Do not have an account?
Already have an account?

1. అవలోకనం

దిద్దుబాటు అభ్యర్థన సేవ వీరికి అందుబాటులో ఉంది:

  • పన్ను చెల్లింపుదారులందరూ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు
  • రిజిస్టర్ అయిన ERI వినియోగదారులు / రిజిస్టర్ అయిన అధీకృత సంతకదారులు / రిజిస్టర్ అయిన ప్రతినిధి మదింపుదారులు (పన్ను చెల్లింపుదారు ఎవరైనా ఒకరిని నిమగ్నo చేయాలనుకుంటే మాత్రమే వర్తిస్తుంది)

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ప్రాసెస్ చేసిన రిటర్న్‌ల కోసం CPC పంపిన సమాచారం లేదా పాస్ చేసిన ఆర్డర్‌లో రికార్డు నుండి స్పష్టంగా కనిపించే ఏదైనా పొరపాటును సరిదిద్దడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.

2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు

  • చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారు
  • రిజిస్టర్ అయిన పన్ను చెల్లింపుదారుల కోసం (లేదా పన్ను చెల్లింపుదారు తరపున అధీకృత సంతకదారు / ప్రతినిధి మదింపుదారు):
    • CPC, బెంగళూరు నుండి ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 143(1) ప్రకారం లేదా సంపద పన్ను చట్టం యొక్క సెక్షన్ 16(1) ప్రకారం సమాచారం అందిoది
    • My ERI సేవను ఉపయోగించి ERI ని జోడించండి (పన్ను చెల్లింపుదారు ERIలో పాల్గొనాలనుకుంటే మాత్రమే వర్తిస్తుంది)
  • నమోదిత ERI వినియోగదారుల కోసం:
    • యాడ్ క్లయింట్ సేవను ఉపయోగించి పన్ను చెల్లింపుదారుని క్లయింట్‌గా జోడించండి
    • ERI స్థితి చురుకుగా ఉంది
  • నమోదిత పన్ను చెల్లింపుదారులు మరియు నమోదిత ERI వినియోగదారులు ఇద్దరూ:
    • డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) ఎంపికను ఉపయోగించి పని చేయడానికి చెల్లుబాటు అయ్యే DSCని ఇ-ఫైలింగ్‌లో నమోదు చేయండి (గడువు ముగియని); లేదా
    • EVCని రూపొందించండి

3. దశలవారీ మార్గదర్శిని

దశ 1: మీ చెల్లుబాటు అయ్యే వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive


దశ 2: క్లిక్ చేయండి సేవలు >సరిదిద్దడం.

Data responsive


దశ 3: సరిదిద్దే పేజీలో, కొత్త అభ్యర్థనను క్లిక్ చేయండి.

Data responsive


దశ 4a: కొత్త అభ్యర్థన పేజీలో, మీ PAN స్వయంచాలకంగా పూరించబడుతుంది. ఆదాయపు పన్నులేదా సంపద పన్నును ఎంచుకోండి.

Data responsive


దశ 4b: మదింపు సంవత్సరం డ్రాప్ డౌన్ నుండి ఎంపిక చేసుకోండి. కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


గమనిక: ఒకవేళ మీరు సంపద పన్ను ఎంపిక ఎంచుకున్నట్లయితే, మీరు సరికొత్త సమాచారం సూచన సంఖ్యను కూడా నమోదు చేయాలి, మరియు కొనసాగించండిక్లిక్ చేయాలి.

Data responsive


దశ 5: సరిదిద్దుటకై అభ్యర్థనలకు క్రింది వర్గీకరణ ఉంటుంది
 

ఆదాయపు పన్ను సరిదిద్దడం

రిటర్న్‌ను మళ్ళీ ప్రాసెస్ చేయండి

సెక్షన్ 5.1 చూడండి

పన్ను క్రెడిట్ అసమతుల్యత దిద్దుబాటు

సెక్షన్ 5.2 చూడండి

234C వడ్డీకి అదనపు సమాచారం

సెక్షన్ 5.3 చూడండి

స్థితి దిద్దుబాటు

సెక్షన్ 5.4 చూడండి

మినహాయింపు విభాగం దిద్దుబాటు

సెక్షన్ 5.5 చూడండి

రిటర్న్ డేటా సవరణ (ఆఫ్‌లైన్)

సెక్షన్ 5.6a చూడండి

రిటర్న్ డేటా సవరణ (ఆన్ లైన్)

సెక్షన్ 5.6b చూడండి

సంపద పన్ను సరిదిద్దడం

రిటర్న్‌ను మళ్ళీ ప్రాసెస్ చేయండి

సెక్షన్ 5.7 చూడండి

పన్ను క్రెడిట్ అసమతుల్యత దిద్దుబాటు

సెక్షన్ 5.8 చూడండి

రిటర్న్ డేటా సవరణ (XML)

సెక్షన్ 5.9 చూడండి


గమనిక: AY 2014-15 మరియు AY 2015-16 కోసం మాత్రమే ఈ సేవను ఉపయోగించి సంపద పన్ను రిటర్న్ యొక్క దిద్ధుబాటుకై ఫైల్ చేయవచ్చు.

