Do not have an account?
Already have an account?

1. అవలోకనం


ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన వినియోగదారులకు ITR-2 ముందుగా నింపు మరియు దాఖలు సేవ అందుబాటులో ఉంది. ఈ సేవ ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ITR-2 ఆన్‌లైన్‌లో దాఖలు చేయడానికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను అనుమతిస్తుంది. ఆన్‌లైన్ విధానం ద్వారా ITR-2 దాఖలును ఈ వినియోగదారు మాన్యువల్ కవర్ చేస్తుంది.

2. ఈ సేవను పొందడానికి అవసరమైనవి

సాధారణ
  • చెల్లుబాటు అయ్యే వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన వినియోగదారుడు
  • పాన్ స్థితి క్రియాశీలకంగా ఉంది
ఇతరులు
  • పాన్ మరియు ఆధార్‌ను అనుసంధానం చేయండి
  • ముందస్తుగా కనీసం ఒక బ్యాంకు ఖాతాను ధృవీకరించి, రీఫండ్ కోసం నామినేట్ చేయండి (సిఫార్సు చేయబడింది)
  • ఆధార్ / ఇ-ఫైలింగ్ పోర్టల్ / మీ బ్యాంక్ / NSDL /CDSL (ఇ-ధృవీకరణ కోసం) తో లింక్ చేయబడిన చెల్లుబాటయ్యే మొబైల్ నంబర్
  • ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్‌లోడ్ చేయండి లేదా (ఆఫ్‌లైన్ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లయితే) మూడవ విధానపు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి

ఫారం సమర్పించే ముందు మీరు పూర్తిచెయ్యాల్సిన విభాగాలు ITR-2లో ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ సారాంశ విభాగంలో మీ పన్ను గణనను సమీక్షించి పన్ను చెల్లించి, చివరకు ధృవీకరణ కోసం రిటర్న్ సమర్పించండి:

3.1 భాగం A సాధారణ వివరాలు
3.2 జీతం షెడ్యూల్
3.3ఇంటి ఆస్తి షెడ్యూల్
3.4 మూలధన లాభాల షెడ్యూల్
3.5 షెడ్యూల్ 112 A, షెడ్యూల్ - 115AD (1) (iii) నిబంధన ప్రకారం
3.6 ఇతర ఆదాయ వనరుల షెడ్యూల్
3.7 CYLA షెడ్యూల్
3.8 BFLA షెడ్యూల్
3.9 CFL షెడ్యూల్
3.10 VI-A షెడ్యూల్
3.11షెడ్యూల్ 80G, 80 GGA షెడ్యూల్
3.12 ఆల్టర్నేటివ్ మినిమమ్ టాక్స్ (AMT) షెడ్యూల్
3.13 AMTC షెడ్యూల్
3.14 SPI షెడ్యూల్
3.15షెడ్యూల్ SI
3.16 షెడ్యూల్ EI
3.17 షెడ్యూల్ PTI
3.18 షెడ్యూల్ FSI
3.19 షెడ్యూల్ TR
3.20 షెడ్యూల్ FA
3.21 షెడ్యూల్ 5A
3.22 షెడ్యూల్ AL
3.23 పార్ట్ B - మొత్తం ఆదాయం (TI)
3.24 చెల్లించిన పన్ను
3.25 పార్ట్ B-TTI

3.1 భాగం A సాధారణ
ఫారం లోని భాగం A సాధారణ విభాగంలో, మీరు మీ ఇ-ఫైలింగ్ ప్రొఫైల్ నుండి ముందుగా నింపిన డేటాను ధృవీకరించాలి. మీరు మీ వ్యక్తిగత డేటాలో కొంత భాగం నేరుగా ఫారంలో ఎడిట్ చేయలేరు. అయితే, మీరు ఇ-ఫైలింగ్ ప్రొఫైల్‌కు వెళ్లడం ద్వారా అవసరమైన మార్పులు చేయగలరు. మీరు మీ పరిచయ వివరాలను, ఫైలింగ్ స్థితి, నివాస స్థితి మరియు బ్యాంక్ వివరాలను ఫారంలోనే సవరించవచ్చు.

