1. అవలోకనం
కొత్తగా నెలకొల్పిన దేశీయ తయారీ కంపెనీలకు కొన్ని షరతులకు లోబడి ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 115 BAA మరియు 115BAB కింద రాయితీ పన్ను రేటు 15% (వర్తించే అదనపు సర్‌చార్జి మరియు సెస్ తో కలిపి) వద్ద పన్ను చెల్లించే అవకాశం ఉంది. మదింపు సంవత్సరం 2020-21 నుండే కంపెనీలు రాయితీ పన్ను రేట్లను ఎంచుకోవచ్చు.
సెక్షన్ 115BAB ప్రకారం పన్ను చెల్లించటానికి రాయితీ పన్ను రేట్లను ఎంచుకున్నందుకు, ప్రయోజనం పొందటానికి, 1 ఏప్రిల్ 2020న లేదా అంతకు ముందుగా వచ్చే మొదటి మదింపు సంవత్సరం కోసం రిటర్న్ దాఖలు చేయటానికి సెక్షన్ 139 లోని ఉపసెక్షన్ [1] కింద సూచించిన గడువు తేదీన లేదా అంతకు ముందు ఫారం 10-ID తప్పనిసరిగా దాఖలు చేయాలి. అటువంటి ఎంపిక ఒకసారి అమలు చేసిన తరువాత అది తరువాతి మదింపు సంవత్సరాలకు వర్తిస్తుంది. దానిని ఉపసంహరించుకోలేము.
ఫారం 10-ID ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే సమర్పించాలి.
2. ఈ సేవను పొందడానికి అవసరమైనవి
- చెల్లుబాటు అయ్యే వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన వినియోగదారుడు
- చెల్లుబాటు అయ్యే క్రియాశీల డిజిటల్ సంతకం సర్టిఫికేట్ (ఇ-ధృవీకరణ చెయ్యడానికి) అవసరం
- వినియోగదారుడు కొత్త తయారీ దేశీయ కంపెనీ
- నెలకొల్పబడిన తేదీ 1 అక్టోబర్ 2019 లేదా తరువాత మరియు 31 మార్చి 2023 తేదీన లేదా అంతకు ముందు ఉంటుంది,
- గత మదింపు సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయలేదు
- చట్టంలోని సెక్షన్ 139[1] ప్రకారం రిటర్న్ దాఖలు చేయటానికి కాలపరిమితి గడువు ముగిసిపోలేదు.
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115BAB ప్రకారం, కొత్త ఉత్పాదక దేశీయ కంపెనీలు కొన్ని నిర్ణీత షరతులను నెరవేర్చడానికి లోబడి 15 % (అదనంగా సర్‌చార్జి మరియు సెస్) తగ్గింపు పన్ను రేటుతో పన్ను చెల్లించే అవకాశం ఉపయోగించవచ్చు.
మునుపటి సంవత్సరంలో నిర్దేశించిన షరతులను కంపెనీ సంతృప్తి పరచడంలో విఫలమైతే, ఆ మునుపటి సంవత్సరానికి మరియు తరువాతి సంవత్సరాలకి ఈ ఎంపిక చెల్లదు మరియు మునుపటి సంవత్సరానికి మరియు తరువాతి సంవత్సరాలకు చట్టం యొక్క ఇతర నిబంధనలు కంపెనీకి ఎంపికను ఉపయోగించని విధంగా వర్తిస్తాయి.
3.2 దాన్ని ఎవరు ఉపయోగించవచ్చు?
1 అక్టోబరు 2019న లేదా తరువాత నెలకొల్పబడిన కొత్త తయారీ దేశీయ సంస్థగా నమోదు చేయబడిన మరియు 31 మార్చి 2023 తేదీన లేదా అంతకు ముందు ఒక ఆర్టికల్ లేదా వస్తువు తయారీ లేదా ఉత్పత్తి ప్రారంభించిన వినియోగదారులందరూ.
4. ఫారం అవలోకనం
ఫారం 10-ID లో మూడు విభాగాలు ఉన్నాయి:
- మదింపు అధికారుల వివరాలు
- ప్రాథమిక సమాచారం
- ధృవీకరణ
4.1 మదింపు అధికారి వివరాలు
మొదటి సెక్షన్ లో మీ మదింపు అధికారి వివరాలు ఉన్నాయి. మీరు పేజీలో ప్రదర్శించబడే మదింపు అధికారి వివరాలను ధృవీకరించాలి.
