని నమోదిత పన్ను చెల్లింపుదారులకు నా బ్యాంకు ఖాతా సేవ అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ మీకు వీటిని అందిస్తుంది:
- బ్యాంక్ ఖాతాను జోడించి ముందస్తుగా ధృవీకరించండి
- మూసిఉన్న లేదా నిష్క్రియం చేసిన బ్యాంక్ ఖాతాని తొలగించండి.
- ఆదాయపు పన్ను రీఫండ్ పొందడానికి మరియు నెట్ బ్యాంకింగ్ కోసం చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి లాగిన్ అవ్వండి
- ఆ ఖాతాలో టాక్స్ రీఫండ్ పొందకుండా నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తొలగించండి
- చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా కోసం EVCని ప్రారంభించండి లేదా నిలిపివేయండి (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే, ఇ-ఫైలింగ్ అనుసంధానమైన బ్యాంకులకు మాత్రమే)
- ముందస్తు ధృవీకరణ విఫలమైన బ్యాంక్ ఖాతాలను మళ్ళీ ధృవీకరించండి
2. ఈ సేవను పొందడానికి ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి
- ముందుగా ధృవీకరించబడే బ్యాంకు ఖాతాతో PAN తప్పనిసరిగా లింక్ చేయబడాలి
| సేవ | ముందస్తు అవసరాలు |
|---|---|
| బ్యాంక్ ఖాతాను జోడించండి మరియు ధృవీకరించండి |
1. ఖాతాను PANతో లింక్ చేయాలి
గమనిక*: వినియోగదారు లాగిన్ రకం ఆధారంగా ధృవీకరణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. |
| బ్యాంక్ ఖాతా తొలగించండి |
1. ఏదైనా ఒక ధృవీకరణ పద్ధతికి యాక్సెస్*:
గమనిక*: వినియోగదారు లాగిన్ రకం ఆధారంగా ధృవీకరణ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. |
| బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి లేదా రీఫండ్ కోసం నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తీసివేయండి. |
1. ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతా |
| EVCని ప్రారంభించండి |
1. ఇ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంకులలో ఏదైనా ఒక బ్యాంకులో ఖాతా |
3. దశలవారీ మార్గదర్శిని
దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ ఫైలింగ్ పోర్టల్‌లోనికి లాగిన్ అవ్వండి.
దశ 2: డాష్‌బోర్డ్ నుండి నా ప్రొఫైల్ పేజీ కి వెళ్ళండి .
దశ 3 : నా బ్యాంక్ ఖాతాని క్లిక్ చేయండి.
నా బ్యాంక్ ఖాతాల పేజీ లో, జోడించబడిన, విఫలమైన మరియు తొలగించబడిన బ్యాంక్ ఖాతాల ట్యాబ్ లు ప్రదర్శించబడతాయి.
నా బ్యాంక్ ఖాతా సేవ కింద వివిధ సౌకర్యాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, ఈ క్రింది విభాగాలను చూడండి:
| బ్యాంక్ ఖాతాని జోడించి ముందస్తుగా ధృవీకరించండి | సెక్షన్ 3.1కి వెళ్లండి |
| బ్యాంక్ ఖాతా తొలగించండి | సెక్షన్ 3.2కి వెళ్లండి |
| బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి లేదా రీఫండ్ కోసం నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తీసివేయండి. | సెక్షన్ 3.3కి వెళ్లండి |
| EVC ని ప్రారంభించండి మరియు నిలిపివేయండి | సెక్షన్ 3.4కి వెళ్లండి |
| బ్యాంక్ ఖాతాను మళ్ళీ ధృవీకరించండి | సెక్షన్ 3.5కి వెళ్లండి |
| నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వడానికి బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి. | సెక్షన్ 3.6కి వెళ్లండి |
3.1 బ్యాంక్ ఖాతాను జోడించి ముందస్తు ధృవీకరించండి
PAN / ఆధార్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా
దశ 1: నా బ్యాంక్ ఖాతాల పేజీ పై, బ్యాంకు ఖాతా జోడించండి పై క్లిక్ చేయండి.