3.2 జీతం షెడ్యూల్
షెడ్యూల్ జీతంలో , మీరు జీతం / పెన్షన్, సెక్షన్ 16 కింద మినహాయింపు భత్యాలు, తగ్గింపుల నుండి మీ ఆదాయం యొక్క వివరాలను సమీక్షించాలి / నమోదు చేయాలి / సవరించాలి. .

3.3 ఇంటి ఆస్తి షెడ్యూల్
ఇంటి ఆస్థి షెడ్యూల్ లో, మీరు ఇంటి ఆస్తి ( స్వీయ - ఆక్రమిత, అద్దెకు ఇచ్చిన లేదా అద్దెకు ఇచ్చినట్లు భావించినట్లు] సంబంధించిన వివరాలను సమీక్షించి / నమోదు చేయాలి / సవరించాలి ). వివరాలలో సహ యజమాని వివరాలు, అద్దెదారు వివరాలు, అద్దె, వడ్డీ, పాస్ థ్రూ ఆదాయం మొదలైనవి ఉండాలి.

3.4 CG - మూలధన లాభాల షెడ్యూల్
వివిధ రకాల మూలధన ఆస్తుల అమ్మకం / బదిలీ ద్వారా ఉత్పన్నమయ్యే మూలధన లాభాలు విభజించబడ్డాయి. ఒకటి కంటే ఎక్కువ ఒకే రకమైన మూలధన ఆస్తుల అమ్మకం లేదా బదిలీ ద్వారా మూలధన లాభాలు వచ్చినట్లయితే, అన్ని మూలధన ఆస్తులకు ఒకే విధంగా మూలధన లాభాలను ఏకీకృతంగా లెక్కించాలి. కానీ భూమి / భవనం బదిలీ విషయంలో, ప్రతి భూమి / భవనాల గణనలోకి నమోదు చేయడం తప్పనిసరి. షెడ్యూల్ మూలధన లాభాలు లో, మీ దగ్గర ఉన్న అన్ని రకాల మూలధన ఆస్తుల (స్వల్పకాలిక, దీర్ఘకాలిక) మూలధన లాభాలు / నష్టాల వివరాలను నమోదు చేయాలి.

3.5 షెడ్యూల్ 112 A మరియు షెడ్యూల్ - 115 AD(1) (iii) నిబంధన

  • షెడ్యూల్ 112A లో, మీరు ఒక కంపెనీకి చెందిన ఈక్విటీ షేర్ల అమ్మకం, ఈక్విటీ ఆధారిత ఫండ్ లేదా STT చెల్లించే వ్యాపార ట్రస్ట్ యొక్క యూనిట్ గురించి వివరాలను సమీక్షించాలి / నమోదు చేయాలి / సవరించాలి.
  • షెడ్యూల్ 115 AD (1) (iii) నిబంధనలో షెడ్యూల్ 112A మాదిరిగానే ప్రవాసులకు వర్తించే వివరాలనే నమోదు చేయాలి.

గమనిక: 31వ తేదీ జనవరిన లేదా అంతకు ముందు షేర్లు కొనుగోలు చేసినట్లయితే.2018, షెడ్యూల్ 112A మరియు షెడ్యూల్ - 115 AD (1) (iii) లలోని నిబంధనల ప్రకారం బదిలీ అయ్యే ప్రతీ స్క్రిప్ కు చెందిన వివరాలను నమోదు చేయడం తప్పనిసరి.

3.6 షెడ్యూల్ ఇతర వనరులు
షెడ్యూల్ ఇతర వనరులు విభాగంలో, ఇతర వనరుల నుండి మీరు మీ అన్ని ఆదాయ వివరాలను సమీక్షించాలి / నమోదు చేయాలి / సవరించాలి, వీటిలో ప్రత్యేక రేట్లపై పై విధించగల ఆదాయం, సెక్షన్ 57 కింద తగ్గింపులు, మరియు రేసు గుర్రాలతో కూడిన ఆదాయం ఉండాలి (కానీ పరిమితం కాదు).