4.2 ప్రాథమిక సమాచారం
తదుపరి విభాగంలో దేశీయ కంపెనీ [వ్యక్తిగత సమాచారం మరియు వ్యాపార కార్యకలాపాల స్వభావంతో సహా] కి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఉన్నాయి.మీరు తయారీ కార్యకలాపాలు ప్రారంభించిన తేదీని, వ్యాపార స్వభావం వంటి వివరాలను ఎంచుకోవాలి.
4.3 ధృవీకరణ
చివరి విభాగంలో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115BAB ప్రకారం ప్రమాణాలతో కూడిన స్వీయ ధృవీకరణ ఫారం ఉంది. ధృవీకరణ పేజీలో ప్రదర్శించబడే షరతులు, నిబంధనలకు అంగీకరించండి
5 ఎలా యాక్సెస్ చేసి సమర్పించాలి?
మీరు ఈ క్రింది పద్ధతి ద్వారా ఫారమ్ 10-IDని నింపి సమర్పించవచ్చు:
- ఆన్‌లైన్ విధానం- ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా
ఫారమ్ 10-IDని ఆన్‌లైన్ విధానం ద్వారా పూర్తిచేసి సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి.
5.1 ఫారం 10-ID సమర్పించడం (ఆన్‌లైన్ విధానం)
దశ 1: మీ వినియోగదారుని ఐడి, పాస్‌వర్డ్ లు ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, ఇ-ఫైల్> లో ఆదాయపు పన్ను ఫారాలు>ఆదాయపు పన్ను ఫారాలు దాఖలు చేయండి పై క్లిక్ చేయండి.
దశ 3: ఆదాయపు పన్ను ఫారంలు దాఖలు చేయండిపేజీలో, ఫారం 10-IDని ఎంచుకోండి.ప్రత్యామ్నాయంగా, ఫారంను దాఖలు చేయడానికి శోధన పెట్టెలో ఫారం 10-ID అని నమోదు చేయండి.
దశ 4: ఫారమ్ 10-ID పేజీలో, మదింపు సంవత్సరం (A.Y.) ను ఎంచుకోండి మరియు కొనసాగించు పై క్లిక్ చేయండి.
దశ 5: సూచనలు పేజీలో,మనం ఇక ప్రారంభిద్దాం అని క్లిక్ చేయండి.
దశ 6: మనం ఇక ప్రారంభిద్దాం పై క్లిక్ చేసినప్పుడు, ఫారం 10-ID ప్రదర్శించబడుతుంది. అవసరమైన అన్ని వివరాలను నింపండి మరియు ప్రివ్యూను క్లిక్ చేయండి.
దశ 7: ప్రివ్యూ పేజీలో, వివరాలను ధృవీకరించి, ఇ-వెరిఫై చేయడానికి కొనసాగండి పై క్లిక్ చేయండి.
దశ 8: సమర్పించడానికి అవును క్లిక్ చేయండి.
దశ 9: అవును క్లిక్ చేయడం ద్వారా, మీరు డిజిటల్ సంతకం సర్టిఫికేట్ ఉపయోగించి ధృవీకరించగల ఇ-వెరిఫై పేజీకి తీసుకెళ్లబడతారు.
గమనిక: మరింత తెలుసుకోవడానికి ఎలా ఇ -ధృవీకరణ చెయ్యాలి తెలుసుకోవడానికివినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
ఇ-వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత, లావాదేవీ గుర్తింపు ID మరియు రశీదు నెంబరుతో పాటు విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ గుర్తింపు ID మరియు రశీదు సంఖ్యను భద్రపరచుకోండి. మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన ఇ-మెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌పై ధృవీకరణ సందేశాన్ని కూడా అందుకుంటారు.
6. సంబంధిత అంశాలు
- లాగిన్ చేయండి
- డ్యాష్‌బోర్డ్ మరియు వర్క్‌లిస్ట్
- ఇ-వెరిఫై ఎలా చేయాలి?
- ఆదాయపు పన్ను ఫారాలు (అప్లోడ్ చేయండి)
- ఈ.వీ.సి. ని రూపొందించండి
- డి.ఎస్.సి. ని నమోదు చేయండి
- ప్రతినిధిగా అధికారం ఇచ్చి నమోదు చేయండి
- ITR 1 ఫారం - సహజ్ దాఖలు చేయండి
- ITR 2 ఫారం దాఖలు చేయండి
- ITR 3 ఫారం దాఖలు చేయండి
- ITR 4 ఫారం -సుగం దాఖలు చేయండి