దశ 2: బ్యాంక్ ఖాతా జోడించండి పేజీలో, బ్యాంక్ ఖాతా నంబర్ నమోదు చేయండి, ఖాతా రకం మరియు హోల్డర్ రకాన్ని ఎంచుకుని, IFSCని నమోదు చేయండి. బ్యాంక్ పేరు మరియు శాఖ IFSC కోడ్ ఆధారంగా స్వయంగా కనపడుతుంది మీ బ్యాంక్ ఇ-ఫైలింగ్‌తో అనుసంధానించబడి ఉంటే, మీ మొబైల్ సంఖ్య మరియు ఇమెయిల్ ఐడి మీ ఇ-ఫైలింగ్ ప్రొఫైల్ నుండి ముందే నింపబడతాయి మరియు వాటిని సవరించడానికి వీలు ఉండదు.
దశ 3: ఇ-ధృవీకరణకు వెళ్లండిపై క్లిక్ చేయండి.
ఇ-ధృవీకరణ చేయడానికి ఎంపికను ఎంచుకుని, కొనసాగించుపై క్లిక్ చేయండి.
OTPని నమోదు చేసి ధృవీకరించండి.
ధృవీకరణ అభ్యర్థన విజయవంతంగా సమర్పించబడినప్పుడు, విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. అలాగే, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన మీ మొబైల్ సంఖ్య మరియు ఇమెయిల్ ఐడికి సందేశం అందుకుంటారు.
3.2 బ్యాంకు ఖాతాను తొలగించండి.
దశ 1: కావలసిన బ్యాంక్ ఖాతా కోసం యాక్షన్ కాలమ్ కింద ఉన్న బ్యాంక్ ఖాతాను తొలగించుపై క్లిక్ చేయండి.
దశ 2: బ్యాంక్ ఖాతాను తొలగించడానికి డ్రాప్ డౌన్ నుండి ఒక కారణాన్ని ఎంచుకోండి. మీరు ఇతరాలు ఎంచుకుంటే, టెక్స్ట్‌బాక్స్‌లో కారణాన్ని నమోదు చేసి, కొనసాగించు క్లిక్ చేయండి.
దశ 3: ఇ-ధృవీకరణ చేయడానికి ఎంపికను ఎంచుకుని, కొనసాగండిపై క్లిక్ చేయండి.
దశ 4: OTPని నమోదు చేసి ధృవీకరించండి.
బ్యాంక్ ఖాతాను విజయవంతంగా తొలగించడం ద్వారా, విజయవంతమైనట్లు సందేశం ప్రదర్శించబడుతుంది.
‘ధృవీకరణ పురోగతిలో ఉంది’ అనే స్థితి ఉన్న బ్యాంక్ ఖాతాను మీరు తొలగించవచ్చు మరియు తొలగించిన తర్వాత సరైన వివరాలతో అదే బ్యాంక్ ఖాతాను జోడించడానికి ప్రయత్నించవచ్చు.
3.3 బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి లేదా రీఫండ్ కోసం నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తీసివేయండి
A. రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి
దశ 1: వాపసు కోసం బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయడానికి, వాపసు కోసం నామినేట్ చేయండి మార్చండి/స్విచ్ ( ఎడమ వైపున స్విచ్ ఉంటుంది ) పై క్లిక్ చేయండి వాపసు కోసం మీరు నామినేట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతా కోసం ఇలా చేయండి.
దశ 2: మీరు ఎంచుకున్న బ్యాంకు ఖాతాను నామినేట్ చేయాలని నిర్ధారించడానికి కొనసాగించండి పై క్లిక్ చేయండి.
విజయవంతమైన తరువాత, స్విచ్ కుడి వైపుకు మారుతుంది.