3.7 షెడ్యూల్‌ ప్రస్తుత సంవత్సర నష్టాల సర్దుబాటు ( CYLA )
ప్రస్తుత సంవత్సర నష్టాల సర్దుబాటు (CYLA) షెడ్యూల్ లో, మీరు ప్రస్తుత సంవత్సర నష్టాల సెటాఫ్ తర్వాత ఆదాయ వివరాలను చూడవచ్చు. దీని నుండి ముందుకు తీసుకెళ్లడానికి అనుమతించిన గ్రహించని నష్టాలను, భవిష్యత్ సంవత్సరాలకు ముందుకు సాగడానికి వీలుగా సి.ఎఫ్.ఎల్. షెడ్యూల్ కి చేర్చబడతాయి.

3.8 ముందుకు కొనసాగిన నష్టాల సర్దుబాటు (బి.ఎఫ్.ఎల్.ఎ.] ను షెడ్యూల్.
షెడ్యూల్‌ కొనసాగిన నష్టం సర్దుబాటు (BFLA]లో తీసుకురాబడిన మునుపటి సంవత్సరాల నుండి ముందుకు కొనసాగిన నష్టాలు సెటాఫ్ అయిన తర్వాత ఆదాయ వివరాలను చూడవచ్చు.

3.9 క్యారీ ఫార్వార్డ్ నష్టాలు (CFL) షెడ్యూల్
షెడ్యూల్‌ క్యారీ ఫార్వర్డ్ నష్టాలు (CFL)లో భవిష్యత్ సంవత్సరాల్లో ముందుకు కొనసాగే నష్టాల వివరాలను మీరు చూడవచ్చు.

3.10 షెడ్యూల్ VI-A
షెడ్యూల్ VI -Aలో, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 - భాగాలు B, C, CA, మరియు D (దిగువ వివరించిన విధంగా ఉప విభాగాలు) కింద క్లెయిమ్ చేయవలసిన ఏవైనా తగ్గింపులను జోడించి ధృవీకరించాలి.

గమనిక: ఏప్రిల్ 1 వ తేదీ2020 నుండి జులై 31 2020 మధ్య పెట్టుబడి / జమ / చెల్లింపుల చేసినట్లయితే, అప్పటికే మ.సం. 20 - 21 లో తగ్గింపులు క్లెయిమ్ చేస్తే, మళ్ళీ క్లెయిమ్ చేయలేరు.

3.11షెడ్యూల్ 80G మరియు షెడ్యూల్ 80 GGA
షెడ్యూల్ 80G మరియు షెడ్యూల్ 80GGA లో, సెక్షన్ 80G మరియు సెక్షన్ 80GGA కింద తగ్గింపు కోసం అర్హత ఉన్న విరాళాల వివరాలను మీరు అందించాలి.

3.12 AMT షెడ్యూల్
షెడ్యూల్ AMT లో, సెక్షన్ 115 JC కింద మీరు చెల్లించవలసిన ప్రత్యామ్నాయ కనీస పన్ను గణనను ధృవీకరించాలి.

3.13AMTC షెడ్యూల్
షెడ్యూల్ AMTCలో, మీరు సెక్షన్ 115 JD ప్రకారం పన్ను క్రెడిట్ వివరాలను చేర్చాలి

3.14 SPI షెడ్యూల్
షెడ్యూల్ SPIలో, మీరు పేర్కొన్న వ్యక్తుల ఆదాయాన్ని (ఉదా. జీవిత భాగస్వామి, మైనర్ పిల్లల) జోడించాలి, అవి సెక్షన్ 64 ప్రకారం మీ ఆదాయాన్ని జత చేయ దగిన లేదా కలపదగినవి అయి ఉండాలి.

3.15 షెడ్యూల్ SI
షెడ్యూల్ SI లో, మీరు ప్రత్యేక రేట్ల వద్ద పన్ను విధించదగిన ఆదాయాన్ని చూడగలరు. సంబంధిత షెడ్యూల్‌లలో అంటే షెడ్యూల్ OS, షెడ్యూల్ BFLA లలో పొందుపరిచిన మొత్తాల నుండి వివిధ ఆదాయ రకాల మొత్తాన్ని తీసుకుంటారు.