ఆదాయపు పన్ను సరిదిద్దు అభ్యర్థన

5.1 ఆదాయపు పన్ను సరిదిద్దడం: రిటర్న్ ను తిరిగి ప్రాసెస్ చేయండి

దశ 1: రిటర్న్‌ని రీప్రాసెస్ చేయడం అనే అభ్యర్థన రకాన్ని ఎంచుకోండి.

Data responsive


దశ 2: ఈ ఎంపికతో, మీరు సరిదిద్దడానికి అభ్యర్థనను సమర్పించాలి - అభ్యర్థన సమర్పించడానికి కొనసాగించండి క్లిక్ చేయండి.

దశ 3: మీ అభ్యర్థన సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.


5.2: ఆదాయపు పన్ను సరిదిద్దడం: పన్ను క్రెడిట్ అసమతుల్యత సవరణ

దశ1: అభ్యర్థన రకాన్ని పన్ను క్రెడిట్ అసమతుల్యత సవరణగా ఎంచుకోండి.

Data responsive


దశ 2: ఈ అభ్యర్థన రకం కింద షెడ్యూల్‌లు సంబంధిత ప్రాసెస్ చేయబడిన రిటర్న్‌లో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా ఆటో పాపులేట్ చేయబడతాయి. ఒకవేళ మీరు షెడ్యూలుని సవరించడం లేదా తొలగించవలసి వస్తే, షెడ్యూల్ ఎంచుకుని, తరువాత సవరించండి లేక తొలగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: కింది షెడ్యూల్‌ల క్రింద వివరాలను నమోదు చేయండి: జీతం వివరాలపై మూలంలో తీసివేయబడిన పన్ను (TDS), వేతన వివరాలపై కాకుండా ఇతర మూలంలో తీసివేయబడిన పన్ను (TDS), స్థిరాస్తి/అద్దె బదిలీపై మూలంలో తీసివేయబడిన పన్ను (TDS), మూలంలో వసూలు చేయబడిన పన్ను (TCS), ముందస్తు పన్ను లేదా స్వీయ మదింపు పన్ను వివరాలు. డ్రాఫ్ట్ గా సేవ్ చేయండి పైన క్లిక్ చేయండి.

Data responsive


దశ 4: అభ్యర్థన సమర్పించడానికి కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 5: సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.


5.3 ఆదాయపు పన్ను సవరణ: 234C వడ్డీకి అదనపు సమాచారం

దశ 1: 234C వడ్డీ కోసం అభ్యర్థన రకాన్ని అదనపు సమాచారంగా ఎంచుకోండి.

Data responsive


దశ 2: ఈ క్రింది రికార్డుల్లో మీకు వర్తించే ఎదో ఒక దానిలో వివరాలు జోడించండి క్లిక్ చేయండి:

  • PGBP నుంచి ఆదాయం సమకూరు లేదా లేవనెత్తు, మొదటిసారి (దీనికి వర్తించే 2016-17 నుండి)
  • 2(24)(ix) లో పేర్కొన్న ప్రత్యేక ఆదాయం సెక్షన్ 115B ప్రకారం పన్ను విధించదగినది
  • 115BBDA సెక్షన్ లో సూచించబడిన ఆదాయం (వర్తించే 2017-18 నుండి )
Data responsive


దశ 3: మీరు పూర్తి చేసిన రికార్డును సవరించడం లేదా తొలగించాల్సి వస్తే, సవరించండి లేక తొలగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 4: మీ అభ్యర్థన సమర్పించడానికి కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 5: మీ అభ్యర్థన సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.

5.4 ఆదాయపు పన్ను సరిదిద్దడం అభ్యర్థన: స్థితి దిద్దుబాటు

దశ1: అభ్యర్థన రకాన్ని స్థితి దిద్దుబాటుగా ఎంచుకోండి.

Data responsive


గమనిక: AY 2018-19 వరకు ITR-5 మరియు ITR-7కి మాత్రమే స్థితి సవరణ వర్తిస్తుంది.