B. రీఫండ్ కోసం నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తొలగించండి
దశ 1: రీఫండ్ కోసం నామినేట్ చేయబడిన బ్యాంక్ ఖాతాను తీసివేయడానికి, రీఫండ్ కోసం నామినేట్ చేయండి టాగిల్/స్విచ్ ( కుడి వైపున ఉంటుంది ) పై క్లిక్ చేయండి మీరు నామినేషన్ నుండి తీసివేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతా కోసం ఇలా చేయండి.
దశ 2: మీరు ఎంచుకున్న బ్యాంకు ఖాతా నామినేషన్‌ను తొలగించాలనుకుంటున్నారని నిర్ధారించటానికి కొనసాగించండి పై క్లిక్ చేయండి.
విజయవంతమైతే, స్విచ్ ఎడమ వైపుకు వెళుతుంది.
3.4 EVC ని ప్రారంభించండి మరియు నిలిపివేయండి
A. EVC ని ప్రారంభించండి
దశ 1: మీరు EVC ప్రారంభించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాలో చర్యలు క్రింద EVC ప్రారంభించండి పై క్లిక్ చేయండి.
దశ 2: నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- క్రింది షరతులు నెరవేరితేనే చెల్లుబాటయ్యే బ్యాంక్ ఖాతా కోసం EVC ప్రారంభించబడుతుంది:
- మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని బ్యాంక్ ధృవీకరించాలి.
- ఇ - ఫైలింగ్‌తో నమోదు చేయబడిన మీ మొబైల్ నంబర్ ను బ్యాంక్ ధృవీకరించి ఉండాలి. అవి సరిపోలుతున్నాయని నిర్ధారించుకోవడానికి, మీ ఇ-ఫైలింగ్ ప్రొఫైల్‌లోని మీ మొబైల్ నంబర్‌ను బ్యాంకుతో లింక్ చేయబడిన దానిలాగా అప్‌డేట్ చేయండి లేదా మీ ఇ-ఫైలింగ్ ప్రొఫైల్‌లోని మొబైల్ నంబర్‌ను మీ బ్యాంకుతో అప్‌డేట్ చేయండి.
- ఏదైనా ఇతర బ్యాంకు ఖాతా కోసం EVC ప్రారంభించకూడదు.
- మీ బ్యాంక్ ఇ - ఫైలింగ్‌తో అనుసంధానించబడాలి. ఇ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంకుల జాబితాను ఇక్కడ చూడవచ్చు: లాగిన్ > నా ప్రొఫైల్ > నా బ్యాంక్ ఖాతా > గమనికల విభాగం > “బ్యాంకుల జాబితా”పై క్లిక్ చేయండి
- మీరు మీ బ్యాంక్ ఖాతాను మాత్రమే ముందుగా ధృవీకరించాలని, EVCని ప్రారంభించవద్దు అనుకుంటే, మీ ఇ - ఫైలింగ్ మొబైల్ లేదా ఇమెయిల్, మీ బ్యాంక్ ధృవీకరించిన సంప్రదింపు వివరాలతో సరిపోల్చాల్సిన అవసరం లేదు.
పైన పేర్కొన్న షరతులు నెరవేరితే, ఎంచుకున్న బ్యాంక్ ఖాతా కోసం EVC విజయవంతంగా ప్రారంభించబడుతుంది మరియు స్థితి చెల్లుబాటు అయ్యేదిగా నవీకరించబడుతుంది మరియు EVC ప్రారంభించబడుతుంది:
దశ 3: ఒక బ్యాంక్ ఖాతాకు EVC ఇప్పటికే ప్రారంభించబడి ఉంటే, మరియు మీరు మరొక బ్యాంక్ ఖాతాకు EVCని ప్రారంభించడానికి ప్రయత్నిస్తే, దాని గురించి మీకు తెలియజేసే సందేశం ప్రదర్శించబడుతుంది. సందేశంలో కొనసాగండిపై క్లిక్ చేయండి, దశ 2లో పేర్కొన్న షరతులు నెరవేరితే బ్యాంక్ ఖాతాకు EVC ప్రారంభించబడుతుంది. అటువంటి సందర్భంలో, గతంలో ప్రారంభించిన బ్యాంక్ ఖాతా కోసం EVC నిలిపివేయబడుతుంది.