3.16షెడ్యూల్ మినహాయింపుపొందగల ఆదాయం (EI}
మినహాయింపు ఆదాయంలో (EI), మీరు మినహాయింపు పొందగల ఆదాయం వివరాలను అందించాలి. అంటే దాని అర్థం, మొత్తం ఆదాయంలో కలపకూడదని లేదా పన్ను విధించకూడదని తెలియజెయ్యాలి. ఈ షెడ్యూల్‌లో చేర్చబడిన ఆదాయ రకాలు వడ్డీ, డివిడెండ్, వ్యవసాయ ఆదాయం, ఇతర మినహాయింపు ఆదాయం, డి.టి.ఎ.ఎ. ద్వారా పన్ను పరిధిలోకి రాని ఆదాయాన్ని, పన్ను పరిధిలోకి పాస్ థ్రూ ఆదాయాన్ని కలిగి ఉంటాయి.

3.17 షెడ్యూల్ పాస్ ధ్రూ ఇన్ కమ్ (PTI]
షెడ్యూల్ పాస్ థ్రూ ఇన్ కమ్ (PTI] లో సెక్షన్ 115UA లేదా 115 UBలో సూచించిన విధంగా వ్యాపార ట్రస్ట్ లేదా పెట్టుబడి నిధి నుండి పొందిన ఆదాయ వివరాలను మీరు అందించాలి.

3.18షెడ్యూల్ విదేశీ వనరుల నుంచి ఆదాయం (FSI)
షెడ్యూల్ విదేశీ వనరులనుంచి ఆదాయం (FSI) లో, మీరు భారతదేశం వెలుపల ఉన్న ఏ వనరుల నుండి అయినా వచ్చే లేదా సేకరించే ఆదాయాన్ని నివేదించాలి. ఈ షెడ్యూల్ నివాసితులకు మాత్రమే అందుబాటులో ఉంది.

3.19 షెడ్యూల్ TR
షెడ్యూల్ TRలో, భారతదేశం వెలుపల ప్రతీ విదేశంలోనూ చెల్లించిన పన్నులకు భారతదేశంలో రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఆ విషయాల సారాంశాన్ని అందించాలి. షెడ్యూల్ FSIలో ఇచ్చిన వివరణాత్మక సమాచారం యొక్క సారాంశాన్ని ఈ షెడ్యూల్ సంగ్రహిస్తుంది.

3.20 షెడ్యూల్ FA
షెడ్యూల్ FA . లో, భారతదేశం వెలుపల ఉన్న ఏ వనరులనుండైనా పొందిన విదేశీ ఆస్తి లేదా ఆదాయ వివరాలను అందించాలి. మీరు సాధారణ నివాసి కానట్లయితే లేదా ప్రవాసి అయితే, ఈ షెడ్యూల్ పూర్తి చేయవలసిన అవసరం లేదు.

3.21 షెడ్యూల్ 5A
షెడ్యూల్ 5A లో, మీరు పోర్చుగీస్ సివిల్ కోడ్ 1860 కింద ఆస్తి యొక్క సమూహం వ్యవస్థచే నిర్వహించబడితే భర్త మరియు భార్య మధ్య ఆదాయాన్ని విభజించడానికి అవసరమైన సమాచారాన్ని అందించాలి.

3.22 షెడ్యూల్ AL
మీ మొత్తం ఆదాయం ₹50 లక్షలకు మించితే, షెడ్యూల్ AL లోని చర, స్థిరాస్తుల వివరాలను బహిర్గతం చేయడం తప్పనిసరి, అటువంటి ఆస్తులకు సంబంధించి ఉన్న బాధ్యతలతో పాటు తెలపాలి. మీరు ప్రవాసులు లేదా నివాసి (సాధారణంగా నివాసి కాకపోతే) అయితే, భారతదేశంలో ఉన్న ఆస్తుల వివరాలు మాత్రమే ప్రకటించాలి.

3.23పార్ట్ B - మొత్తం ఆదాయం (TI]
పార్ట్ B - మొత్తం ఆదాయం (TI) విభాగంలో, మీరు ఫారంలో నింపిన అన్ని షెడ్యూల్‌ల నుండి మొత్తం ఆదాయం గణన నిండి ఉండటాన్ని వీక్షించగలరు.

