1. అవలోకనం
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అన్ని రకాల 1 & టైప్ 2 రిజిస్టర్డ్ ERI యూజర్స్‌కు యాడ్ క్లైంట్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ ద్వారా, రిటర్న్స్ మరియు ఫార్మ్‌స్ ఫైల్ చేయడంతో సహా వారి తరపున నిర్దిష్టమైన చర్యలను చేయడానికి రిజిస్టర్డ్ PAN యూజర్స్ మరియు రిజిస్టర్ద్ TAN యూజర్స్‌ను క్లైంట్స్‌గా యాడ్ చేయవచ్చు.
అదనంగా, టాక్స్‌పేయర్ రిజిష్టర్ కాకపోతే, వారిని క్లైంట్స్ గా యాడ్ చేస్తున్న సమయంలో (PAN యూజర్స్ మాత్రమే) ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో[టైప్ 1 & టైప్ 2] ERIsను రిజిష్టర్ చేయవచ్చు.
ఈ సర్వీస్‌తో, (టైప్ 1 & టైప్ 2) ఇ-ఫైలింగ్ పోర్టల్ (లాగిన్ తరువాత) లో యాక్టివ్ / ఇన్-యాక్టివ్ క్లైంట్స్ వివరాలను కూడా ERIs చూడగలరు.
మీ క్లైంట్‌ను విజయవంతంగా యాడ్ చేసిన తరువాత, మీ యాడెడ్ క్లైంట్ తరపున ఈ క్రింది చర్యలను చేయగలరు:
- ఫారం 26 AS, వార్షిక సమాచార ప్రకటన చూడండి
- ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్/ఫార్మ్స్ చూడండిడి మరియు ఫైల్ చేయండి
- ప్రొఫైల్ వివరాలను చూడండి/ అప్‌డేట్ చేయండి
- నోటీసులు చూడండి
- కట్టవలసిన పన్నుసమాచారానికి జవాబు ఇవ్వండి
- రెక్టిఫికేషన్ స్టేటస్ చూడండి
- టాక్స్ క్రెడిట్ మిస్‌మ్యాచ్ డీటైల్స్ చూడండి
- రీఫండ్ మరల ఇవ్వమని మరియు సదరు ఆలస్యాన్ని రద్దు చెయ్యమని సేవ కోరుతూ అభ్యర్ధన నమోదు చెయ్యండి
- ఫిర్యాదులను సబ్మిట్ చేయండి మరియు వాటి స్టేటస్ పరిశీలించండి
- ఇ - ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ చెల్లించండి.
2. ఈ సర్వీస్ పొందడానికి ముందుగా అవసరమైనవి.
- ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో రిజిష్టర్డ్ యూజర్
- వాలీడ్ & యాక్టివ్ PAN
- క్లైంట్‌గా అతనిని/ ఆమెను యాడ్ చేయడానికి ముందు టాక్స్‌పేయర్ నుండి సమ్మతి.
సాధారణ ముందస్తు అవసరాలకు అదనంగా, క్లైంట్స్ గా చేర్చాల్సిన టాక్స్‌పేయర్స్ క్యాటగిరీ ఆధారంగా ఈ క్రింది ముందస్తు అవసరాలను నిర్ధారించాలి.
| క్రమ సంఖ్య. నం. | వివరణ | ముందస్తు అవసరాలు |
| 1. | క్లైంట్లుగా PAN యూజర్స్‌ను యాడ్ చేయడం |
|
| 2. | క్లైంట్స్‌గా TAN యూజర్స్ యాడ్ చేయడం |
|
3. దశల వారీ గైడ్
3.1 క్లైంట్స్‌గా రిజిష్టర్డ్ టాక్స్‌పేయర్స్‌ను యాడ్ చేయండి
3.2 క్లైంట్స్‌గా అన్-రిజిష్టర్డ్ టాక్స్‌పేయర్స్‌ను యాడ్ చేయండి
3.3 క్లైంట్స్‌గా TAN యూజర్స్ యాడ్ చేయండి
3.1. రిజిష్టర్డ్ టాక్స్‌పేయర్స్ ను క్లైంట్స్‌గా యాడ్ చేయండి.