దశ 2: జాబితా నుంచి మీకు వర్తించే స్థితి ఎంచుకోండి:

  • ప్రైవేట్ విచక్షణాయుతమైన ట్రస్టు
  • సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 లేదా రాష్ట్ర సంబంధిత చట్టం కింద రిజిస్టర్ చేయబడిన సొసైటీ
  • మరణించిన వారి ఆస్తి
  • ఏదైనా ఇతర ట్రస్టు లేదా సంస్థ
  • ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం/ప్రాథమిక సహకార వ్యవసాయ బ్యాంకు
  • గ్రామీణ అభివృద్ధి బ్యాంక్
  • ఇతర సహకార బ్యాంక్
Data responsive


దశ 3: పైన వివరాలను జోడించు పేజీలో, వర్తించే విధంగా అవును / కాదు ఎంపికలను ఎంచుకోవడం ద్వారా జాబితా చేయబడిన అదనపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


మీరు ఎంచుకున్న స్థితి దిద్దుబాటుకి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి రావచ్చు. వివరాలును జోడించండి పేజీలో, ఆటాచ్మెంట్ క్లిక్ చేసి, అవసరమైన పత్రం(లు) అప్ లోడ్ చేయండి, ఇవి PDF ఫార్మాట్ లో ఉండాలి. కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


గమనిక:

  • ఒకే అటాచ్‌మెంట్ గరిష్ట పరిమాణం 5 MB ఉండాలి.
  • అప్‌లోడ్ చేయడానికి మీకు ఎక్కువ పత్రాలు ఉన్నట్లయితే, వాటిని జిప్ ఫోల్డర్‌లో ఉంచి ఫోల్డర్‌ని అప్‌లోడ్ చేయండి. జిప్ ఫోల్డర్‌లోని అన్ని అటాచ్మెంట్‌ల(జోడింపులు) గరిష్ట సైజు 50 MBగా ఉండాలి.

దశ 4: మీ అభ్యర్థన సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్ చూడండి.

5.5 ఆదాయపు పన్ను సరిదిద్దడం: మినహాయింపు విభాగం దిద్దుబాటు

దశ 1: అభ్యర్థన రకాన్ని మినహాయింపు విభాగం దిద్దుబాటు గా ఎంచుకోండి.

Data responsive


గమనిక: మినహాయింపు విభాగం దిద్దుబాటు వివరాలు AY 2013-14నుండి A.Y 2018-19 వరకు ITR-7కి మాత్రమే వర్తిస్తాయి.


దశ2: మీ వివరాలను జోడించు పేజీలో, కింది అన్ని ఫీల్డ్‌లలో మీ వివరాలను నమోదు చేయండి: ప్రాజెక్ట్‌లు/సంస్థ పేరు, ఆమోదం/నోటిఫికేషన్/రిజిస్ట్రేషన్ నంబర్, ఆమోదం/నమోదు చేసే అధికారం మరియు సంస్థ మినహాయింపును క్లెయిమ్ చేసిన విభాగం. అవసరమైన సపోర్టింగ్ పత్రం(లు)ని PDF ఫార్మాట్ లో అప్ లోడ్ చేయడానికి ఆటాచ్మెంట్ క్లిక్ చేయండి. అభ్యర్థన సమర్పించడానికి కొనసాగించండి క్లిక్ చేయండి

Data responsive


గమనిక: ఒకే అటాచ్ మెంట్ గరిష్ఠంగా సైజు 5 MB.

దశ 3: మీ అభ్యర్థన సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.


5.6a ఆదాయపు పన్ను సరిదిద్దడం: రిటర్న్ డేటా దిద్దుబాటు (ఆఫ్ లైన్)

దశ1: రిటర్న్ డేటా కరెక్షన్ (ఆఫ్‌లైన్)గా అభ్యర్థన రకాన్ని ఎంచుకోండి.

Data responsive


దశ 2: వర్తించే సరిదిద్దడం కారణాలను ఎంచుకోండి - ఒకవేళ వర్తిస్తే, ప్రతి వర్గం కింద మీరు బహుళ కారణాలను ఎంచుకోవచ్చు. తరువాత, కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: మార్చాల్సిన షెడ్యూల్స్ ఎంచుకోండి, తరువాత కొనసాగించండిక్లిక్ చేయండి.

Data responsive


దశ4: అటాచ్‌మెంట్‌ని క్లిక్ చేసి, ITR ఆఫ్‌లైన్ యుటిలిటీ నుండి జనరేట్ అయిన రెక్టిఫికేషన్ XML/JSONని అప్‌లోడ్ చేయండి.