3.24 చెల్లించబడిన పన్ను
చెల్లించబడిన పన్ను విభాగంలో, మీరు మునుపటి ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పన్ను వివరాలను ధృవీకరించాలి. పన్ను వివరాలలో జీతం నుండి టి.డి.ఎస్. / జీతం కాకుండా ఇతర ఆదాయం నుండి టి.డి.ఎస్., టి.సి.ఎస్., అడ్వాన్స్ టాక్స్ మరియు స్వీయ మదింపు పన్ను ఉన్నాయి.

3.25పార్ట్ B-TTI
పార్ట్ B - TTI విభాగంలో, మీరు మొత్తం ఆదాయంపై పన్ను బాధ్యత యొక్క మొత్తం గణనను చూడగలరు.

మరిన్ని వివరాల కోసం, మ.సం. 2021-22 కోసం సి.బి.డి.టి. జారీ చేసిన ఐ.టి.ఆర్. ను దాఖలు చేయడానికి సూచనలను చూడండి.

4. ITR-2 ను ఎలా యాక్సెస్ చేసి, సమర్పించాలి

మీరు ఈ క్రింది పద్ధతుల ద్వారా మీ ఐ.టి.ఆర్. ను దాఖలు చేసి సమర్పించవచ్చు:

  • ఆన్‌లైన్ విధానం - ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా
  • ఆఫ్‌లైన్ విధానం - ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా

మీరు మరింత తెలుసుకోవడానికి ఆఫ్‌లైన్ యుటిలిటీ (ITRs కోసం) వినియోగదారు మాన్యువల్‌ను చూడండి .


ఆన్‌లైన్ విధానం ద్వారా ఐ.టి.ఆర్. ను దాఖలు చేసి సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి:

దశ 1: మీ వినియోగదారుని ఐడి, పాస్‌వర్డ్ లు ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.


దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, ఇ-ఫైల్ > ఆదాయపు పన్ను రిటర్న్స్ > లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయండి పై క్లిక్ చేయండి.


దశ 3: మదింపు సంవత్సరం 2021-22 ను ఎంచుకొని కొనసాగించండి పై క్లిక్ చేయండి.


దశ 4: దాఖలు చేసే విధానం ఆన్‌లైన్‌ ను ఎంచుకొని కొనసాగండి పై క్లిక్ చేయండి.


గమనిక: మీరు ఇప్పటికే ఆదాయపు పన్ను రిటర్న్ నింపి, సమర్పించడం పెండింగ్‌లో ఉంటే, ఫైలింగ్‌ తిరిగి ప్రారంభించండి పై క్లిక్ చేయండి. మీరు సేవ్ చేసిన రిటర్న్‌ను విస్మరించి, రిటర్న్‌ను వేరుగా సిద్ధం చేయడం ప్రారంభించాలనుకుంటే, క్రొత్త ఫైలింగ్‌ను ప్రారంభించండి పై క్లిక్ చేయండి.


దశ 5: మీకు వర్తించే విధంగా స్థితిని ఎంచుకొని, ముందుకు కొనసాగండి పై క్లిక్ చేయండి.


దశ 6: ఆదాయపు పన్ను రిటర్న్ రకాన్ని ఎంచుకోవడానికి మీకు రెండు ఎంపికలు ఉన్నాయి:

  • మీకు ఏ ఐ.టి.ఆర్. ఫారం దాఖలు చేయాలో ఖచ్చితంగా తెలియకపోతే, మీరు ఏ ఐ.టి.ఆర్. ఫారం దాఖలు చేయాలో నాకు సహాయం చేయండి ఎంపిక చేసి కొనసాగించు పై క్లిక్ చేయండి. సరైన ఐ.టి.ఆర్.ను నిర్ణయించడానికి సిస్టమ్ మీకు సహాయం చేసిన తర్వాత, మీ ఐ.టి.ఆర్. ను దాఖలు చేయడంతో కొనసాగవచ్చు.
     