గమనిక: మీరు రద్దు చేయండి క్లిక్ చేసినా లేదా సందేశాన్ని మూసివేసినా, ప్రస్తుత బ్యాంక్ ఖాతాకు EVC ప్రారంభించబడి ఉంటుంది.
B. EVC ని నిలిపివేయండి
దశ 1: EVC ప్రారంభించబడిన బ్యాంక్ ఖాతాలోని యాక్షన్స్ కాలమ్ కింద EVCని నిలిపివేయిపై క్లిక్ చేయండి.
దశ 2: నిర్ధారణ సందేశం ప్రదర్శించబడుతుంది. కొనసాగించండి క్లిక్ చేయండి.
విజయవంతం అని వచ్చిన తరువాత, EVC ఎంచుకున్న ఖాతాను నిలిపివేసి ధృవీకరించబడింది స్థితికి అప్‌డేట్ చేయబడింది:
3.5 బ్యాంక్ ఖాతాను తిరిగి ధృవీకరించండి
దశ 1: బ్యాంక్ ఖాతా కోసం ధృవీకరణ అంతకుముందు విఫలమైతే, మీరు విఫలమైన బ్యాంక్ ఖాతాల ట్యాబ్ క్రింద దాని వివరాలను చూస్తారు. మీరు తిరిగి ధృవీకరణ చేయాలనుకున్న బ్యాంక్ ఖాతా కోసం చర్య కాలమ్ కింద మళ్ళీ ధృవీకరించండి పై క్లిక్ చేయండి.
మీ మొబైల్/బ్యాంకుతో లింక్ చేయబడిన ఇమెయిల్‌లో లేదా ఇ-ఫైలింగ్ ప్రొఫైల్‌లో ఏదైనా అప్‌డేట్ ఉంటే లేదా మీ ఖాతా రకం/ఖాతా స్థితి నవీకరించబడితే కూడా మీరు జోడించిన బ్యాంక్ ఖాతాను తిరిగి ధృవీకరించవచ్చు.
దశ 2: బ్యాంక్ అకౌంట్ జోడించండి అనే పేజీలో, బ్యాంక్ మరియు సంప్రదింపు వివరాలు ముందుగా నింపబడతాయి. బ్యాంక్ వివరాలను సవరించగలరు కానీ సంప్రదింపు వివరాలు సవరించబడవు. అవసరమైతే సవరించగలిగిన వివరాలను అప్‌డేట్ చేయండి. ఇ-ధృవీకరణ కోసం కొనసాగండిపై క్లిక్ చేయండి
దశ 3: ఇ-ధృవీకరణ కోసం పద్ధతిని ఎంచుకోండి.
ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
విజయవంతం అయిన తరువాత, జోడించబడిన బ్యాంక్ ఖాతాలు ట్యాబ్ క్రింద బ్యాంక్ ఖాతా జోడించబడుతుంది, మరియు స్థితి ధ్రువీకరణ పురోగతిలో ఉన్నది గా అప్‌డేట్ చేయబడుతుంది.
తరువాత, మీ సంప్రదింపు వివరాలు బ్యాంక్ వివరాలతో వెరిఫై చేయబడతాయి. ఖాతా వివరాలను బ్యాంక్ ధృవీకరించినట్లయితే, మీ బ్యాంక్ ఖాతా ధృవీకరించబడుతుంది. మీరు జోడించిన బ్యాంక్ ఖాతాల ట్యాబ్ లోని స్టేటస్ కాలమ్‌లో ధ్రువీకరణ స్థితిని చెక్ చేయవచ్చు.