Data responsive


గమనిక: ఒకే అటాచ్ మెంట్ గరిష్ఠంగా సైజు 5 MB.

దశ 5: వర్తిస్తే విరాళం మరియు మూలధన లాభాల వివరాలను నమోదు చేయండి.

Data responsive


దశ6:అభ్యర్థన సమర్పించడానికి కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 7: సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ని చూడండి.


దశ 5.6b ఆదాయపు పన్ను సరిదిద్దడం: రిటర్న్ డేటా సవరణ (ఆన్‌లైన్)

దశ 1: రిటర్న్ డేటా కరెక్షన్ (ఆన్‌లైన్)గా అభ్యర్థన రకాన్ని ఎంచుకోండి.

Data responsive


దశ2: సరిదిద్దడానికి కారణాలను ఎంచుకోండి - మీకు వర్తిస్తే, ప్రతి వర్గం క్రింద బహుళ కారణాలు ఎంచుకోవచ్చు. తరువాత, కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: వర్తించే షెడ్యూలు(లు) క్రింద వివరాలను సరిచేయడానికి వివరాలు జోడించండిపైన క్లిక్ చేయండి.

Data responsive


దశ 4: మీరు అన్ని షెడ్యూల్‌లను అప్‌డేట్ చేయడం పూర్తి చేసిన తరువాత, కొనసాగించండిక్లిక్ చేయండి.

Data responsive


దశ 5: సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ని చూడండి.

 

సంపద పన్ను సవరణ అభ్యర్థన


5.7 సంపద పన్ను సరిదిద్దడం: రిటర్న్ ను తిరిగి ప్రాసెస్ చేయండి

దశ 1: అభ్యర్థన రకాన్ని ఇలా ఎంచుకోండి రిటర్న్ మళ్ళీ ప్రాసెస్ చేయండి.

Data responsive


గమనిక: కేంద్ర బడ్జెట్ 2016-17లో సంపద పన్ను రద్దు చేయబడినందున, ఈ అభ్యర్థన AY 2014-15 మరియు 2015-16కి మాత్రమే అందుబాటులో ఉంది.

దశ 2: పన్ను/వడ్డీ లెక్కింపు ఎంపికచేసుకోండి మరియు సమర్పించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ని చూడండి.


5.8 సంపద పన్ను సరిదిద్దడం: పన్ను క్రెడిట్ అసమతుల్యత సవరణ

దశ 1:
అభ్యర్ధన రకాన్ని పన్ను క్రెడిట్ అసమతుల్యత దిద్దుబాటుగా ఎంచుకోండి.

Data responsive


దశ 2: మీ ప్రాసెస్ చేయబడిన రిటర్న్ నుండి వివరాలు ఎడిటింగ్ మరియు దిద్దుబాటు కోసం ప్రదర్శించబడతాయి. మీరు ఒక రికార్డ్ ను సవరించడం లేదా తొలగించాల్సి వస్తే, సవరించండి లేక తొలగించండి క్లిక్ చేయండి. ఒకవేళ మీ రికార్డ్ అసంపూర్ణంగా ఉన్నట్లయితే, వివరాలు జోడించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ3:అభ్యర్థన సమర్పించడానికి కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive


దశ 4: సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ని చూడండి.

 

5.9 సంపద పన్ను సవరణ: రిటర్న్ డేటా దిద్దుబాటు (XML)

దశ1: అభ్యర్థన రకాన్ని రిటర్న్ డేటా సవరణ (XML) గా ఎంచుకోండి.

Data responsive


దశ 2: టెక్స్ట్ బాక్స్‌లో సవరణ కారణాన్ని నమోదు చేయండి మరియు ITR ఆఫ్‌లైన్ యుటిలిటీ నుండి జనరేట్ అయిన దిద్దుబాటు XMLని అప్‌లోడ్ చేయడానికి అటాచ్‌మెంట్ క్లిక్ చేయండి. తరువాత, సమర్పించండి క్లిక్ చేయండి.

Data responsive

గమనిక: ఒక అటాచ్ మెంట్ యొక్క గరిష్ట సైజు 5 MB.


దశ 4: సమర్పించిన తర్వాత, మీరు ఇ-వెరిఫికేషన్పేజీకి వెళ్తారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ని చూడండి.


విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మీ అభ్యర్థన సమర్పించబడుతుంది. విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేసుకున్న మీ ఇ-మెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశాన్ని కూడా అందుకుంటారు.

Data responsive

4. సంబంధిత అంశాలు