దశ 1: యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, మ్యానేజ్ క్లైంట్ > మై క్లైంట్ పై క్లిక్ చేయండి.
దశ 3: మై క్లైంట్ పేజీలో, మీరు క్రియాశీల మరియు క్రియారహిత క్లయింట్ వివరాలను చూడగలరు. మీ క్లైంట్‌గా టాక్స్‌పేయర్‌ను జోడించడానికి యాడ్ క్లైంట్ ను క్లిక్ చేయండి.
దశ 4: యాడ్ క్లైంట్ పేజీలో, టాక్స్‌పేయర్‌గా PAN ఎంటర్ చేయండి మరియు విలీనం చేసిన తేదీ / పుట్టిన తేదీని ఎంచుకోండి మరియు వాలిడేట్ పై క్లిక్ చేయండి.
దశ 5: ఎంటర్ చేసిన వివరాలను విజయవంతంగా ఎంటర్ చేసిన తరువాత, అదనపు క్లైంట్ తరపున యాక్సెస్ చేయగల వివరాలను మరియు సర్వీసులను సమీక్షించండి.
దశ 6: యాడ్ క్లైంట్ పేజీలో, వాలిడిటీ పీరియడ్ ఎంచుకోండి (వాలిడిటీ మొదలు నుండి చివర వరకు ఎంచుకోవడం ద్వారా) మరియు డిస్‌క్లైమర్ ఎంచుకోవడం ద్వారా టాక్స్‌పేయర్ (క్లైంట్) నుండి సంతకంచేసిన సమ్మతిని నేను తీసున్నాను ఎంచుకోండి మరియు కంటిన్యూ పై క్లిక్ చేయండి.
దశ 7: రిక్వెస్ట్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత, లావాదేవీ ID తో పాటు విజయవంతమైన మెసేజ్ డిస్ప్లే అవుతుంది. భవిష్య సూచన కోసం మీరు లావాదేవీ IDని గమనించవచ్చు. పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ వెరిఫై చేయడానికి ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన టాక్స్‌పేయర్స్ ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు రిక్వెస్ట్ పంపబడుతుంది. టాక్స్‌పేయర్ ఆమోదం పొందిన తరువాత, అతను/ఆమె మీ కోసం క్లైంట్‌గా చేరతారు.
3.2. అన్-రిజిష్టర్డ్ టాక్స్‌పేయర్స్ క్లైంట్స్ గా యాడ్ అవుతారు.
దశ 1: యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, మ్యానేజ్ క్లైంట్ > మై క్లైంట్ పై క్లిక్ చేయండి.
దశ 3: మై క్లైంట్ పేజీలో, మీరు యాక్టిన్ అండ్ ఇన్-యాక్టివ్ క్లైంట్ వివరాలను చూడగలరు. మీ క్లైంట్‌గా టాక్స్‌పేయర్‌ని యాడ్ చేయడానికి యాడ్ క్లైంట్ ను క్లిక్ చేయండి.
దశ 4: వాలిడేట్ డీటైల్స్పేజీలో, టాక్స్ పేయర్ PAN ఎంటర్ చేసి, పుట్టిన తేదీ/విలీనం తేదీని ఎంచుకోండి. ఇ - ఫైలింగ్‌లో రిజిష్టర్ కాని టాక్స్ పేయర్ అనే ఎర్రర్ మెసేజ్ పేజీలో కనిపిస్తుంది. మీరు అతనిని/ఆమెను మీ క్లైంట్‌గా యాడ్ చేయడానికి ముందు టాక్స్‌పేయర్‌ను రిజిష్టర్ చేయాలి. రిజిష్టర్ నౌను క్లిక్ చేయండి.