చెల్లుబాటు ఇంకా విఫలమైనట్టైతే ఆ వైఫల్యం కారణం మీద ఆధారపడి ఈ క్రింది చర్యను తీసుకోండి (ఇంటిగ్రేటెడ్ బ్యాంకుల కోసం):
| వైఫల్యానికి గల కారణం | తీసుకోవలసిన చర్య |
| PAN-బ్యాంక్ ఖాతా-IFSC లింకేజ్ విఫలమైంది | బ్యాంక్ ఖాతాతో మీ PANను లింక్ చేయడానికి బ్రాంచ్‌ను సంప్రదించండి, ఆపై అభ్యర్థనను సమర్పించడానికి తిరిగి ధృవీకరించండి క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి. |
| పేరు మిస్‌మ్యాచ్ అయింది | PAN ప్రకారం పేరును నవీకరించడానికి శాఖను సంప్రదించండి. తరువాత, మళ్ళీ ధృవీకరించాలి, మళ్ళీ ధృవీకరించడానికి వివరాలను నవీకరించి మరియు అభ్యర్థన సమర్పించాలి. |
| బ్యాంక్ ఖాతా నంబర్ సరిపోలడం లేదు | మళ్ళీ ధృవీకరించండి పై క్లిక్ చేయండి, సరైన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి తిరిగి ధృవీకరణ కోసం అభ్యర్థనను సమర్పించండి. |
| ఖాతా నంబర్ లేదు | సరైన బ్యాంక్ ఖాతా సంఖ్యను నమోదు చేసి, తిరిగి ధృవీకరణ కోసం అభ్యర్థనను సమర్పించండి. |
| బ్యాంక్ ఖాతా మూసివేయబడింది / క్రియారహితంగా ఉంది | వేరే బ్యాంక్ ఖాతా సంఖ్యతో ప్రయత్నించండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి. |
నాన్-ఇంటిగ్రేటెడ్ బ్యాంకులలో ఒకదానిలో ఖాతా ఉంటే, ఈ క్రింది చర్యలు తీసుకోవాలి:
| వైఫల్యానికి గల కారణం | తీసుకోవలసిన చర్య |
| బ్యాంక్ ఖాతాతో PAN లింక్ చేయలేదు. | PANను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయండి మరియు అభ్యర్థనను సమర్పించడానికి తిరిగి - ధృవీకరించండి పై క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి. |
| PAN సరిపోలడం లేదు | సరైన PANను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి మరియు అభ్యర్థనను సమర్పించడానికి తిరిగి - ధృవీకరించండి క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి. |
| చెల్లుబాటు కాని ఖాతా రకం | తిరిగి - ధృవీకరించండి క్లిక్ చేయండి, సరైన బ్యాంక్ ఖాతా రకాన్ని ఎంచుకోండి మరియు ధృవీకరణ కోసం అభ్యర్థనను సమర్పించండి. |
| ఖాతా మూసివేయబడింది/నిష్క్రియ ఖాతా/వ్యాజ్యం ఉన్న ఖాతా/ఖాతా స్తంభింపజేయబడింది లేదా బ్లాక్ చేయబడింది | వేరే చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా సంఖ్యతో ప్రయత్నించండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి. |
| ఖాతాదారుని పేరు చెల్లదు | మళ్ళీ - ధృవీకరించండి క్లిక్ చేసి, వివరాలను అప్‌డేట్ చేయండి. PAN ప్రకారం పేరును అప్‌డేట్ చేయడానికి మీ శాఖను సంప్రదించండి. |
బ్యాంక్ ధృవీకరణ స్థితి 'ధృవీకరణ చేయలేము' అయితే, బ్యాంకు వివరాలను విభాగం ధృవీకరించలేదని అర్థం. మీరు ఇ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన మరియు విభాగం ద్వారా ధృవీకరించబడే మరొక ఖాతాను జోడించవచ్చు లేదా రీఫండ్ వర్తిస్తే, రీఫండ్ రీఇష్యూ అభ్యర్థనను లేవనెత్తుతూ మీరు ECS ఆదేశ ఫారమ్‌ను సమర్పించవచ్చు.
3.6 నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వడానికి చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయండి.
దశ 1: నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కోసం నామినేట్ బటన్‌ను ప్రారంభించండి:
దశ 2: కొనసాగండిపై క్లిక్ చేయండి.
దశ 3: ఇప్పుడు, నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వడానికి బ్యాంక్ ఖాతా నామినేట్ చేయబడింది.