  • మీరు ఏ ఐ.టి.ఆర్. దాఖలు చేయాలో మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటే, నేను దాఖలు చేయాల్సిన ఐ.టి.ఆర్. ఫారం ఏమిటో నాకు తెలుసు. ఎంపిక చేసుకోండి. డ్రాప్‌డౌన్ నుండి వర్తించే ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎంచుకోండి ఐ.టి.ఆర్. తో కొనసాగండి క్లిక్ చేయండి.
     

గమనిక:

  • మీకు వర్తించే ఐ.టి.ఆర్. లేదా షెడ్యూల్‌లు లేదా ఆదాయం మరియు తగ్గింపుల వివరాలు మీకు తెలియకపోతే, ప్రశ్నావళికి ప్రతిస్పందనగా మీ సమాధానాలు అవి తెలుసుకునేందుకు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఐ.టి.ఆర్. సరిగా / లోపం లేకుండా దాఖలు చేయడంలో మీకు సహాయపడతాయి.
  • మీకు వర్తించే ఐ.టి.ఆర్. లేదా షెడ్యూల్‌లు లేదా ఆదాయం మరియు తగ్గింపుల వివరాలు మీకు తెలిస్తే, మీరు ప్రశ్నలను దాటవేయవచ్చు.
  • మరింత తెలుసుకోవటానికి మ.సం. 2021-22కోసం విజార్డ్ ఆధారిత ఐ.టి.ఆర్. వినియోగదారు మాన్యువల్ చూడండి .


దశ 7: మీరు వర్తించే ఐ.టి.ఆర్. ను ఎంచుకున్న తర్వాత, అవసరమైన పత్రాల జాబితాను గుర్తించండి మరియు ప్రారంభించండి అని క్లిక్ చేయండి.


దశ 8: మీరు ముందుగా నింపిన డేటా సమీక్షించి అవసరమైతే దాన్ని సవరించండి. మిగిలిన / అదనపు డేటాను నమోదు చేయండి (అవసరమైతే). ప్రతి విభాగం చివరిలో నిర్ధారించండి క్లిక్ చేయండి.


దశ 9: మీ ఆదాయం, మినహాయింపు వివరాలను వేరే విభాగంలో నమోదు చేయండి. ఫారం లోని అన్ని విభాగాలను పూర్తి చేసి, ధృవీకరించిన తరువాత, కొనసాగండి క్లిక్ చేయండి.


దశ 9a: పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటే
మీరు అందించిన వివరాల ఆధారంగా మీ పన్ను లెక్కించినప్పటి సారాంశం మీకు చూపించబడుతుంది. గణన ఆధారంగా చెల్లించాల్సిన పన్ను బాధ్యత ఉంటే, మీరు ఇప్పుడు చెల్లించండి మరియు తరువాత చెల్లించండి ఎంపికలు పేజీ దిగువన చూస్తారు.


గమనిక:

  • ఇప్పుడు చెల్లించండి ఎంపికను ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది. BSR కోడ్ మరియు చలానా సీరియల్ నంబర్‌ను జాగ్రత్తగా చూసి చెల్లింపు వివరాలలో వాటిని నమోదు చేయండి.
  • మీరు తరువాత చెల్లించాలని ఎంచుకుంటే, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత చెల్లించవచ్చు, కాని డిఫాల్ట్‌ మదింపుదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. అంతేకాదు, చెల్లించవలసిన పన్నుపై వడ్డీ చెల్లించే బాధ్యత తలెత్తుతుంది.

దశ 9b: పన్ను బాధ్యత లేకపోతే ( డిమాండ్ లేదు/ రీఫండ్ లేదు ) లేదా మీరు రీఫండ్ కి అర్హులు అయితే

పన్ను చెల్లించిన తరువాత, ప్రివ్యూ రిటర్న్ క్లిక్ చేయండి. చెల్లించాల్సిన పన్ను బాధ్యత లేకపోతే, లేదా పన్ను గణన ఆధారంగా రీఫండ్ ఉంటే, మీరు ప్రివ్యూ మరియు మీ రిటర్న్ సమర్పించండి పేజీకి వెళ్తారు.


దశ 10: ప్రివ్యూ మరియు మీ రిటర్న్ సమర్పించండి పేజీపై ప్రదేశం నమోదు చేయండి, డిక్లరేషన్ చెక్‌బాక్స్‌ను ఎంచుకొని ధృవీకరణకు కొనసాగండి పై క్లిక్ చేయండి.