దశ 5: డిక్లరేషన్ పేజీలో, యాడెడ్ క్లైంట్ తరపున యాక్సెస్ చేయగల సేవలను చూడండి. వాలిడిటీ పీరియడ్ (వాలిడిటీ ఆరంభం నుండి చివరి వరకు గల తేదీలను ఎంచుకోవడం ద్వారా) ఎంచుకోండి మరియు టాక్స్‌పేయర్ (క్లైంట్) సంతకం చేసిన సమ్మతిని నేను తీసుకున్నాను అనే డిస్‌క్లైమర్ ను ఎంచుకోండి మరియు కంటిన్యూ పై క్లిక్ చేయండి.
దశ 6: రిజిస్ట్రేషన్ పేజీలో, పేరు & పుట్టిన తేదీ / విలీనం తేదీ (PAN ఆధారంగా) ప్రాథమిక వివరాలలో ముందుగా-నింపబడి ఉంటాయి. జెండర్ మరియు రెసిడెన్షియల్ స్టేటస్ని ఎంచుకోండి మరియు కంటిన్యూ క్లిక్ చేయండి.
దశ 7: రిజిస్ట్రేషన్ పేజీలో, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID మరియు పోస్టల్ చిరునామా వివరాలను సంప్రదింపు వివరాలు / ప్రాధమిక సంప్రదింపు వివరాలలో నమోదు చేయండి (నమోదు చేసిన PAN కేటగిరీ ఆధారంగా) మరియు కంటిన్యూ పై క్లిక్ చేయండి.
దశ 8: రిక్వెస్ట్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత, లావాదేవీ ID తో పాటు విజయవంతమైన మెసేజ్ డిస్ప్లే అవుతుంది. భవిష్య సూచన కోసం మీరు లావాదేవీ IDని గమనించవచ్చు. పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ వెరిఫై చేయడానికి ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన టాక్స్‌పేయర్స్ ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు రిక్వెస్ట్ పంపబడుతుంది. టాక్స్‌పేయర్ ఆమోదం పొందిన తరువాత, అతను/ఆమె మీ కోసం క్లైంట్‌గా చేరతారు.
3.3. క్లైంట్లుగా TAN యూజర్స్ ను యాడ్ చేయండి
దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, మ్యానేజ్ క్లైంట్ > మై క్లైంట్ పై క్లిక్ చేయండి.
దశ 3: మై క్లయింట్ పేజీలో, మీరు యాక్టివ్ అండ్ ఇన్-యాక్టివ్ క్లయింట్ వివరాలను చూడగలరు. మీ కైంట్‌గా టాక్స్‌పేయర్‌ను యాడ్ చేయడానికి యాడ్ క్లైంట్ ను క్లిక్ చేయండి.
దశ 4: యాడ్ క్లైంట్ పేజీలో, సెలక్ట్ యూజర్ టైప్లో, TAN ను ఎంచుకోండి, సంస్థ యొక్క TAN ను ఎంటర్ చేయండి మరియు TAN కేటాయింపు తేదీని ఎంచుకోండి మరియు వాలిడేట్ క్లిక్ చేయండి.
దశ 5: యాడ్ క్లైంట్ పేజీలో, యాడెడ్ క్లైంట్ తరపున యాక్సెస్ చేయగల సేవలను చూడండి. వాలిడిటీ పీరియడ్ (వాలిటిడీ మొదలయిన తేదీ నుండి చివరి వరకు ఎంచుకోవడం ద్వారా) ఎంచుకోండి మరియు క్లైంట్ నుండి సంతకం చేసిన సమ్మతిని నేను తీసుకున్నాను అనే డిస్‌క్లైమర్ ఎంచుకోండి మరియు కంటిన్యూ పై క్లిక్ చేయండి.
దశ 6: రిక్వెస్ట్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత, లావాదేవీ ID తో పాటు విజయవంతమైన మెసేజ్ డిస్ప్లే అవుతుంది. భవిష్య సూచన కోసం మీరు లావాదేవీ IDని గమనించవచ్చు. పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ వెరిఫై చేయడానికి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిష్టర్ చేయబడిన TAN యూజర్ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు రిక్వెస్ట్ పంపిస్తారు. TAN యూజర్ ఆమోదం తరువాత, అతను/ఆమె మీ కోసం క్లైంట్‌గా చేరతారు.