గమనిక: మీరు మీ రిటర్న్ సిద్ధం చేయడంలో పన్ను రిటర్న్ సిద్ధం చేసే వ్యక్తి లేదా టి.ఆర్.పి. పాల్గొనకపోతే, మీరు టి.ఆర్.పి. కి సంబంధించిన టెక్స్ట్‌బాక్స్‌లను ఖాళీగా వదిలివేయవచ్చు.


దశ 11: ధృవీకరించిన తరువాత మీ రిటర్న్ ప్రివ్యూ దాఖలు చేయండి పేజీ పై ధృవీకరణకు కొనసాగు పై క్లిక్ చేయండి.


గమనిక: మీ రిటర్న్ లో లోపాల జాబితా కనిపించినట్లయితే, లోపాలను సరిదిద్దడానికి తిరిగి ఫారమ్‌కు వెళ్ళాలి. లోపాలు లేకపోతే, ధృవీకరణకు కొనసాగండి క్లిక్ చేయడం ద్వారా మీ రిటర్న్ ఇ-ధ్రువీకరణ చేయటానికి కొనసాగవచ్చు.


దశ 12: మీ ధృవీకరణ పూర్తి చేయండిపేజీలో, మీ ప్రాధాన్యత ఎంపికను ఎంచుకొని కొనసాగించు పై క్లిక్ చేయండి.


మీ రిటర్న్‌ను ధృవీకరించడం తప్పనిసరి, ఇ - ధృవీకరణ (ఇప్పుడు ఇ - ధృవీకరించండి -ఎంపిక సిఫార్సు చేయబడుతోంది ) మీ ఐ.టి.ఆర్. ను ధృవీకరించడానికి సులభమైన మార్గం - ఇది వేగవంతమైనది, పేపర్‌ అవసరం లేదు. అంతేకాదు, సంతకం చేసి పోస్ట్ ద్వారా సి.పి.సి.కి భౌతిక ITR - V ను పంపడం కంటే సురక్షితమైనది.


గమనిక: మీరు తరువాత ఇ-ధృవీకరించండి ఎంచుకుంటే, మీరు మీ రిటర్న్‌ను సమర్పించవచ్చు, అయితే, మీ ఐ.టి.ఆర్. దాఖలు చేసిన 120 రోజుల్లోపు మీ రిటర్న్‌ను మీరు ధృవీకరించవలసి ఉంటుంది.


దశ 13: ఇ - ధ్రువీకరణ పేజీలో, మీరు రిటర్న్‌ను ఇ - ధృవీకరించి, కొనసాగించడానికి కావలసిన ఎంపికను ఎంచుకొని కొనసాగించు పై క్లిక్ చేయండి.

గమనిక:

  • మరింత తెలుసుకోవడానికి ఎలా ఇ - ధృవీకరించాలో వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
  • మీరు ITR-V ద్వారా ధృవీకరించినట్లయితే, 120 రోజుల్లోపు సాధారణ / స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను శాఖ, బెంగళూరు 560500 కు మీరు సంతకం చేసిన ITR-V యొక్క భౌతిక కాపీని పంపాలి.
  • దయచేసి మీ బ్యాంక్ ఖాతాను ముందుగా ధృవీకరించారని నిర్ధారించుకోండి, తద్వారా మీ బ్యాంక్ ఖాతాకు జమ చేసిన ఏదైనా రీఫండ్‌లు మీకు క్రెడిట్ చేయబడతాయి.
  • మరింత తెలుసుకోవడానికి నా బ్యాంక్ ఖాతా అనే వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.

మీరు మీ రిటర్న్‌ను ఇ-ధృవీకరణ చేసిన తర్వాత, లావాదేవీ గుర్తింపు ID మరియు రశీదు సంఖ్యతో పాటు విజయవంతమైనదన్న సందేశం కనిపిస్తుంది మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడి లపై ధృవీకరణ సందేశాన్ని కూడా స్వీకరిస్తారు.

4. సంబంధిత విషయాలు